Saturday, January 26, 2013

శెనగల స్పెషల్ గ్రేవీ-పన్నీర్ చన్నా మసాలా...

శెనగల స్పెషల్ గ్రేవీ-పన్నీర్ చన్నా మసాలా...

paneer chana masala

కావలసిన పదార్థాలు:
చెన్నా(పచ్చిశెనగలు): 3-4cups
టీబ్యాగ్స్: 2
ఉల్లిపాయలు: 2-3(కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పచ్చిమిర్చి 4-6(కట్ చేసుకోవాలి)
టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tbsp
కాశ్మిరీ మిర్చి పౌడర్: 1tbsp(బయట మార్కెట్లో దొరుకుతుంది)
పసుపు: చిటికెడు
పంచదార: 1tsp
పన్నీర్: 2cups(కావలసిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి)
గరం మసాలా: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చెన్నా(పచ్చి శెనగలను)రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. శెనగలు నానబెట్టే నీటిలో టీ బ్యాగ్ వేయాలి.(టీ బ్యాగ్ వేయడం వల్ల శెనగలు మంచి కలర్ (బ్రౌన్ కలర్)గా ఉంటాయి.
2. మరుసటి రోజు శెనగలలోని నీరు వంపేసి శుభ్రం చేసి, కుక్కర్ లో వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.( శెనగలను ఉడికించేటప్పుడు కూడా టీబ్యాగ్ ను వేయవచ్చు). కుక్కర్ మూత తీసి ఒక గిన్నెలోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
4. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ , వేసి వేయించిన తర్వాత టమోటో ముక్కలను కూడా వేసి, కొద్దిగాఉప్పు చేర్చి మెత్తగా అయ్యేంత వరకూ వేయించాలి.
5. టమోటో కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో కారం, కాశ్మిరీ చిల్లి పౌడర్, పసుపు మరియు పంచదార కలుపుకొని మరికొద్దిసేపు వేయించాలి.
6. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకూ వేయించిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలను కూడా వేసి తక్కువ మంట మీద వేయించుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న చెన్నా(శెనగలును) కూడా చేర్చి బాగా కలగలిపి మీడియం మంటమీద ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి.
8. తర్వాత రెండు కప్పుల నీటిని చేర్చి ఎక్కువ మంట పెట్టి పది నిముషాల పాటు బాగా ఉడకనివ్వాలి. నీరంత ఇమిరిపోయి గ్రేవీ చిక్కబడేటప్పుడు గరం మసాలా, కొత్తమీర తరుగు చల్లుకొని రెండు నిముషాల తర్వాత క్రిందికి దింపుకోవాలి. అంతే పంజాబీ వంటకం చెన్నా పన్నీర్ గ్రేవీ రెడీ.. అన్నం, రోటీ, చపాతీలతో తినడమే ఆలస్యం...

0 comments:

Post a Comment