Thursday, January 31, 2013

న్యూట్రిషన్ ఫుడ్ - క్యారెట్ రైస్

న్యూట్రిషన్ ఫుడ్ - క్యారెట్ రైస్

మనం ప్రతిరోజు తినే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అశ్రద్ద చేయకుండా తింటుంటే పలు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అలాంటి వాటిల్లో క్యారెట్ మంచి ఆరోగ్యకరమైర పోషకాహారం. విటమిన్లు, ఖనిజాలు రె...ండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పర
ిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు.

కావాల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
క్యారెట్ తురుము: 2cups
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-6
ఎండుమిర్చి: 2-3
శెనగపప్పు: 2tbsp
మినప్పప్పు: 2tbsp
ఆవాలు, జీలకర్ర: 2tbsp
గరం మసాలా: 1tbsp
వేయించిన వేరు శెనగ: 3tbsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర తురుము: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. మొదటగా బియ్యం పూర్తిగా ఉడకక ముందు పొడిపొడిగా ఉన్న సమయంలోనే తీసి, తగినంత ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన అన్నంను ఓ ప్లేట్ లో తీసుకుని ఆరబెట్టాలి.
2. తర్వాత స్టౌపై పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపులా చేయాలి. అందులోనే శెనగపప్పు, ఉద్దిపప్పు చేర్చి బాగా వేయించాలి. తర్వాత ముక్కలుగా చేసినా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు క్యారెట్ తురుమును అందులో వేసి, క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడకబెట్టాలి.
4. ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టి చల్లారబెట్టుకొన్నఅన్నంలో కలపాలి.
5. చివరగా వేయించిన వేరుశెనగ పప్పులను బద్దలుగా చేసి, అన్నంలోకలపాలి. ఇక కరివేపాకు, కొత్తిమీరలను పైన చల్లి గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి. దీనికి రైతా మంచి కాంబినేషన్. అంతే క్యారెట్ రైస్ రెడీ....

0 comments:

Post a Comment