Saturday, January 26, 2013

"అరటికాయ కూర"

"అరటికాయ కూర" 

కావలసిన పదార్థాలు :
అరటికాయలు... రెండు
ఉల్లిపాయలు... 4
పచ్చిమిర్చి... 8
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... సరిపడా
నూనె... 2 టీ.
జీలకర్ర... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
సెనగపప్పు.... 2 టీ.
వెల్లుల్లి... 6 రేకలు

తయారీ విధానం :
వెల్లుల్లి మెత్తగా నూరాలి. అరటికాయల తొక్కు తీసి గుండ్రంగా ముక్కలుగా కోసి ఉడికించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె పోసి తాలింపు చేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.

తరువాత పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన అరటిముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. ఆపై మెత్తగా నూరిన వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా కలియబెట్టి, కొంచెం నీరు పోసి దగ్గరగా ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే అరటికాయ కూర రెడీ అయినట్లే...!

0 comments:

Post a Comment