Wednesday, January 30, 2013

బ్రెడ్ బోండా

బ్రెడ్ బోండా

కావలసిన పదార్థాలు
బ్రెడ్: 5స్లైసెస్
బంగాళదుంప: 3
పచ్చిబఠానీలు: 2tbsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర తరుగు: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్తమీరను నీళ్ళలో కడిగి చిన్ని చిన్న తరుక్కోవాలి. అలాగే బంగాళదుంపలను కూడ కడిగి రెండు లేదా మూడ బాగాలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి, అందులో కట్ చేసి పెట్టుకొన్న బంగాళాదుంపల ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనిచ్చి పై పొట్టు తీసి బంగాళదుంపలను చిదిమి పెట్టుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి వేయించి వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తర్వాత అందులో ఉడికించిన పచ్చిబఠానీలను, ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, పసుపు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
6. బంగాళదుంప కర్రీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బంగాళదుంపను కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని గుండ్రగా బాల్స్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని చివరలు కట్ చేసి(తొలగించి) బ్రెడ్ ను తడిచేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ లో ముందుగా తయారు చేసుకొన్న పొటాటో మిశ్రమం యొక్క బాల్స్ ను పెట్టి రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
8. స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ బాల్స్ ను వేడినూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొన్నాక బ్రెడ్ బోండాలమీద చాట్ మసాలాను చిలకరించుకొని కొత్తమిర తరగుతో గార్నిష్ చేసి గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. బ్రెడ్ బోండా రెడీ.

0 comments:

Post a Comment