Saturday, March 23, 2013

కాకర- పచ్చిమామిడి కూర

కాకర- పచ్చిమామిడి కూర
కావలసినవి: కాకరకాయ- ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, పచ్చిమామిడికాయ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, లేదా లవంగాలు - మూడు, తురిమిన కొబ్బరి - ఒక కప్పు, కరివేపాకు, ఉప్పు- సరిపడా, కొబ్బరి నూనె - ఒక టేబుల్‌స్పూన్, ఆవాలు - అర టీస్పూన్. తయారీ: కాకరకాయ, ఉల్లిపాయ, మామిడికాయల్ని ముక్కలుగా కోసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిలను కచ్చాపచ్చాగా మిక్సిలో వేసి రుబ్బాలి. కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. తరువాత ఆవాలు, కరివేపాకు వేయాలి. అవి వేగాక కాకర, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు వేసి కాసేపు వేగించాలి. తరువాత కొబ్బరి, ఉప్పు వేసి మళ్లీ కలిపి కొద్దిగా నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. చేదు, పులపు కలిసిన ఈ కూరని అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది.

పచ్చిమామిడి వడ



పచ్చిమామిడి వడ
కావలసినవి: ఉప్పుడు బియ్యం - ఒక కప్పు, పచ్చిమామిడి ముక్కలు - ఒకకప్పు, పచ్చిమిర్చి - ఐదు, కందిపప్పు - రెండు టీస్పూన్లు, ఇంగువ - చిటికెడు, పసుపు - చిటికెడు, ఉప్పు -రుచికి సరిపడా, కరివేపాకు, నూనె - వేగించడానికి సరిపడా. తయారీ: ఉప్పుడు బియ్యం, కందిపప్పుల్ని వేడి నీళ్లలో కొద్దిసేపు నానపెట్టాలి. ఆ తరువాత ఇతర పదార్ధాలతో కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పిండి చిక్కగా ఉండాలి. ఇందులో ఆవాలు, కరివేపాకు వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడల్లా ఒత్తుకుని నూనెలో వేగించుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్ మీద ఒత్తి నూనె తీసేయాలి. పచ్చిమామిడి వడ రెడీ. తినేయండిక.

*. టమోటో దోసె


*. టమోటో దోసె

దోసె బాగా పాపులర్ అయినటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపి. దోసెలో వివిధ రకాలున్నాయి. దోసెను వివిధ రకాల వస్తువులను వేసి తయారు చేసుకుంటారు. సాధారణంగా మనం తయారు చేసుకొనే దోసె కాకుండా కొంచెం వెరైటీగా తయారు చేసుకొనే దోసెలు ప్రతి రోజూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి. ఇలా వెరైటీ దోసెలను చాలా ప్రదేశాల్లో సర్వ్ చేస్తారు. దాంతో పాటు, చట్నీ సాంబర్ చాలా రుచిగా ఉంటాయి.

దోసెను ప్లెయిన్ దోసెగాను లేదా వెరైటీగాను తయారు చేసుకోవచ్చు. దోసె రకాల్లో 80 వరకూ ఉన్నాయి. వివిధ వెరైటీల్లోని దోసెలు ఫుడ్ సెంటర్లలో దొరకడం మనం చూస్తూనే ఉంటాం. టమోటో దోసెను మీరు కనుక ట్రై చేయనట్లైతే ఒక సారిట్రై చేసి రుచి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.

కావల్సిన పదార్థాలు: 
దోసె పిండి: 2cups 
టమోటోస్:
పచ్చిమిర్చి: 3-4 
జీలకర్ర: 1tsp 
అల్లం పేస్ట్: 1tsp 
ఉప్పు: a pinch 
నూనె: ½ cup 
బట్టర్: 2tbsp

తయారు చేయు విధానం:
1.
ముందుగా అల్లం, టమోటో, పచ్చిమిర్చి మరియు జీలకర, కొద్దిగా ఉప్పు, మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. 
2.
ఇప్పుడు దోసె పిండిలో టమోటో పేస్ట్ మిక్స్ చేసుకోవాలి.
3.
ఇప్పుడు దోసె పాన్ స్టౌ మీద పెట్టి వేడి చేసి, నూనె రాసి, దోసె పిండిని దోసెలా పాన్ మీద వేసుకోవాలి. తర్వాత దాని మీద కొద్దిగా నూనె చిలకరించాలి. 
4.
దోసె ఒక సైడ్ కాలిన తర్వాత మరో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే టమోటో దోస రెడీ. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయాలి.

Sunday, March 17, 2013

ఉలవచారు


కావాల్సిన పదార్థాలు:
ఉలవలు: 2cup
టమోటాలు: 4
చింతపండు రసం: 2btsp
ఉల్లిపాయలు: 2
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
పచ్చిమిర్చి : 3(మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండు మిర్చి: 3
అల్లంపేస్ట్: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
ధనియాలపొడి: 1tsp
కొత్తిమీర: కొద్దిగా

తయారు చేయు విధానం: 
1. ముందుగా ఉలవలను ముందు రోజు నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే ఆ నీరు తీసి మళ్లీ నీళ్లుపోసి కుక్కర్‌లో ఉడికించాలి. బాగా ఉడికిన ఉలవలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి. 

2. ఇప్పుడు ఓ పాన్‌ లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కట్‌చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పేస్ట్ కూడా వేసి వేగేదాకా ఫ్రై చేయాలి.

3. ఇప్పుడు అందులో టమోటాలు వేసి ఫ్రై చేయాలి. మూడు నిమిషాల తరువాత కొద్దిగా కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్దను వేసి, చింతపండు రసం పోసి మరిగించాలి. దించేముందు ధనియాలపొడి, కొత్తిమీర తరుగు వేయాలి. ఈ ఉలవచారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Saturday, March 16, 2013

‎*. వంకాయ పచ్చిపులుసు



*. వంకాయ పచ్చిపులుసు
కావలసిన పదార్థాలు: (పెద్ద) వంకాయ - 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి - 1 చొప్పున, చింతపండు గుజ్జు - అర కప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, బెల్లం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, పోపు దినుసులు.
తయారుచేసే విధానం: వంకాయకు నూనె రాసి, చిన్న మంటపై తిప్పుతూ కాల్చి, చల్లారిన తర్వాత పై తొక్క తీసి మెదిపి పక్కనుంచాలి. ఒక గిన్నెలో వంకాయగుజ్జు, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వేసి బెల్లం ఉండలు లేకుండా చిదిమి, నీరు పోయాలి. కడాయిలో ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేసి, వంకాయ చింతపండు మిశ్రమంలో కలిపి మూతపెట్టాలి. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉండే పులుసు ఇది.

Friday, March 15, 2013

‎* బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ


* బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ

చాలా మంది తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అంతే కాదు వారు తినే ఆహారం టేస్టీగా ఉండాలని కోరుకుంటారు. బంగాళదుంప కర్రీ ఆరోగ్యానికి మంచిది. 

కావల్సిన పదార్థాలు: బేబీ పొటాటో(చిన్న బంగాళదుంపలు): 20 పచ్చిబఠానీలు: 250grams పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి) జీలకర్ర: 1/2 tsp అల్లం: కొద్దిగా (minced) టమోటో: 1 (chopped) కారం: 1tsp జీలకర్ర: 1tsp ఎండిన మెంతి ఆకులు: 1tbsp ఫ్రెష్ క్రీమ్: 2tbsp గరం మసాలా: 1/2 tsp కొత్తిమీర: 2 sprigs(chopped) ఉప్పు: as per taste నూనె: 2tbsp 

తయారు చేయు విధానం: 1. ముందుగా బేబీ పొటాటో(చిన్న సైజులో ఉన్న బంగాళదుంపలను)శుభ్రం చేసి కుక్కర్ లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. 

2.
తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పోయే వరకూ అలాగే ఉంచి, కొద్ది సేపటి తర్వాత కుక్కర్ మూత తీసి బంగాళదుంపల్ని చల్లటి నీటిలో వేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 

3.
ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యాని ఆకు, మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. 

4.
తర్వాత అందులోనే ఉడికించి పొట్టుతీసి పెట్టుకొన్న బంగాళదుంపలను కూడా వేసి 5నిముషాల పాటు తక్కువ మంటలో వేయించుకోవాలి. 

5.
ఇప్పుడు అందులో అల్లం చిన్న ముక్కలుగా లేదా దంచుకొని వేసి, మరో నిముషం పాటు వేయించాలి. 

6.
తర్వాత టమోటో ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి వేయించి రెండు నిముషాల తర్వాత పచ్చిబఠానీలు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించాలి. 

7.
మిగిలిన మసాలా దినుసులన్నీ కూడా వేసి బాగా మిక్సి చేస్తూ మరో 5నిముషాల ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసి, మూత పెట్టి మరో 5 నిముషాల ఉడికించాలి. 

8.
బేబీ పొటాటో, పచ్చిబఠానీ ఉడికిన తర్వాత అందులో ఎండబెట్టిన మెంతి ఆకులను మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మంట తగ్గించి మరికొద్దిసేపు ఉడికించాలి. 

9.
చివరగా ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసి, కలగలిపి, మరో రెండు నిముషాలు ఉడికించి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బేబీ పొటాటో పీస్ కర్రీ రెడీ...

Saturday, March 9, 2013

కీరా దోసెలు

కీరా దోసెలు: బియ్యం : 
ఒక కప్పు, మినప్పప్పు : పావు కప్పు చిన్నముక్కలుగా కోసిన కీరా ఒకటి నువ్వులు ఒక చెంచాడు, ఒక చెంచా మిరియాల పొడి, ఉప్పు తగినంత దోసెలు వెయ్యడానికి నూనె తగినంత బియ్యం, మినప్పప్పు, నువ్వులను కలిపి ఐదారు గంటలు నానబెట్టాలి. వీటిని పిండిగా రుబ్బుకుని కీరా తురుమును కలపాలి. మిరియాల పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. పెనం వేడిచేసి కాసింత నూనె వేసి ఈ పిండిని దోసెలుగా వేసేస్తే చందమామల్లాగా వస్తాయి. రెండు వైపులా కాల్చే కీరా దోసెలు మెత్తగా వస్తాయి. కరకరలాడాలనుకుంటే మినప్పప్పును తగ్గించడమో, పూర్తిగా మానెయ్యడమో చెయ్యవచ్చు. నచ్చిన పచ్చడితో తింటే అలా కడుపులోకి జారిపోతాయివి.

వేడిగా వడ

వేడిగా వడ...: శెనగ పప్పు : 
అర కప్పు మినప్పప్పు : పావు కప్పు కీరా తురుము : పావు కప్పు అల్లం కొంచెం, పచ్చిమిరప : రెండు, ఉప్పు తగినంత, కొత్తిమెర రెబ్బలు రెండు, ఇంగువ కాసింత, ఒక చెంచాడు జీలకర్ర నూనె : వేయించడానికి తగినంత శెనగ, మినప పప్పులను రెండు మూడు గంటల పాటు నానబెట్టాలి. అల్లం, పచ్చిమిరపలతో కలిపి బాగా రుబ్బాలి. కీర దోసకాయను మధ్యస్తంగా తురుముకొని దానికి కాసింత ఉప్పు కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత గట్టిగా పిండితే నీరు పోతుంది. పొడిగా ఉండే ఈ తురుమును గారెలు వేయించడానికి కాస్త ముందే వడల పిండిలో కలపాలి. కీరదోసకాయ తురుము నుంచి వచ్చిన నీటినే ఉపయోగించి పిండి రుబ్బుకోవడం మంచిది. దీనిలో ఉప్పు, జీలకర్ర, కొత్తిమెర, ఇంగువ కలపాలి. మరోపక్క మూకుడు పెట్టి నూనె బాగా కాగాక గారెలను బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తియ్యడమే. దీన్ని టమాటా సాస్‌తో ఇస్తే పిల్లలే కాదు, పెద్దలైనా వద్దనకుండా తింటారు.

కొబ్బరితో కూర:

కొబ్బరితో కూర: 
తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసిన కీరా : నాలుగు కప్పులు పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు కోసం : ఒక చెంచా నూనె, చిన్న చెంచాడు శెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరప, కర్వేపాకు రెబ్బలు రెండు, పొడి కోసం : వేరుశెనగ పప్పు : 3 టేబుల్‌స్పూన్లు పుట్నాల పప్పు : 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము : ఒక పెద్ద చెంచాడు, రెండు పచ్చి మిరపకాయలు, రెండు కొత్తిమెర రెబ్బలు కీర దోసకాయ మరీ లేతగా ఉండి, తొక్క కూడా తినేయచ్చనుకుంటే దాన్ని అలాగే ఉంచి ముక్కలుగా కోసెయ్యండి. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడయ్యాక పోపు సామానంతా వేసెయ్యాలి. అందులో చిటికెడు పసుపు వేసి కీరా ముక్కలు వెయ్యాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికేలా చూసుకోవాలి. ఈలోగా శెనగపప్పు, పుట్నాల పప్పు... వంటివాటిని మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూరలో కలపాలి. తర్వాత కొబ్బరి తురుమునూ కలపాలి. కొబ్బరి అంటే ఇష్టం లేనివాళ్లు మానెయ్యొచ్చు. పొయ్యి మీదనుంచి దించి, వేడి తగ్గాక ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు ముందే కలిపితే కూర పొడిగా రాదు.

Monday, March 4, 2013

బెండకాయ కొబ్బరి గ్రేవీ


బెండకాయ కొబ్బరి గ్రేవీ


కావలసినవి:
పొడవుగా తరిగిన బెండకాయలు - కప్పు
పచ్చికొబ్బరి - ఒక చిప్ప,
ఉల్లితరుగు - అరకప్పు
టొమాటోతరుగు - అరకప్పు,
అల్లం, వె ల్లుల్లి ముద్ద - టీ స్పూను
పోపు దినుసులు - టీ స్పూను,
ఎండుమిర్చి - 5
పసుపు - పావు టీ స్పూను,
ఉప్పు, కారం - తగినంత
గరం మసాలా - టీ స్పూను,
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - టేబుల్ స్పూను
తయారి:
కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో చెంచాడు నూనె కాగిన తరవాత బెండకాయముక్కలను రెండు నిముషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి. వేగాక అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసి మరో నిముషం వేయించి, టొమాటో ముక్కలు, నీళ్లు, బెండకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు మూతపెట్టి ఉడికించాలి. దీనిలో రుబ్చుకున్న కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, గ్లాసు నీళ్లు, గరంమసాలా వేసి మరో 5 నిముషాలు ఉడికించి దించుకోవాలి. వేరే బాణలిలో కొంచెం నూనె వేసి వేడి చేసి దానిలో పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాక, గ్రేవీలో కలపాలి.


పుల్లట్టు

కావలసిన పదార్థాలు :
పుల్లటి మజ్జిగ... మూడు కప్పులు
బియ్యం... ఒక కప్పు
మెంతులు... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
బజ్జీ మిరపకాయలు... ఆరు
ఉప్పు... తగినంత
జీలకర్ర... ఒక టీ.
నూనె... పావు కప్పు

తయారీ విధానం :
మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్రలను దంచి పిండిలో కలిపి దోశెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి. పెనంమీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండి పోసి, దోశెలాగా పామి నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి పుల్లట్టు తయార్...! ఏదేని చట్నీతో కలిపి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

Sunday, March 3, 2013

ఆవకాయ

ఆవకాయ





కావాల్సిన పదార్ధాలు ;-

మామిడి కాయలు ; 25
కారం ; 1 kg
ఆవపిండి ; 1kg
ఉప్పు ; 1kg
పసుపు ; 25 grams
మెంతులు; 200 grams
నునే ; 2kgs
తాయారు చేసే విధానం ;-

మామిడికయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆవకాయ కత్తి పేటతో ముక్కలుగా కొట్టుకోవాలి.తరువాత ఆ ముక్కలను పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బేసిన్లో ఒక పెద్ద గ్లాస్ తో 5 గ్లాసుల కారం పొయ్యాలి.తరువాత 5 గ్లాసుల ఆవపిండి పొయ్యాలి.ఉప్పు 3గ్లాసులు పొయ్యాలి.పసుపు 200 గ్రామ్స్ వెయ్యాలి.మెంతులు కూడా 200 గ్రామ్స్ వేసి మొత్తం గుండ అంతా కలిసేలాగా కలిపి kg నునే పోసి కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్న ఆవకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి ముక్కలకు పిండి అంటుకునే లాగా బాగా కలిపి కొంచం పిండి ముక్కలు కలిపి జాడి లోనికి వెయ్యాలి.మొత్తం ముక్కలన్నితిని ఇలానే వేసి జాడికి ముతా పెట్టేయాలి.ఆవకాయ పెట్టిన 3 డవ రోజున జాడిలోని ఆవకాయను బేసిన్లో పోసి తిరగ కలపాలి.తరువాత ఆవకాయను జాడీలో పెట్టి ఒక kg నూనేను పొయ్యాలి .అంతే ఘుమ ఘుమ లాడే ఆవకాయ రెడీ.

చిన్నముక్కల ఆవకాయ ( తొనుకుడు ఆవకాయ )

చిన్నముక్కల ఆవకాయ ( తొనుకుడు ఆవకాయ )

కావాల్సిన పదార్ధాలు

మామిడికాయలు - పది
ఆవపిండి - ముప్పావు గ్లాసు
ఉప్పు - ఒక గ్లాసు
కారం - రెండు గ్లాసులు
నునే - అర కేజీ
పసుపు -ఒక టీ స్పూన్

తయారుచేసే విధానం ;-

ముందుగ
మామిడికాయలను బాగా కడిగి తడి లేకుండా పొడిగా బట్టతో తుడిచి చిన్న
ముక్కలుగా తరగాలి.తరవాత ఒక బేసిన్లో ఆవపిండి,కారం ,ఉప్పు,పసుపు,మామిడి
ముక్కలు వేసి నూనే పోసి బాగా కలపాలి.అంతే చిన్నముక్కల ఆవకాయ రెడీ.ఇది
మరుసటి రోజుకు చాలా బావుంటుంది.త్వరగానే ఊరిపోతుంది. ఆవపిండి తక్కువ
వేస్తాము కనుక.

తొక్కుడు పచ్చడి

తొక్కుడు పచ్చడి

కావాల్సిన పదార్ధాలు;-

మామిడికాయలు - 15
మెంతులు - ఒక గ్లాసు
ఆవాలు - అర గ్లాసు
కారం - మూడున్నర గ్లాసులు
ఉప్పు - ఒక గ్లాసు
పసుపు - 6 టీ స్పూన్స్
నూనే - అర కేజీ
తయారు చేసే విధానం ;-

ముందుగ
మామిడికయలను బాగా కడిగి తడిలేకుండా పొడి బట్టతో తుడిచి పెచ్చుతిసి చిన్న
ముక్కలుగా తరగాలి.తరవాత ఆ ముక్కలలో ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత
పెట్టేయాలి. మరుసటి రోజు మెంతులను,ఆవాలను విడివిడిగా నూనే వెయ్యకుండా
వేయించాలి. చల్లారిన తరువాత ఆవాలు,మెంతులను మెత్తగా గ్రైండ్ చేయాలి.తరువాత
నిన్న మనము తరిగి పెట్టిన మామిడి ముక్కలను గట్టిగ పిండి కచ్చ పిచ్చాగా అంటే
మెత్తగా కాకుండా కొంచం బరగ్గా గ్రైండ్ చెయ్యాలి.ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన
మామిడి తురుము,ఆవాలు,మెంతుల పొడిని,కారాన్ని ఒక బేసిన్లో వేసి ముక్కలను
పిండాక వచ్చిన రసం అందులో పోసి బాగా కలపాలి. ఇప్పుడు అర కేగి నూనెను ఒక
గిన్నెలో పోసి సెగలు వచ్చేలాగ వేడి చెయ్యాలి.నూనే వేదేక్కేలోపు ఇరవై
ఎండుమిరపకయలను ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ,రెండు టేబుల్
స్పూన్స్ మెంతులు,ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని కాగిన నూనెలో పోసి చిటపట
లాడక పచ్చడిలో వేసి పోపు బాగా కలిసే లాగా కలపాలి.చల్లారిన తరవాత జాడీ లోకి
తీసి పెట్టాలి.అంతే ఘుమ ఘుమ లాడే తొక్కుడు పచ్చడి రెడీ.

మాగాయ

మాగాయ

కావలసిన పదార్ధాలు;-

మామిడి కాయలు - 25
మెంతులు - ఒకటిన్నర గ్లాసు
ఆవాలు - ముప్పావు గ్లాసు
కారం - 5 గ్లాసులు
ఉప్పు - రెండున్నర గ్లాసులు
నూనే - రెండు కేజీలు
పసుపు - 50 గ్రాములు
పోపు కోసం ;-

ఆవాలు -- రెండు టేబుల్ స్పూన్స్
మెంతులు -- 3 టేబుల్ స్పూన్స్
ఎండుమిరపకాయలు - 25ముక్కలుగా చేసి పెట్టుకోవాలి
ఇంగువ - రెండు టేబుల్ స్పూన్స్

తయారు చేసేవిధానం ;-

ముందుగ
మామిడికయలను బాగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా
తరిగి ఆ ముక్కలలో ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.మూడవ రోజున
మామిడి ముక్కలను గట్టిగ పిండి పెద్ద పళ్ళాలలో వేసి ముక్కలు కొంచం ముడుచు
కునేలగా ఎండ బెట్టాలి.మెంతులు,ఆవాలను వేయించి పొడి చేసి
పెట్టుకోవాలి.ముక్కలు పిండగ వచ్చిన రసాన్ని కూడా ఒక గంట ఎండ బెట్టాలి.
ముక్కలు ఎండాక ఒక బేసిన్లో వేసి రసం పోసి పొడి చేసి పెట్టుకున్న పొడిని
వేసి,కారాన్ని కూడా వేసి బాగా కలపాలి.తరవాత ఒక పెద్ద గిన్నెలో పైన చెప్పిన
నూనే పోసి సెగలు వచ్చేలాగ కాగాక పోపు దినుసులన్నీ వేసి చిటపట లాడాక మగలో
పోపును వేసి బాగా కలిపి చల్లారాక జడిలోనికి తెసి పెట్టుకోవాలి.అంతే ఘుమ ఘుమ
లాడే మాగాయ రెడీ.

ఇడ్లీ ఉప్మా వంటకం;

ఇడ్లీ ఉప్మా వంటకం;

కావలసిన పదార్థాలు: 

ఇడ్లీలు: 4-6 
పెద్ద ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2-4 (నిలువుగా కట్ చేసుకోవాలి)
జీడిపప్పులు : 10
ఆవాలు: 1tsp
నిమ్మరసం: 1tbsp
క్యారట్ తురుము: 1/2cup
పచ్చిబఠాణీ: 1/2cup
నూనె: కావలసినంత
పసుపు : చిటికెడు(అవసరం అనుకొంటే)
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానము:

1. ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌ లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి.
2,. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసి వేయించాలి.
3. తర్వాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను కూడా అందులో వేసి బాగా వేగించాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌ లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి. అంతే ఇడ్లీ ఉప్మా రెడీ.