బఠాణీ మెంతి అన్నం
కావల్సినవి:
బియ్యం- రెండు కప్పులు, మెంతికూర - రెండు కట్టలు, పచ్చిబఠాణీలు- కప్పు, దాల్చినచెక్క- చిన్నముక్క, లవంగాలు- ఏడు, యాలకులు- చెంచా, షాజీరా- చెంచా, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి - మూడు, ఉప్పు- తగినంత, జీడిపప్పు- పది, నూనె- ఐదు చెంచాలు, నెయ్యి- రెండు చెంచాలు, మిరియాల పొడి- చెంచా.
తయారీ:
బియ్యం కడిగి అన్నం పొడిగా వండుకోవాలి. పళ్లెంలోకి తీసుకొని మసాలా, మిరియాల పొడి కలిపి చల్లారబెట్టాలి. తరవాత మెంతికూరని శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బఠాణీలను కుక్కర్‌లో వేసి రెండు విజిళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి వెల్లుల్లి ముక్కలు, ముద్దగా చేసిన పచ్చిమిర్చి, షాజీరా, వేసి వేయించి మెంతికూర, ఉడికించిన బఠాణీలు, ఉప్పుజోడించి మూతపెట్టాలి. కొద్దిసేపటికి చల్లారబెట్టిన అన్నం వేసి బాగా కలియతిప్పి పొయ్యి పై నుంచి దింపేయాలి. దీన్ని చిల్లీసాస్ లేదా రైతాతో తింటే భలేరుచిగా ఉంటుంది.

0 comments:
Post a Comment