పకోడీ కుర్మా
కావల్సినవి: సెనగపప్పు- కప్పు, పచ్చిమిర్చి- ఐదు, అల్లం- చిన్నముక్క, మెంతులు- పావుచెంచా, కరివేపాకు- నాలుగురెబ్బలు, ఉప్పు, కారం- రుచికి సరిపడా, నూనె- మూడు కప్పులు, కొబ్బరి తురుము- అరకప్పు, జీడిపప్పు- నాలుగు, గసగసాలు- చెంచా, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- ఒకటి, అల్లంవెల్లుల్లి- అరచెంచా, ధనియాలపొడి- చెంచా, పసుపు- చిటికెడు, బిర్యానీ ఆకులు- రెండు, యాలకులు- మూడు, జీలకర్ర- అరచెంచా, నెయ్యి- మూడు చెంచాలు.
తయారీ: సెనగపప్పును నానబెట్టి, రెండు గంటలయ్యాక నీళ్లు తీసేసి, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో దంచిన అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు వేసి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక బాణలిలో నూనె వేడిచేసి పిండిని పకోడీల్లా వేయాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చాక తీయాలి. ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని కాసిని నీళ్లు కలిపితే ముద్దగా తయారవుతుంది. తరవాత బాణలిలో నూనె వేడి చేసి.. జీలకర్ర, మెంతులు, పసుపు, బిర్యానీ ఆకులు, యాలకులపొడి, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిసేపటికి మిగిలిన పచ్చిమిర్చి తరుగు, టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించి.. అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు, కారం, ధనియాల పొడి వేసి కలియతిప్పాలి. తరవాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకొన్న కొబ్బరి ముద్ద, కప్పు నీళ్లు, ఉప్పు చేర్చి మూత పెట్టాలి. ఘుమఘుమలాడే గ్రేవీ సిద్ధమయ్యాక పకోడీలు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి. పకోడీ కుర్మాను అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.

0 comments:
Post a Comment