చుట్ట పోళీలు
కావలసినవి :
పేని రవ్వ - కప్పు, మైదా - అర కప్పు , ఉప్పు - కొద్దిగా , వంటసోడా - చిటికెడు , నెయ్యి - రెండు చెంచాలు, పుట్నాల పప్పు , పంచదార - కప్పు చొప్పున , ఎండుకొబ్బరి తురుము - పావుకప్పు , యాలకుల పొడి - చెంచా, బాదం,జీడిపప్పు, సారపప్పు పలుకులు - పావుకప్పు , నూనె - వేయించడానికి సరిపడా
తయారీ :
ఒక గిన్నెలో పేని రవ్వ , మైదా, వంట సోడా , ఉప్పు కొద్దిగా నెయ్యి తీసుకుని కలిపి .. ఆ తర్వాత నీళ్ళతో చపాతీ పిండిలా చేసుకోవాలి. దీన్ని అరగంట నాననివ్వాలి. ఇంతలో పుట్నాల పప్పు ,పంచదార కలిపి పొడి చేసుకోవాలి. అందులో యాలకుల పొడి , ఎండుకొబ్బరి తురుము చేర్చాలి. మిగిలిన నెయ్యిని కరిగించి బాదం, జీడిపప్పు, సారపప్పు పలుకుల్ని వేయించుకుని పుట్నాల పొడిలో కలపాలి. ఇప్పుడు నానిన పిండిని పలుచని పూరీల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. ఇలా చేసుకున్న పూరిల్ని తీసుకుని ఒక్కోదానిపై పుట్నాల పొడిని చల్లి గుండ్రంగా చుట్టేయాలి. తియతియ్యని చుట్టూ పోళీలు రెడీ.
0 comments:
Post a Comment