Thursday, January 24, 2013

వెజ్ మంచురియా

వెజ్‌ మంచూరియా :-
కావలసినవి: క్యాబేజి, క్యారెట్‌ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు - రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి- అరకప్పు, సోయాసాస్‌ - చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాలపొడి, పంచదార- చెంచా చొప్పున, అజినోమోటో - చిటికెడు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ:
క్యాబేజి, క్యారెట్‌ ముక్కల్ని కలిపి.. గట్టిగా పిండితే నీరు పోతుంది. వీటికి మొక్కజొన్నపిండి, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. సాధ్యమైనంత వరకు నీరు అవసరం లేదు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి.
ఇప్పుడు అదే బాణలిలో రెండుచెంచాల నూనె వేడిచేసి వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపొరక ముక్కలు వేయించాలి. కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు, మిరియాలపొడి, అజినోమోటో, పంచదార, సోయాసాస్‌ కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా వేయించిపెట్టుకున్న ఉండల్ని ఈ మిశ్రమంలో వేయాలి. సన్నని మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేయాలి.
సర్వ్‌ చేసేముందు ఉల్లిపొరక ముక్కలు, కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే సరిపోతుంది.

0 comments:

Post a Comment