Wednesday, January 30, 2013

ఆలూ మిర్చీ బజ్జీ.

 ఆలూ మిర్చీ బజ్జీ.

మిర్చీ బజ్జీ ఇండియన్ హాట్ స్నాక్. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ మిర్చీబజ్జీయే .వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి మిర్చీ బజ్జీ భలే రుచిగా ఉంటుంది. మిర్చీ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంత మంది మాత్రం పచ్చిమర్చిని తినడానికి బయపడుతుంటారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా అధికమే.

కావలసిన పదార్థాలు:
బజ్జీ పచ్చిమిర్చి (పొడవైనవి): 20
బంగాళాదుంపలు: 1/4kg
కారం: 1tbsp
గరం మసాలా: 1tbsp
చాట్ మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
పిండికోసం:
శెనగపిండి: 250grms
బేకింగ్ సోడా: 1tsp
కారం: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

1. ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడికగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక సైడ్ మద్యకు పొడవుగా కట్ చేసి మద్యలో నుండి మిర్చీలోని గింజలను తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి చిదిమి పెట్టుకోవాలి. దానికి కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు చేర్చి అన్నింటినీ బాగా కలగలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని (మిర్చి సంఖ్య)20 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో మిశ్రామన్ని డలుగా లేదా మిర్చి పొడవుగా చేత్తో రుద్దుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి. ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బజ్జీలను వేయడానికి బజ్జీ పిండిని తయారు చేసుకోవాలి. అందుకు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5. పది నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగే నూనె లోవేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, ప్లేట్ లోనికి తీసుకొని కోకన్ చట్నీ లేదా పుదీనా చట్నీతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment