Monday, August 18, 2014

శెనగల సలాడ్

శెనగలను చోలే లేదా చెన లేదా చిక్ పీస్ గా పిలుస్తుంటారు. వీటితో తయారు చేసే వంటలంటే చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టమే. రెగ్యులర్ వెజిటేబుల్స్ తో బోరు కొట్టినప్పుడు కొంచెం రుచి మార్చడానికి మరియు శ్రావణమాసంలో వర్షకాలంలో, ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా ఉండటానికి శెనగలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది హై న్యూట్రీషియన్ ఫుడ్ . కాబీళీ చెన్న హార్ట్ పేషంట్లకు కూడా చాలా ఆరోగ్యకరమైనది ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ శెనగలతో సలాడ్ మీకోసం...

కావలసిన పదార్థాలు:
శనగలు (ఉడికించినవి) : 3cups
బంగాళదుంప: 1 (ఉడికించి, ముక్కలు చేయాలి),
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి: 1(సన్నగా తరగాలి)
ఉల్లితరుగు: 2tbsp
టొమాటో: ఒకటి(సన్నగా తరగాలి)
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: చిటికెడు
కొత్తిమీర తరుగు: tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి.

2. తర్వాత ఉడికించిన శెనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే శ్రావణ మాసపు శెనగల సలాడ్ రెడీ. వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.

నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.