Saturday, April 30, 2016

బంగాళదుంప - కొత్తిమీర చపాతీ

కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.

• వంకాయతో..చింతచిగురు

కావల్సినవి:
వంకాయలు - అరకేజీ, చింతచిగురు - ఒకటింబావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు, నూనె - పావుకప్పు, పసుపు - చెంచా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - ఐదు, ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాలపొడి - చెంచా, జీలకర్ర - చెంచా, సెనగపప్పు - చెంచా, ఆవాలు - చెంచా, కూరకారం - అరచెంచా.

తయారీ:
ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెవేడిచేసి జీలకర్రా, ఆవాలూ, సెనగపప్పును వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింతచిగురూ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూరకారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.

Thursday, April 14, 2016

వెజిటబుల్ పకోడి

సెనగపప్పు -అరకప్పు
పెసరపప్పు -అరకప్పు
బియ్యం -పావుకప్పు
పాలకూర తరుగు-రెండుటేబుల్ స్పూన్స్
తోటకూరతరుగు-రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర తరుగు-రెండుటేబుల్స్పూన్స్
కాబేజి తరుగు-రెండుటేబుల్స్పూన్స్
చిన్నగాకట్ చేసినకాలిఫ్లోవేర్-రెండుటేబుల్స్పూన్స్
ఉల్లిముక్కలు--అరకప్పు
పచ్చిమిర్చిపేస్టు-టేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికి సరిపడా
సెనగపప్పు,పెసరపప్పు,బియ్యం మూడుగంటలముందు నానబెట్టి మెత్తగా
grind చేసుకోవాలి
రుబ్బినపిండిలో పైన చెప్పుకున్నవన్నివేసుకోవాలి
స్టవ్ వెలిగించినూనెవేడిచేయాలి.కాగినతరువాతపిండినిపకోడీలవేసిదోరగావేపుకోవాలి
వేడి వేడిపకోడీతయారు

పప్పు పుణుకులు

కావల్సినవి:పెసరపప్పు, సెనగపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు - రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు - తగినంత, కారం - కొద్దిగా, ఆమ్‌చూర్‌పొడి - అరచెంచా, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - రెండు కట్టలు, వాము - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా. 

తయారీ: అన్నిరకాల పప్పుల్ని మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి మిక్సీజారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇది కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని చెంచాతో తీసుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. మామూలు గారెకంటే రుచిగా ఉంటుంది.

Tuesday, April 5, 2016

సమ్మర్లో కూల్ కూల్ బట్టర్ మిల్క్

సమ్మర్లో కూల్ కూల్ బట్టర్ మిల్క్ తో పొందే పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
మజ్జిగ అనేది పానీయం. ఇది పాల ఉత్పత్తుల నుండి తయారయ్యేవి. మజ్జిగ భారత దేశంలో ఒక ముఖ్యమైన పానీయం. దక్షిణ భారతదేశంలో వీటి వాడం ఎక్కువ. ఎందుకంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక పానీయం. మజ్జిగకు కొన్ని సుగంధ ద్రావ్యాలు జోడించి తయారు చేస్తారు. మజ్జిగ తయారీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఉప్పు, పెప్పర్, పచ్చిమిర్చి , అల్లం జోడించి మసాలా మజ్జిగన తయారు చేస్తారు. మజ్జిగ - పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది.
మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. మీరు తీసుకునే ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. మజ్జిగ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలామంది అనుకుంటుంటారు. కాని నిత్యం మీరు తీసుకునే పాలకన్నా ఇందులో కొవ్వు, కెలొరీల శాతం చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలోనున్న వేడిని తగ్గించేందుకు మజ్జిగ ఉపయోగపడుతుంది.
మజ్జిగలోని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..:
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి:
నీళ్లు, పెరుగు, కొన్ని రకాల స్సైసెస్, ఉప్పుు కలిపి చేసే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన మజ్జిగ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్‌కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పుు, నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి సమ్మర్‌లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు
బరువు తగ్గడానికి:
ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఆహారాన్ని త్వరగా జీర్ణమవడానికి మజ్జిగ సహాయపడుతుంది. దీనివల్ల ఫ్యాట్ బయటకు పోయి బరువు తగ్గడం తేలికవుతుంది. మీరు కనుక డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలుతో తయారు చేసె పెరుగు లేదా మజ్జిగా డైటేరియన్స్ కు చాలా ఆరోగ్యకరం. ఇది బరువును తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్:
కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన గుణాలు మజ్జిగలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి న్యాచురల్ రెమిడీ. రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్ తగ్గుతాయి.
బోన్ హెల్త్ :
మజ్జిగ డైరీ ప్రొడక్ట్, ఇందులో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు అంతేకాదు. శరీరవృద్దికి బాగా సహాయ పడుతుంది. ఎముకలకు కావల్సిన బలాన్ని ఇచ్చి ఎముకుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంతో పాటు మజ్జిగ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.
అసిడిటిని-వాపును తగ్గిస్తుంది:
మీ శరీరంలో లాక్టోజ్ సరైనపాళ్ళలో లేనప్పుడు మజ్జిగ తాగినప్పుడు మీ కావల్సిన లాక్టోజ్ ను అందిస్తుంది. ఇది కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటి, వాతం, గుండెలో మంటగా ఉండటం వంటి వాటిని తగ్గిస్తుంది. అంతే కాదు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది.
అధిక విటమిన్స్ ఉన్న డ్రింక్:
మజ్జిగలో అధిక శాతంలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్, నయాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుాయి
మినిరల్స్:
మజ్జిగలో మినిరల్స్ యొక్క ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఇది ఐరన్, భాస్వరం, జింక్, పొటాషయం అధిక శాతంలో కలిగి ఉంటాయి
బ్లడ్ ప్రెజర్:
మజ్జిగలో బయో యాక్టివ్ ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. రెగ్యులర్‌గా మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడేవాళ్లకు మజ్జిగ ఎక్సలెంట్ హోం రెమిడీ
బ్యాక్టీరియా:
డైజెస్టివ్ ట్రాక్ హెల్తీగా ఉండటానికి మజ్జిగ సహాయపడుతుంది. చెడు బ్యాక్టీరియా తగ్గించి, గ్యాస్ట్రీక్ సమస్యలు దరిచేరకుండా అరికడుతుంది. క్యాన్సర్, డైయేరియా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలను నివారించడానికి మజ్జిగ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
వేసవి పానీయం:
శరీరం శక్తిని కోల్పోయినప్పుడు, పొడిబారుతున్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తేమను అందించి శక్తి పుంజుకొనేలా చేస్తుంది. సూర్యతాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా మజ్జిగ ను తీసుకోవాలి.
కావల్సినవి: చింతకాయలు - పది నుంచి పన్నెండు, అన్నం - కప్పు, సెనగపప్పూ, మినప్పప్పు - రెండూ కలిపి టేబుల్‌స్పూను, ఆవాలు - చెంచా, పల్లీలు - టేబుల్‌స్పూను, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఇంగువ - పావుచెంచా, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, తెల్ల నువ్వులపొడి - టేబుల్‌స్పూను, నూనె - టేబుల్‌స్పూను.
తయారీ:: చింతకాయల్ని తొక్కు తీసేసి అందులో రెండు పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పూ, సగం పసుపూ వేసి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి పల్లీలు వేయించాలి. రెండునిమిషాల తరవాత సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చీ, మిగిలిన పచ్చిమిర్చీ, కరివేపాకూ, ఇంగువా, మిగిలిన పసుపు వేసుకోవాలి. అన్నీ వేగాక కొద్దిగా ఉప్పూ, ముందుగా చేసుకున్న చింతకాయ ముద్ద కూడా వేయాలి. చింతకాయ కొద్దిగా వేగాక ఇందులో అన్నం వేసి బాగా కలపాలి. చివరగా తెల్ల నువ్వుల పొడి వేసి కలిపి ఓ గిన్నెలోకి తీసుకుంటే చాలు. నువ్వుల వాసన ఇష్టం లేనివారు....వేయించిన వేరుశెనగపప్పును బరకగా మిక్సీలో పట్టుకుని కలిపితే కొత్త రుచి వస్తుంది.

సగ్గుబియ్యం మురుకులు

బియ్యంపిండి-మూడుకప్పులు
సగ్గుబియ్యం-ఒకకప్పు
కారం-రెండుటీస్పూన్స్
నువ్వులు-అరకప్పు
వెన్న-నాలుగుటేబుల్స్పూన్స్
నూనె-వేయించడానికిసరిపడా
ఉప్పు-రుచికిసరిపడా
సగ్గుబియ్యంనుఆవిరిమీద కుక్కర్లోఅయిదు విసిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.తర్వాతఒకవెడల్పాటిపాత్ర లోఉడికినసగ్గుబియ్యంనాకు కారం,నువ్వులు,ఉప్పు, బియ్యంపిండి చేర్చిసరిపడానీరుకలుపుతూముద్దలాచేసుకోవాలి.ఈమిస్రమంను
జంతికలగొట్టంలోపెట్టినొక్కుకోవాలి.నూనెబాగాకాగినతరువాతవత్తుకొనిదోరగావేగించుకోవాలి.ఇవిడబ్బాలో నిలువఉంటాయి