Saturday, January 26, 2013

గుజరాతీ మసాలా పూరీ


గుజరాతీ మసాలా పూరీ

కావలసిన పదార్థాలు :


మినప్పప్పు – 1 కప్పు
గోధుమ పిండి – పావుకిలో
మిరియాలు – 4
ఎండుమిర్చి – 2
దాల్చిన చెక్క- కొద్దిగా
లవంగాలు – 3
గసగసాలు – 2 టీ స్పూన్లు
అల్లం – చిన్న ముక్క
నెయ్యి – 2 ½ స్పూన్లు
నూనె – తగినంత
ఉప్పు – తగినంత


తయారు చేసే పద్ధతి :
మినప్పప్పు శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి. నానాక మెత్తగా రుబ్బాలి. దాల్చిన చెక్క , లవంగాలు, గసగసాలు, మిరియాలు, మిరపకాయలు నూనె వేసి వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. అల్లం ముద్దగా నూరుకోవాలి. రుబ్బిన పిండిలో ఈ అల్లం ముద్దను కలపావాలి. గ్రైండ్ చేసిన మసాలా పిండిని కూడా దీనిలో కలపాలి. పిండి పలుచగా కాకుండా ముద్దలా ఉండేటట్లు చూడాలి. ఇప్పుడు గోధుమ పిండిలో నెయ్యి , ఉప్పు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. దీనిపైన తడిగుడ్డ పరచాలి. అలా అరగంట ఉంచి తరువాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు ఒకొక్కటి పూరీల్లా వత్తుకొని దానిపైన ముందుగా రుబ్బి ఉంచుకున్న మినపముద్ద మధ్యలో పెట్టాలి. చుట్టూ మడిచి ఉండలా చేసుకొని పూరీలా వత్తి వేయించుకుంటే గుజరాతీ మసాలా పూరీ సిద్ధం!

0 comments:

Post a Comment