Sunday, January 27, 2013

మిక్డ్స్ వెజిటేబుల్ వడ

మిక్డ్స్ వెజిటేబుల్ వడ

కావలసిన పదార్థాలు
బీన్స్ ముక్కలు: 1cup
క్యారెట్ ముక్కలు: 1/4cup
పాలకూర: 1 1cup
కొత్తిమీర: 1cup
క్యాబేజీ: 1/2cup
పచ్చిబఠాణీలు: 1/4cup
గరం మసాల: 2tbsp
పచ్చిమిర్చి: 6-8
అల్లం వెల్లిల్లి పేస్ట్: 2tbsp
బియ్యం పిండి: 1/2kg
శెనగపిండి: cup
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం
1. ముందుగా కరివేపాకు, కొత్తిమీర, పాలకూరలను శుభ్రం గా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత పచ్చిబఠాణీలు, క్యారెట్స్, క్యాబేజీ, బీన్స్, ముక్కల్ని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండి, శెనగపిండి, తరిగిన పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఉడికించిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలను కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ గారెల పిండిలా కలపాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకొన్న పిండిని గారెల్లా చేసుకుని, నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
5. అంతే వెజ్ గారెలు రెడీ. ఈ గారెల్ని టొమాటో సాస్ తోగానీ, కొబ్బరి చట్నీతో గానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. సాయంత్రంవేళల్లో స్నాక్స్ లా తినడానికి బాగుంటాయి.

0 comments:

Post a Comment