Sunday, January 27, 2013

కమ్మని రుచితో ఘుమ..ఘుమలాడే పెరుగు వంకాయ


కమ్మని రుచితో ఘుమ..ఘుమలాడే పెరుగు వంకాయ


కావలసిన పదార్థాలు
వంకాయలు: 6-8(మీడియం సైజ్)
పెరుగు : 1-2cups
పసుపు: 1/2tsp
పంచదార: 1tsp
ఉల్లిపాయ పేస్ట్: 2-3tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పచ్చిమిర్చి: 4(మద్యకు కట్ చేసినవి)
పచ్చికొబ్బరి తురుము: 1/2cup
గసగసాలు: 2tbsp
కారం: 2tsp
ధనియా పౌడర్: 2tsp
కొత్తిమీర: 1/2cup(తరిగి పెట్టుకోవాలి
నూనె: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మద్యలోనికి(గుత్తివంకాయలకు) కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చికొబ్బరి తురుము, గసగసాలు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత అన్నివంకాయలను ఉప్పు నీటిలో బాగా శుభ్రం చేసి, పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వంకాయలను వేసి వేయించాలి. అలాగే వంకాయలతో పాటు పసుపు, పంచదార, ఉప్పు చేర్చి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నూనె వేసి అందులో ఉల్లిపాయ పేస్ట్ ,అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించి అందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
4. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొబ్బరి పేస్ట్ మరియు కారం, ధనియా పొడి, పసుపు, ఉప్పు చేర్చి బాగా వేయించాలి. తక్కువ మంట మీద పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి.
5. మసాలా వేగిన తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ కలియ బెట్టాలి. పెరుగు మిశ్రమంతో మసాలా మిశ్రమం బాగా కలిసిపోయేంత వరకూ కలుపుతూ ఉడికించుకోవాలి.
6. పెరుగులో మసాలా మిశ్రమం బాగా ఉడికి చిక్కబడిన తర్వాత వేయించి పెట్టుకొన్న వంకాయలను వేసి మరో ఐదు నిముషా పాటు తక్కువ మంటలో ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. దింపుకొన్న తర్వాత కూడా మరికొద్దిగా పెరుగు కలుపుకోవాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ . కొత్తిమీర తరగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి...

0 comments:

Post a Comment