Monday, March 28, 2016

దోసకాయ పచ్చడి::Dosakaya Pachhadi:-

కావలసినవి పదార్ధాలు :
దోసకాయ : ఒకటి
ఎండిమిర్చి: ఆరు (పచ్చిమిర్చితో కూడా చెయ్యొచ్చు)
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
వెల్లుల్లి రేకలు : ఆరు
చింతపండు : ఉసిరి కాయంత
తయారుచేయు విధానం ::
1) దోసకాయను చెక్కు తీసి ముక్కలుగా చేయాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఎండిమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి.
3) ఇవి తీసి అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
4) మిక్సి జార్లో వేపిన మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లిని చింతపండు వేసి మెత్తగా మిక్సి చెయ్యాలి. దీనిలో మగ్గిన దోసముక్కలు వేసి ఒక సెకన్ తిప్పాలి (మిక్సి బటన్ అన్ చేసి ఆఫ్ చెయ్యటం).
5) దోసకాయ మెత్తగా అయితే బాగుండదు. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది.
6) ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక, పచ్చడి పోపు వెయ్యాలి.
**అంతే దోసకాయ పచ్చడి రెడి.**

జీడిపప్పు పకోడీ

జీడిపప్పు పకోడీ 
శనగపిండి -పావుకేజీ 
పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు -నాలుగు
జీడిపప్పులు -రెండు వందల గ్రాములు 
బియ్యం పిండి -రెండు టేబుల్ స్పూన్స్ 
అల్లం -రెండు అంగుళాల ముక్క
కొత్తిమీర -అయిదు రెమ్మలు
కరివేపాకు -మూడు రెమ్మలు
వాము -ఒక టీ స్పూన్
కారం -ఒక టీ స్పూన్ ఉప్పు -తగినంత
నూనె -వేయించుకోడానికి సరిపడా
కొత్తిమీరను ,కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.అల్లంనుతొక్కతీసి
చిన్నగాతరిగిపెట్టుకోవాలి.ఒకగిన్నెలో నీళ్ళుతీసుకునిఅందులో జీడిపప్పును
పదినిమిషాలునానబెట్టుకోవాలి.ఇలాచేసుకోవడంవలనవేయిన్చుకునేతప్పుడుజీడిపప్పుమాడకుండాఉంటుంది.ఒకవెడల్పాటి గిన్నెతీసుకునిఅందులోశనగపిండివేసుకొని ఉండలులేకుండాకలుపుకోవాలి
అందులోబియ్యంపిండికూడావేసుకోవాలి.ఈబియ్యంపిండివెయ్యడంవలన
పకోడీలుకరకరలాడుతాయి.తర్వాతపొడవుగా సన్నగాతరిగిన ఉల్లిముక్కలువేసుకోవాలి.కట్చేసినకరివేపాకునువేసుకోవాలి.కొత్తిమీరకూడావేసుకోవాలి.పొడిగాఒకసారిబాగాకలపాలి.వాము,కారం,తగినంతఉప్పు వేసుకోవాలి
నాన్బెట్టుకున్నజీడిపప్పునువేసుకోవాలి.గట్టిగప్రెస్చేస్తే జీడిపప్పులుపగిలిపోతాయి.కొంచెంకొంచెంనీళ్ళుపోసుకుంటూపకోడిలాపిండిమాదిరిగట్టిగకలుపుకోవాలి స్టవ్వెలిగించినూనెపోసికాకబండికిసరిపడాపకోడిలామిశ్రంనుతీసుకునివేసుకోవాలి.హైఫ్లేమ్లోపెట్టికునివండుకోవాలి.అప్పుడునూనెపీల్చుకోవు.మద్యమద్యలో
కలియతిప్పుకుంటూ బంగారు గోధుమ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి
అలవచ్చాకవాటినిఒకప్లతెలోకితీసుకోవాలి

Tuesday, March 22, 2016

మసాల పూరి

మైదా పిండి-రెండుకప్పులు
సెనగపిండి-ఒకటిన్నరకప్పు
కరివేపాకు-రెండురెబ్బలు
మెంతికూరతరుగు-రెండుటీస్పూన్స్
పసుపు-పావు టీస్పూన్
కారం-రెండుటీస్పూన్స్
ధనియాలపొడి-టీస్పూన్
గరం మసాల-అరటీస్పూన్
అల్లంవెల్లుల్లి-రెండుటీస్పూన్స్
షాజిర-రెండుటీస్పూన్స్
ఉప్పు-తగినంత
నూనె-వేయించటానికిసరిపడా
గిన్నెలోజల్లించినమైదా,సెనగపిండితీసుకునిఅందులో పసుపు,కారం,ధనియాలపొడి,గరంమసాల,షాజిర,సన్నగా తరిగిన కరివేపాకు,మెంతికూర
కొద్దిగానీళ్ళుపోసికలపాలి.ఇప్పుడుఅల్లం వెల్లుల్లి,తగినంత ఉప్పుకూడావేసిచపాతీపిండిల
తడిపిపెట్టుకోవాలి.అరగంటతర్వాతమెత్తగా పిసికిచిన్నఉండలుగాచేసుకోవాలి
ఒక్కో ముద్దనుతీసుకునిపలుచగాపూరిలుగావత్తికాగిననూనెలోవేసిఎర్రగావేయించి
తీయాలి.ఈపూరీలు నాలుగు రోజులు వరకునిలువ ఉంటాయి

జొన్నదోశ

శుబ్రంచేసిన జొన్నలు-రెండుకప్పులు
మినపప్పు-కప్పున్నర
బియ్యం-అరకప్పు
వంటసోడా-అరటీస్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-కాల్చటానికి సరిపడా
అల్లం,ఉల్లి,పచ్చిమిర్చిముక్కలు-కప్పు
జీలకర్ర-టీస్పూన్
ఆరుగంటలముందు జొన్నలు,మినపప్పు,బియ్యం,విడివిడిగానానబెట్టుకోవాలి.
తరువాతనీళ్ళువంపిమెత్తగా రుబ్బుకోవాలి.దీనిలోఉప్పు కలిపిరాత్రిఅంతపక్కనబెట్టాలి.
ఉదయానికిపిండిపులుస్తుంది.కావాలంటేకొద్దిగానీళ్ళువేసిపిండినిపలుచగాకలుపుకోవాలి.ఇప్పుడుపిండిలోవంటసోడా కలపాలి.స్టవ్మీదపాన్పెట్టికొంచెంపిండిగారితతోతీసిపాన్మీదదోసాలవేసిపైనజీలకర్ర,మిర్చి,ఉల్లి,అల్లంముక్కలుజల్లుకోవచ్చు.లేకున్నాప్లైన్గదోసవేసుకోవచ్చు.దోసచుట్టూనూనెవేసి రెండుపక్కలదోరగాకాల్చాలి

సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం-ఒకకప్పు
మైదా-మూడుటేబుల్స్పూన్స్
బియ్యంపిండి-అరకప్పు
పెరుగు-ఒకకప్పు
మజ్జిగ-రెండుకప్పులు
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చిపేస్టు-టీస్పూన్
కరివేపాకు-గుప్పెడు
జీలకర్ర-టీస్పూన్
వంటసోడా-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- వేయించటానికి సరిపడా
సగ్గుబియ్యంనుఅయిదు గంటలు మజ్జిగలోనానబెట్టాలి.
తరువాతవీటికిపైనచెప్పినఉల్లిముక్కలుమిర్చిపేస్టు,జీలకర్ర,పెరుగు,వంటసోడా,
ఉప్పు,కరివేపాకు,మైదా,బియ్యంపిండి,కొత్తిమీరతరుగు,కలిపిముద్దలా
చేసుకోవాలి.
స్టవ్మీద కడాయిపెట్టి నూనెపోసివేడిఅయ్యాక సగ్గుబియ్యంనుముద్దనుచిన్నచిన్న
ఉండలుగా చేసుకుని వడలుగావత్తి కాగేనూనెలో వేసి దోరగాకాల్చుకోవాలి

వెజిటబుల్ పకోడి

సెనగపప్పు -అరకప్పు 
పెసరపప్పు -అరకప్పు 
బియ్యం -పావుకప్పు 
పాలకూర తరుగు-రెండుటేబుల్ స్పూన్స్
తోటకూరతరుగు-రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర తరుగు-రెండుటేబుల్స్పూన్స్
కాబేజి తరుగు-రెండుటేబుల్స్పూన్స్
చిన్నగాకట్ చేసినకాలిఫ్లోవేర్-రెండుటేబుల్స్పూన్స్
ఉల్లిముక్కలు--అరకప్పు
పచ్చిమిర్చిపేస్టు-టేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికి సరిపడా
సెనగపప్పు,పెసరపప్పు,బియ్యం మూడుగంటలముందు నానబెట్టి మెత్తగా
grind చేసుకోవాలి
రుబ్బినపిండిలో పైన చెప్పుకున్నవన్నివేసుకోవాలి
స్టవ్ వెలిగించినూనెవేడిచేయాలి.కాగినతరువాతపిండినిపకోడీలవేసిదోరగావేపుకోవాలి
వేడి వేడిపకోడీతయారు

Thursday, March 17, 2016

'' ఓట్స్ '' పరాటా

ఫ్యాట్ తగ్గించే '' ఓట్స్ '' పరాటా
కావలసిన వస్తువులు :
గోధుమపిండి : 1 కప్పు
ఓట్స్ : 1/2 కప్పు
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
కారం పొడి : 1/2 tsp
గరం మసాలాపొడి : 1/4 tsp
సన్నగా తరిగిన మెంతికూర : 2 tbsp
నూనె : కాల్చడానికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మెంతికూర శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓట్స్ ని గ్రైండర్ లో పొడి చేసుకోవాలి.
2. ఈ పొడి గోధుమపిండిలో వేసి కలపాలి. ఇందులో మెంతికూర, ఉప్పు,పసుపు, కారం పొడి, గరం మసాలాపొడి వేసి బాగా కలియబెట్టి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి.
3. ఈ పిండి పది నిమిషాలు నానిన తర్వాత మళ్లీ చేతులతో మర్ధనా చేసి చిన్న బత్తాయి సైజులోఉండలు చేసుకోవాలి. దానిని చపాతీలా వత్తుకుని పలుచగా నూనె రాసి కొద్దిగా పొడిపిండి చల్లి మడత పెట్టాలి.
4. తర్వాత మళ్లీ దీనిని చపాతీలా వత్తుకుని వేడి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండువైపులా ఎర్రగా అయ్యేలా కాల్చుకోవాలి. వేడివేడి పరాటాలను ఉల్లిపాయ రింగులు, పెరుగు పచ్చడి, ఆవకాయతో సర్వ్ చేయాలి. 
* అంతే ఓట్స్ పరాటా రెడీ.

పెసర గారెలు

• కావల్సినవి: పెసలు - కప్పు, మినప్పప్పు - రెండు చెంచాలు, అల్లం తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - కొద్దిగా, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - ఐదారు, నూనె - వేయించేందుకు సరిపడా.
• తయారీ: పెసలనీ, మినప్పప్పునీ ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు ఆ నీళ్లు పూర్తిగా వంపేసి ఈ రెండింటినీ కలిపి గట్టి పిండిలా రుబ్బుకుని పెట్టుకోవాలి. అదే మిక్సీజార్‌లో అల్లం, పచ్చిమిర్చీ, ఉప్పూ, జీలకర్రా మెత్తగా చేసుకుని ఈ పిండిలో కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. అది వేడయ్యాక ఈ పిండిని రెండుమూడు గారెల చొప్పున తట్టుకుని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి.

Tuesday, March 15, 2016

గోంగూర పప్పు



గోంగూర-ఒకకట్ట
కందిపప్పు-ఒకకప్పు
ఉల్లిపాయలు-రెండు
పసుపు-పావుటీస్పూన్
పచ్చిమిరపకాయలు-ఎనిమిది
ఉప్పు-తగినంత
నూనె-టీస్పూన్
తాలింపుగింజలు-రెండు టీస్పూన్స్
కరివేపాకు-రెండురెమ్మలు
పొయ్యిమీద గిన్నెపెట్టిపప్పుపోసి దానిలోతగినన్ని నీళ్ళుపోసిబాగాఉడకనివ్వాలి.తర్వాత
గొంగురను శుబ్రంగా కడిగి చిన్నగా తరిగి ఉంచుకోవాలి.మరోబాణలి పెట్టి నూనెపోసికాగాక
జీలకర్ర,ఆవాలు,వెల్లుల్లిరేకులు,ఉల్లిపాయముక్కలు,పసుపు,పచ్చిమిర్చిముక్కలు,కలిపివేయించుకోవాలి.బాగావేగినతర్వాతతరిగినగోంగూర ను బాణలివేసి చిన్నమంటమీద
మగ్గనివ్వాలి.గోంగూర మగ్గినతరువాతఉడకబెట్టినపప్పునుగోంగూర మిశ్రమంలోవేసిబాగాకలియబెట్టిపదినిముషాలుతర్వాతదించుకోవాలి

సగ్గుబియ్యం వడియాలు

సగ్గుబియ్యం-ఒక కిలో
నీళ్ళు-ఒకకప్పుకునాలుగుగ్లాసులు
పచ్చిమిరపకాయలు-యాభయ్ గ్రాములు
జీలకర్ర-రెండుటీస్పూన్స్
ఉప్పుతగినంత
సగ్గుబియ్యంనుఒకపాత్రలో నీరుపోసి శుబ్రంగకరిగిపోయేవరకు ఉడికించాలి.ఉడికినదానిలో
పేస్టుగచేసినపచ్చిమిరపకాయలముడ్డ,జీలకర్ర,ఉప్పువేసి,బాగాకలిపిదించివేయాలి.ప్లాస్టిక్
పేపర్ లేదాకాటన్ గుడ్డ మీద ఉడికినసగ్గుబియ్యంమిశ్రమంనుచిన్నగారితేసహాయంతోచిన్నచిన్నగవేసుకోవాలి.వేయడంఅయిపొఇనతరువాతరెండుమూడురోజులుఎండలోఎండబెట్టుకోవాలి.ఇలాఎండబెట్టినవాటిని
కాటన్గుడ్డనుతిరగేసిపైననీళ్ళుకొచెంకొచెంచల్లివేరుచేయాలినీళ్ళుఎందుకుచల్లుకోవాలంటేవడియాలుగుడ్డకుకానీ,ప్లాస్టిక్షీట్కుకానీఅంటుకోకుండాత్వరగావస్తాయి.ఇలావడియాలనుఒక డబ్బా లోనిల్వచేసుకోవాలి

బియ్యం పిండి వడియాలు

బియ్యంపిండి-ఒకకప్పు
సగ్గుబియ్యం-పావుకప్పు
ఉప్పు-రుచికిసరిపడా
నీళ్ళు-బియ్యంపిండి కలుపుకోవటానికి ఒకకప్ కురెండుకప్ లనీళ్ళు
అల్లంముక్క-చిన్నది
జీలకర్ర-ఒకటేబుల్స్పూన్
పచ్చిమిర్చి-నాలుగు
సగ్గుబియ్యంనుఅరగంటసేపునానబెట్టుకోవాలి.అల్లం,పచ్చిమిర్చిముక్కలనుచిన్నగచేసుకునిజార్లోవేసిఅందులోనేజీలకర్ర కూడావేసుకోవాలి.దీనినిgrindచేసుకునిపస్తేనుపక్కనపెట్టుకోవాలి.
ఒకబౌల్లోఒకకప్పుబియ్యంపిండికిరెండుకప్పులనీరుపోసుకోవాలి.అందులోబియ్యంపిండివేసిబాగా కలపాలి.
మందపాటికుక్కర్పెట్టి వేడిచేయాలిఒకకప్పుబియ్యంపిండిఆరుగ్లాసులనీళ్ళు పోసివేడిచేసుకోవాలి.అందులోనానబెట్టినసగ్గుబియ్యంనువేసుకునిఅయిదు నిముషాలుఉడికించుకోవాలి.అందులోనేతరుచేసుకున్నపేస్టునువేసుకోవాలి.తర్వాతఅందులో
తగినంతఉప్పువేసుకోవాలి.బాగాతిప్పుతూమరిగించుకోవాలి.సగ్గుబియ్యంమరిగెంతవరకు
ఉడికించుకోవాలి.లోఫ్లేమ్లోపెట్టిమరిగించాలి.పోగకుండాజాగ్రత్తపడాలి.తరువాతబియ్యంపిండినీటినిపోసుకోవాలి.లోఫ్లేమ్లోపెట్టికలియతిప్పుతూఉండాలిలేకుంటేఅడుగంటుతుంది.వడియాలపిండిచిక్కగావచ్చేవరకుతిప్పుతూలోఫ్లేమ్లోఉంచాలి.తయారుఐనతరువాతవేడిగాఉన్నప్పుడేఒకకాటన్ క్లాత్ మీద చిన్నగరిటెతోవడియాలుపెట్టుకోవాలి.రెండురోజులుఎండలోఉండనివ్వాలి
పెట్టినభాగానకాకవెనకభాగాననీరుచిలకరించితిప్పితేసులభంగాఊడివస్తాయి

బ్రెడ్ పకోడీ

శనగపిండి-ఒకకప్పు
జొన్నపిండి-ఒకకప్పు
బఠానీ పిండి-అరకప్పు
మజ్జిగఒకకప్పు
బ్రెడ్-ఆరు slices
ఉల్లిపాయలు-మూడు
మిర్చి-నాలుగు
అల్లంపస్తే-రెండుటీస్పూన్స్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె- వేయించుకోడానికిసరిపడా
గిన్నెలోశనగపిండి,జొన్నపిండి ఉల్లితురుము,అల్లం,మిర్చిపేస్టు బఠానీ పిండి,ఉప్పుమిశ్రమంలో సరిపడినన్నినీళ్ళతోకలిపిజారుగాచేసుకోవాలి.బ్రెడ్ స్లైస్ లచివరకట్చేసివాటినిమజ్జిగలోముంచిరెండునిమిషాలతరువాతపిండివేయాలి.బ్రెడ్ముద్దను
సనగాపిండి మిశ్రమంలోఅద్దిఆయిల్లో దోరగావేయించుకోవాలి.వేడిగాఉన్నప్పుడే
టమాటో సాస్ తోతింటేబాగుంటుంది

పాల పూరి

గోధుమ పిండి-రెండుకప్పులు
నెయ్యి-రెండుటీస్పూన్స్
పాలు-నాలుగుకప్పులు
యాలకులపొడి-పావుటీస్పూన్
పంచదార-అయిదు టేబుల్స్పూన్స్
బాదంపప్పుతరుగు-ఒకటేబుల్స్పూన్
ఉప్పు-రుచికిసరిపడా
నూనె-వేయించడానికిసరిపడా
ఒకగిన్నెలోగోడుమపిండి,ఉప్పు,నెయ్యి,సరిపడానీళ్ళుపోసిపూరిపిండిలకలుపుకోవాలి
ఆపిండిముద్దపైతడిగుడ్డకప్పిఅరగంటనానబెట్టుకోవాలి.మనంఇంతలో ఒకగిన్నెలో
పాలుపోసిసగంఅయ్యేవరకుమరిగించి పంచదార,యాలకులపొడివేసిపంచదారకరిగాకదించేయాలి.ఆతరువాతపూరిపిండితోచిన్నచిన్నపూరిలుచేసుకునినూనెలోవేసుకుని కాగాకతీసిపాలమిశ్రమంలో వేసిబాదంతరుగుచల్లుకోవాలి

స్టీమ్ దోస

ఉప్పుడు బియ్యం-ఒకకప్పు
అటుకులు-ముప్పావుకప్పు
మెంతులు-అరటీస్పూన్
పుల్లటిమజ్జిగ-రెండుకప్పులు
బియ్యం,అటుకులు,మెంతులు ఒకగిన్నెలోఆరుగంటలునానబెట్టి మజ్జిగ నుకలుపుకుంటూ
మెత్తగారుబ్బుకోవాలి.ఈపిండినిపెనంపైదోస వేసుకోవచ్చు.అయితేకొద్దిగామందంగా
దోసవేసుకునిమూతపెట్టుకోవాలి.మద్యమద్యలోమూతతీసిచూస్తుండాలి.వెలికిపిండిఅంటలేదు
అనిపించేదాకఉంచితీసేయాలి.వెనుకవైపుకాలుకోకూడదు.మెత్తగాస్పొంగ్లఉండేదోసతయారు

మినప వడియాలు

మినపపప్పు-ఒకకిలో
జీలకర్ర-నాలుగుటీస్పూన్స్
పచ్చిమిరపకాయలు-నూరు గ్రాములు
ఉప్పు-తగినంత
మినపప్పునుశుబ్రంగాకడిగిదానిలిఒకపాత్రనీరుపోసిరాత్రిఅంతనానబెట్టుకోవాలి.రాత్రిఅంతనాననిచ్చాకఉదయమేపప్పునుశుబ్రంగాకడిగిమినపప్పు,ఒత్తునువేరుచేయాలి.తరువాత
పచ్చిమిరపకాయలనుమినపప్పురుబ్బెతప్పుడువేసిgrind చేసుకోవాలి.తరువాతజీలకర్రవేసిపిండినికలపాలి.రుబ్బుకున్నపిండినిప్లాస్టిక్పేపర్మీద
చిన్నచిన్నవదియలుగా గరిటసహాయంతోపెట్టుకోవాలి
పెట్టుకున్నవడియాలనురెండుమూడురోజులుఎందండలోఉంచాలి.తర్వాత
ప్లాస్టిక్పేపర్వెనుకభాగంపైననీళ్ళు చిలకరిస్తేసులభంగావడియాలువస్తాయి.వడియాలనుడబ్బాలోనిలువచేసుకోవాలి

Sunday, March 6, 2016

అటుకుల వడియాలు

మినపప్పు-రెండుకప్పులు
అటుకులు-ఆరుకప్పులు
మిర్చి-పన్నెండు
జీలకర్ర-అయిదుటీస్పూన్స్
ఉప్పు-అయిదుటీస్పూన్స్ 
పెసరపప్పు-అరకప్పు
అటుకులు కడిగి ఉంచుకోవాలి.మినపప్పును ముందురోజేనానబెట్టుకోవాలి.మర్నాడుఉదయంమెత్తగా రుబ్బుకోవాలి.రుబ్బినమినప్పిండిలో
మిర్చిముక్కలు,జీలకర్ర,పెసరపప్పు,ఉప్పు వేసిబాగాకలపాలి.అందులోనేకడిగినఅటుకులను
కూడావేసిబాగాకలపాలి.ఈమిస్రమంనుతడిబట్టమీదవదియాలుగాపెట్టిబాగాఎండనివ్వాలి

Tuesday, March 1, 2016

బిసీ బెళె బాత్

కావల్సినవి: బియ్యం - పావుకేజీ, కందిపప్పు - కప్పు, క్యారెట్, బంగాళాదుంపలు - రెండు చొప్పున, బఠాణీలు - పావుకప్పు, బీన్స్ - నూటయాభై గ్రా, టమాట - ఒకటి, ఉల్లిపాయలు - నాలుగు, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - యాభై గ్రా, పసుపు - కొద్దిగా, నూనె - మూడుచెంచాలు, చింతపండు - పాతిక గ్రా, ఆవాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండు, ఇంగువ - కొద్దిగా, జీడిపప్పు పలుకులు - పావుకప్పు.మసాలా కోసం: ధనియాలు, మినప్పప్పు, కందిపప్పు - నాలుగుచెంచాల చొప్పున, సెనగపప్పు - రెండు చెంచాలు, ఎండుమిర్చి - పది, మరాఠీమొగ్గ, దాల్చినచెక్క - మూడు చొప్పున, లవంగాలు - నాలుగు, యాలకులు - ఒకటి, కొబ్బరితురుము - కప్పు.

తయారీ: కొబ్బరితురుము తప్ప మసాలా దినుసులన్నింటినీ నూనెలో వేయించుకుని చల్లారాక పొడిచేసుకోవాలి. అందులో కొబ్బరి తురుమును చేర్చాలి. చట్నీలా తయారైన దీన్ని పక్కనపెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, కూరగాయముక్కలన్నింటినీ కుక్కర్‌లో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. ఐదునిమిషాలయ్యాక చింతపండు గుజ్జు చేర్చాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేయాలి. సిద్ధంచేసుకున్న మసాలా కూడా చేర్చి బాగా కలపాలి ఇది కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి కాసిని నీళ్లు చేర్చుకోవాలి. అన్నం తయారయ్యాక దింపేయాలి. బాణలిలో నెయ్యి కరిగించి ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించి.. ఈ అన్నంపై వేసి బాగా కలిపితే నోట్లో వేసుకోగానే కరిగిపోయే బిసీబెళెబాత్ సిద్ధం.

ఉల్లికాడల కూర

ఉల్లికాడల కూర 
ఉల్లికాడలు -ఒక కట్ట -సన్నగా తరుగుకోవాలి 
కొత్తిమీర -ఒక కట్ట -సన్నగ తరగాలి 
టమోటాలు -రెండు 
పచ్చిమిర్హి -నాలుగు 
కరివేపాకు -మూడురేమ్మలు 
అల్లం వెల్లుల్లి పేస్టు -మూడు టేబుల్ స్పూన్స్ 
పసుపు -పావు టేబుల్ స్పూన్ 
కారం -ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు -రుచికి సరిపడా 
గరం మసాల పొడి -ఒక టేబుల్ స్పూన్ 
నూనె -మూడు టేబుల్ స్పూన్స్ 
ఒక పాన్ లో నూనె వేసుకుని వేడి అయిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద ను రెండు నిముషాలు బాగా వేగించాలి .గరం మసాల పొడి వేసి రెండు బాగా కలుపుకోవాలి 
తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి .సన్నగా తరిగిన టమాటో ముక్కలనువేసుకునిఅవి
మగ్గేవరకువేయించాలి.తగినంతఉప్పువేసుకునిఒకసారిబాగాకలుపుకున్నతరువాతపచ్చిమిర్చి,కరివేపాకువేసివేయించాలి.తరువాతఉల్లికాదాలనుసన్నగాతరిగినవివేసుకోవాలి
ఒకసారిబాగాకలిపిమూతపెట్టిఅయిదునిముషాలుమగ్గనివ్వాలి.తరువాతమూతతీసిబాగాకలుపుకున్నాకసన్నగాతరిగినకొత్తిమీరవేసుకోవాలి

మేతి రోటి

మేతి రోటి 
గోధుమ పిండి -ఒకటిన్నర కప్పు
మెంతికూర తరుగు-ముప్పావుకప్పు
గరం మసాల-ముప్పావుచెంచ
పసుపు-పావుచెంచ
జీలకర్ర-చెంచ
ఉప్పు-కొద్దిగా
నూనె-అరకప్పు
మజ్జిగ-పిండికలిపేందుకుసరిపడా
బాండిలోకొద్దిగానూనె వేసివేడిఅయ్యాక కడిగిన మెంతికూరను వేయించాలి.దానినుంచిపచ్చి
వాసనపోయాకదించేయాలి.గోధుమపిండిలోమజ్జిగతప్పమెంతికూరతోపాటుమిగిలినపదార్దాలు
అన్నివేసుకునిబాగాకలపాలి.తరువాతమజ్జిగపోసుకుంటూచపాతిపిండిలకలపాలి.ఈపిండిని
చపాతీల్లవత్తుకునిపెనంపైవేసినూనెతోరెండువైపులాకాల్చుకునితింటేబాగుంటుంది

మేతికడాబు

గోధుమపిండి-ఒకకప్
ఉప్పు-రుచికిసరిపడా
ఎండబెట్టిన మెంతకు-ఒకటేబుల్స్పూన్
వాము-అరటీస్పూన్
కారంపొడి- అర టీ స్పూన్
నూనె-ఒకటేబుల్స్పూన్
మెంతిఆకులు-అరకప్పు
ఉల్లిపాయ-ఒకటిపచ్చిమిర్చి-రెండు
పసుపు-పావుటీస్పూన్
కరివేపాకు-రెండురెబ్బలు
కారం-వన్టీ స్పూన్ఉప్పు-రుచికిసరిపడా
జీలకర్ర-అరటీస్పూన్
ఆవాలు-అరటీస్పూన్
నూనె-ఒకspoon
కదాబుతయారుచేయుటకు
ఒకగిన్నెలోగోధుమపిండి,ఉప్పు,కారంపొడి,వాము,ఎండబెట్టినమెంతకు,నూనెవేసుకోవాలి
కొచెంకొచెంనీరుపోసుకొంటూచపాతిపిండిలకలుపుకుని పదహెనునుంచిముప్పయినిమిషాలవరకుపక్కనుంచాలితరువాతచపాతీముద్దగాచేసుకున్నదానినిచిన్నఉండలుగాచేసుకోవాలి.ప్రతిచిన్నబాల్నునిలువుగాచేసుకునికట్చేసిచిన్నముక్కలుగాకోసికొద్దిగప్రెస్చేసిచదునుగాచేసినాణెంగతయారుచేసుకోవాలి
ఒకఇడ్లీపాత్రలోవీటినిఆవిరిపైపదహెనునుంచిఇరభయ్నిముషాలుపెట్టాలిఇవిఉబ్బుతాయి
ఉబ్బినతరువాత వీటినిబయటకుతీసిచల్లారేవరకుఉంచాలి
ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలు,మెంతిఆకులను కట్చేసిపెట్టుకోవాలి
పాన్లోఒకస్పూన్నూనెవేసిఆవాలు,జీలకర్ర,మరియుఎండుమిర్చివేసిఅవిచిటపటలాడుతుండగాఅందులోకరివేపాకు,ఉల్లిగడ్డ,పచ్చిమిర్చిముక్కలువేసిరెండునుంచిమూడునిముషాలుఉంచాలిఉల్లిగాద్దముక్కలుకొంచెంవేగాకఅందులోమెంతకులుపసుపు,రుచికితగ్గఉప్పువేసిఅందులోనిచెడునుతొందరగాఅయిదులేదాఆరునిమిషాలఉంచడంవలనమెంతకులుఉడుకుతాయి.మనంఆవిరిచేసినవాటినిమెంతకుమిశ్రమంలోవేసిఉప్పు,కారంవేసిలోఫ్లేమ్లోమూడునిముషాలుఉంచిబాగాకలిపిదించుకోవాలి

బంగాళదుంప - కొత్తిమీర చపాతీ

కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.