Monday, January 28, 2013

మసాల ప్రోటీన్‌ రోటి

మసాల ప్రోటీన్‌ రోటి
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి - ఒక కప్పు
సోయాపిండి - ఒక కప్పు
శనగపిండి - అరకప్పు
కారెట్‌ తురుము - అరకప్పు
పెసరమొలకలు - రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లికాడ ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌
ఉల్లి తురుము - ఒక టేబుల్‌ స్పూన్‌
నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిరపకాయ ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌
కొబ్బరి తురుము - అరకప్పు
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - పావు స్పూన్‌
పెరుగు - అరకప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
తయారు చేసే విధానం : గోధుమ, సోయా, శనగపిండులను సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాలి. అడుగంటకుండా చాలా జాగ్రత్తగా కలపాలి. చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు వేసి పిండిని మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నాననివ్వాలి. తురిమిన ఉల్లిపాయ ముక్కలు మిగతా పదార్థాలన్నీ కలుపుకోవాలి. గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకుని నొక్కి మధ్యలో పైన కలుపుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని మధ్యలో ఉంచి చుట్టేయాలి. ఇప్పుడు ఈ ఉండను చపాతీ మాదిరిగా నొక్కుకుని కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి.

0 comments:

Post a Comment