Monday, December 30, 2013

ఇడ్లీ, దోసెల కోసం కారం పొడి



కావలసిన పదార్ధాలు:


మినప్పప్పు : ఒక టీ కప్పు నిండుగా....
శనగపప్పు : అర టీ కప్పు నిండుగా....
ఎండు మిర్చి: ఆరు లేక ఎనిమిది...
మిరియాలు : ఒక టీ స్పూన్
జీలకర్ర : ఒక టీ స్పూన్
వేరుశనగ గుళ్ళు : పావు కప్పు....
కరివేపాకు: తగినంత....
ఆవాలు : అర టీ స్పూన్...
మెంతులు : పావు టీ స్పూన్
ఇంగువ : చిటికెడు..
పసుపు : చిటికెడు...
నూనె : రెండు టీ స్పూన్లు,
ఉప్పు : రుచికి సరిపడా..
తెల్ల నువ్వులు : అర కప్పు...
తయారీ విధానం:
స్టవ్ మీద బాణలి / పాన్ వేడి చేసి....ముందుగా తెల్ల నువ్వులను, నూనె లేకుండా...(Repeat: నూనె లేకుండా) కమ్మని వాసన వచ్చేంత వరకూ దోరగా వేయించి, ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కనే ఉంచుకోండి.
నెక్స్ట్ స్టెప్:
అదే బాణలి లో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత....వరుసగా...ఆవాలు, మెంతులు, ఇంగువ,మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు రెబ్బలు, టక్కు, టక్కున వేస్తూ, అవి చిటపట లాడేక చిటికెడు పసుపు వేసి వెంటనే మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి అట్లకాడతో చక్కగా కలుపుతూ కమ్మని వాసన వచ్చేదాకా (కొద్దిగా రంగుమారే వరకూ) ఓ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి. స్టవ్ ఆర్పేసి మొత్తం అంతా ఓ ప్లేటులోనో, గిన్నేలోనో మార్చి చల్లార నివ్వండి. చల్లారిన తరువాత, తగినంత ఉప్పు ఆడ్ చేసి....మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి......
(టాల్కం పౌడర్ లా మెత్తగా పిండి చేయకండి ప్లీజ్!!!!!!....చేతికి కొద్దిగా బరకగా (బొంబాయి రవ్వలా) ఉండాలి)
ఫైనల్ గా ఓ సారి (ఎవరూ చూడకుండా కొద్దిగా టేస్ట్ చేసి) ఉప్పు సరిచూసుకొని స్టీల్/ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి....
ఈ కారం పొడిలో కాస్తంత కమ్మటి నెయ్యి వేసి ఇడ్లీ/ దోసెలతో నంచుకొని తింటుంటే....తన్మయత్వం లో పరిసరాలు మరచిపోతారు.

వంకాయ మెంతి కారం

వంకాయలు - 4 పెద్ద ముక్కలుగా కట్ చేసినవి
చింతపండు - 1 నిమ్మకాయంత
మెంతులు - 1 teaspoon
ఆవాలు - 1 tablespoon
ఎండు మిరపకాయలు - 6
మినపప్పు - 1 tablespoon
పసుపు
ఉప్పు
నూనె
ముందుగ చింతపండు నుండి రసం తీసి చింతపండు నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి.
ఒక పాన్ లో కొంచం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి.
వీటితో కొంచం ఉప్పు వేసి అన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.
వేగాక చేసుకొన్నా పొడి ని చల్లి ఇంకొంచం సేపు వేయించి దించేయాలి.
అంతే వంకాయ మెంతి కారం రెడీ.

టొమోటో క్యాప్సికం కర్రీ

కావలసిన పదార్థాలు: క్యాప్సికం - అర కేజీ
షాజీరా, దాల్చిన చెక్క పొడి. - రెండు టీస్పూన్లు
ధనియాలపొడి - 1 టీస్పూన్
ఉప్పు, కారం- తగినంత
నూనె- తగినంత
పసుపు - అర స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
టొమోటోలు - పావు కేజీ
ఉల్లిపాయలు - రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్
కొబ్బరిపొడి- 1 టీస్పూన్
తయారుచేయు విధానం:
ముందుగా క్యాప్సికం, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ మీద బాణెలి పెట్టి నూనె వేసి వేడయ్యాక. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంటమీద పది నిమిషాలు వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని కూడా అందులో వేసి మరో ఐదు నిమిషాలు మగ్గబెట్టాలి. ఆపై తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టి షాజీరా దాల్చిన చెక్క పొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, పసుపు కలపాలి. కూర దగ్గరికి వచ్చేదాకా చిన్నమంటమీద అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే క్యాప్సికమ్ కర్రీ రెడీ.

క్యారెట్ ఫ్రై


కావలసినవి :
క్యారెట్లు : పావు కేజీ
నూనె : సరిపడా
పచ్చిమిర్చి : ఐదు
కరివేపాకు : కొద్దిగా
పెరుగు : కప్పు
అల్లం వెల్లుల్లి : ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
మైదా : కప్పు
శనగపిండి : కప్పు
కారం : ఒక స్పూన్
తయారీ :
ముందుగా గిన్నెలో మైదా, అల్లం, వెల్లుల్లి,శనగ పిండి, ఉప్పు,కారం, పెరుగు వేసి పిండిని కొంచం గట్టిగా కలిపి పక్కనపెట్టుకోవాలి. క్యారెట్లు నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక శనగపిండి మిశ్రమంలో క్యారెట్ ముక్కలు ముంచి కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేగిన తరువాత వేయించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు వేయించి సర్వింగ్ లోకి తీసుకోవాలి

Sunday, December 29, 2013

క్యాబేజి ముల్లంగి కర్రీ


కావలసిన పదార్థాలు: ముల్లంగి - ఒక దుంప
క్యాబేజి - పావుకిలో
కరివేపాకు - ఒక రెబ్బ
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
కారం - ఒక స్పూన్
శెనగపప్పు - ఒక టేబుల్ స్పూను
మినప్పప్పు - అర స్పూను
పచ్చి బఠానీలు - ఒక కప్పు
పచ్చిమిరపకాయలు - ఐదు
వెల్లుల్లిరేకలు - నాలుగు
జీలకర్ర - అర టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
తయారుచేయు విధానం:
ముందుగా క్యాబేజీని, ముల్లంగిని సన్నగా తురిమి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. నీరు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసి బాగా కాగాక జీలకర్ర, ఆవాలు, ,మినప్పప్పు, శెనగపప్పు మిర్చి,కరివేపాకు , బఠానీలు వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న ముల్లంగి, క్యాబేజి తురుము కూడా వేసుకోవాలి. పసుపు,ఉప్పు,కారం వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

Saturday, December 28, 2013

మష్రూమ్ కర్రి

మష్రూమ్ కర్రి
కావలసిన పదార్థాలు:
మష్రుమ్: 1cup
ఆవాలు 1/4tsp
జీలకర్ర: 1/4tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా కోసం
ఉల్లిపాయ (చిన్నగా కట్ చేసుకోవాలి):
1 టమోటో (చిన్నగా కట్ చేసుకోవాలి):
పుదీనా ఆకులు: 6
కొత్తిమీర తరుగు: 2tbsp
జీడిపప్పు: 5
పచ్చిమిర్చి: 5
తయారు చేయు విధానం:
1. ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. అందుకోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో శుభ్రం చేసుకొన్న మష్రుమ్ ను వేసి కొద్దిగా ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో మసాలా పేస్ట్ వేసి తక్కువ మంట మీద మసాలాను బాగా వేయించాలి.
4. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే సమయంలో వేయించి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును అందులో వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత మూత పెట్టి అతి తక్కువ మంట మీద మష్రుమ్ ను ఉడికించుకోవాలి. అంతే మష్రుమ్ మసాలా రెడీ. ఇది చపాతీ, రోటీలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్

సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్
సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ తీసుకోవడం ద్వారా శరీరంలో కెలరీల శాతం తగ్గుతుందని, తద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్స్‌లో శరీరానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. మష్రూమ్స్ తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టడంతో పాటు శరీరంలో అనవసర ఫాట్‌కు చెక్ పెడుతుంది.
కావలసిన పదార్థాలు :
తాజా మష్రూమ్ -250 గ్రాములు
కార్న్‌ఫ్లోర్ - మైదా- చెరో 50 గ్రాములు
ఉల్లి తరగు - పావు కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -1 టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
ఎండు మిరపకాయ పేస్ట్ - పావు టీ స్పూన్
సోయా సాస్, వైట్ పెప్పర్ పొడి - చిటికెడు
నూనె - తగినంత
తయారీ విధానం :
ముందుగా శుభ్రపరిచిన మష్రూమ్‌ను ముక్కలు చేసి పక్కనబెట్టుకోవాలి. వీటిని మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు మిశ్రమంలో వేసి మసాలా అతికాక నూనెలో వేపుకోవాలి. కడాయిలో కాస్త నూనె పోసి అందులో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చిలను వేసి బాగా వేపుకోవాలి. తర్వాత ఎండు మిర్చి పేస్ట్ వేసి కాసేపయ్యాక వైట్ పెప్పర్‌ను వేసి కలపాలి. తగినంత ఉప్పు కూడా చేర్చాలి. ఇందులో వేపిన మష్రూమ్ చేర్చి, చివరికి వెల్లుల్లి ముక్కలు చల్లి దించేయాలి.

సీమపురి అట్టు!

సీమపురి అట్టు!
సీమపురి అట్లను నెల్లూరు జిల్లాలో కొత్త అల్లుడు అత్తవారింటికి వచ్చినప్పుడు తయారుచేసి పెట్టే ఆచారం వుంది. అలాంటి సీమపురి అట్టును ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా...
సీమపురి అట్లు ఉల్లికాడలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండు మిరపకాయలు, నిమ్మరసం జతకలిపి తయారు చేస్తారు.
కావాల్సిన పదార్థాలు :
పావు కిలో ఉల్లి పాయలు
15 గ్రాములు అల్లం, జీలకర్ర, కారం, నిమ్మ రసం, ఉప్పు
పిండి కోసం..
500 గ్రాములు బియ్యం
500 గ్రాములు ఉప్పుడు బియ్యం
200 గ్రాములు మినప్పప్పు
25 గ్రాములు శనగప్పు
10 గ్రాముల మెంతులు, ఉప్పు.
తయారీ విధానం :
పైన చెప్పిన పదార్థాలన్నింటిని నిమ్మరసం మినహా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. రెండు రకాల బియ్యం, శనగపప్పు, మినపపప్పు, మెంతులు కలిపి కనీసం ఐదారు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
పెనం వేడిచేసి కొంచెం మందంగా పిండిపరిచి దోసె సగం ఉడికాక టాపింగ్ పేస్టును పల్చగా పూయాలి. కొద్దిగా నెయ్యి వేసి రెండో వైపు తిప్పి దోరగా కాల్చుకోవాలి.

Sunday, December 22, 2013

ఐస్‌క్రీమ్‌

కావలసిన పదార్ధాలు
ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 1 పాకెట్‌
నీళ్ళు -10 కప్పులు
పంచదార -1 కప్పు
జీడిపప్పు -10
యాలకుల పొడి -కొద్దిగా
తయారుచేసే పద్ధతి
ఒక గిన్నెలో నీళ్లు పోసి, బాగా మరగబెట్టాలి. కొద్దిగా చల్లటి నీళ్లు తీసుకుని ఐస్‌క్రీమ్‌ పౌడర్ని పేస్ట్‌లా కలపాలి. మరుగుతున్న నీళ్లలో ఐస్‌క్రీమ్‌ పేస్ట్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఇది కలుపుతున్నప్పుడు మజ్జిగ లాగా వెనిల్లా ఫ్లేవర్‌తో వుంటుంది. ఈ నీళ్లు బాగా తెర్లిన తర్వాత దించి ఎగ్‌బీటర్‌తో గానీ, మజ్జిగ కవ్వంతో కానీ చిలకాలి. నురగ వచ్చేవరకు చిలికి చల్లారనివ్వాలి. తర్వాత గిన్నెలో పోసి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు గంటల తర్వాత గట్టిపడుతుంది. దానిని బయటికి తీసి స్పూన్‌తో బాగా కలిపితే ఐస్‌క్రీమ్‌ తయారవుతుంది. దీనిని చిన్న బౌల్స్‌లో వేసి పైన జీడిపప్పు, యాలకులపొడి చల్లి సర్వ్‌ చేయాలి.

కడై దాల్ తడ్కా

కందిపప్పు - 100 గ్రా.
నూనె - 25 గ్రా.
నెయ్యి - 10 గ్రా.
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
ఎండుమిర్చి - 4
పసుపు - చిటికెడు
మిరప్పొడి - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర - కొత్తిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - కొద్దిగా
అల్లం తరుగు - కొద్దిగా
వెల్లుల్లి తరుగు - కొద్దిగా
టొమాటో తరుగు - పావు కప్పు
కడై దాల్ తడ్కా తయారి
కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి
టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి.కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందు లో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి.

పిస్తా కుల్ఫీ

కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీ.
పంచదార.. పావు కేజీ
బ్రెడ్.. ఒక స్లైస్
బాదంపప్పు.. 20
పిస్తాపప్పు.. అర కప్పు
యాలక్కాయలు.. నాలుగు
కుంకుమపువ్వు.. కాస్తంత
తయారీ విధానం :
పాలు ఒక పాత్రలో పోసి అర లీటర్ అయ్యేంతదాకా బాగా మరిగించాలి. మరిగించిన పాలు చల్లారిన తరువాత అందులో పంచదార, బ్రెడ్, నీటిలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్ చేసిన బాదంపప్పు ముద్ద, పైన పొట్టుతీసేసి పలుకులుగా చేసుకున్న పిస్తాపప్పు, యాలక్కాయలు, కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి.
కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్ సెట్ చేసి అందులో పాల మిశ్రమం పోయాలి. దానికి ఓ ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చి.. 12 గంటలపాటు కుల్ఫీమౌల్డ్‌ని ఫ్రీజర్‌లో ఉంచాలి. తరువాత కుల్ఫీ మౌల్డ్స్‌ని బయటికి తీసి వేడినీటిలో ముంచినట్లయితే అందులోని కుల్ఫీ సులభంగా బయటికి వచ్చేస్తుంది. అంతే చల్ల చల్లగా అలరించే పిస్తా కుల్ఫీ రెడీ..! మంచి రుచిగా, కూల్‌గా ఉండే ఈ కుల్ఫీలను చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు.

టమాటా వడియాలు

టమాటా వడియాలు కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 1 కిలో
నీళ్లు - 5 లీటర్లు
జీలకర్ర - 4 టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి - 50 గ్రాములు
ఉప్పు - సరిపడా,
టమాటాలు - అరకిలో (రసం తీయాలి)
టమాటా వడియాలు తయారీ విధానం
మరిగిన ఐదు లీటర్ల నీళ్లలో రవ్వ వేసి ఉడికించాలి. ఉండ కట్టకుండా తిప్పుతుండాలి. అందులోనే ఉప్పు, జీలకర్ర, దంచిన పచ్చిమిర్చి, టమాటా రసం కలపాలి. ఈ మిశ్రమమంతా చిక్కగా ఉడికాక చల్లార్చాలి. ప్లాస్టిక్‌ కవర్‌ మీద చిన్న చిన్న వడియాల్లా పెట్టుకుంటే సరి. నోరూరించే టమాటా వడియాలు రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే బయట షాపుల్లో కొనుక్కునే కుర్‌కురే రుచి ఉంటుంది వీటికి.

రాగి సంకటి :

రాగిపిండి సంకటి (Raagi Sankati )

కావలసినపదార్దాలు :
రాగిపిండి : పావుకిలో
బియ్యం : ఒక కప్పు
ఉప్పు: తగినంత.
తయారు చేయు విధానం :
1) బియ్యంలోరెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి
2) మూడు వంతులు ఉడికిన తరువాత దించి గరిటె తో మెత్తగా మెదపాలి.
3) తరువాత మళ్లి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా రాగి పిండి పోస్తూ తిప్పాలి.
ఉప్పుకూడా వేసి కలియ తిప్పాలి.
4) బాగా దగ్గరగా ఉడికి ముద్ద చేయడానికి వస్తుంది అనుకున్న తరువాత దించి కాస్త వేడిగా ఉండగానే చిన్న, చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి.
5) వీటిని వేడి నెయ్యి తో కొబ్బరి పచ్చడి తో తింటే బాగుంటుంది.

దోశ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం.

రాగి దోశ :- రాగి పిండికి నీరు కలిపి తయారు చేసే దోశ. వీటిని బీద వారి దోశ అంటారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
వెళ్ల దోశ :- పిండిలో బెల్లము వేసి నెయ్యితో తయారు చేసిన దోశ. వీటిని చెట్నీలు లేకుండా తినవచ్చు.
గోధుమ పిండి దోశ :- గోధుమ పిండికి పెరుగు చేర్చి నీటిని కూడా కలిపి పలుచగా పిండిని తయారు చేసి వీటిని తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు. గోధుమ పిండికి బెల్లము నీరు కలిపి నెయ్యి వేసి కాల్చి చేసినట్లైతే తియ్యటి దోశలు తయారు చేయవచ్చు. వీటికి చట్నీలాంటి ఆధరువులతో అవసరం లేకుండా తిన వచ్చు.
రవ్వదోశ :- వీటిని బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, మైదాల మరియు పెరుగును చేర్చి వీటిని తయారు చేస్తారు. వీటిని పులవబెట్టవలసిన అవసరం లేదు. ఈ పిండిలో బియ్యపు పిండిని మాత్రము రెండు భాగాలు కలిపి చేస్తారు. ఈ పిండిలో నీరు అధికంగా చేసి పలుచగా తయారు చేసిన ఎడల పలుచని దోశలు తయారు చేయ వచ్చు. వీటిని బాగా కాల్చిన పెనం మీద పలుచగా పిండి పోసి తయారు చేసినప్పుడు చిల్లులతో దోశ చక్కగ తయారు ఉఒతుంది. వీటి మీద పలుచగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, అల్లపు ముక్కలు, కొత్త మల్లి ఆకు, ఎర్రగడ్డ ముక్కలు చల్లి కాలుస్తారు. ఈ దోశలను కొంచం పుల్లని చెట్నీలతో వడ్డిస్తారు.
కోన్ దోశ :- దోశను ఎర్రగా కాల్చి కోన్ మాదిరిగా మడిచి తయారుచేసిన దోశ. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
మెంతి దోశ :- దోశ మీద మెంతి ఆకు వేసి కాల్చి తయారు చేసే దోశ. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
పేపర్ దోశ :- పొడవుగా చాలా పలుచగా తయారు చేసి నూనెతో మరింత కాల్చి అందిస్తారు. దీనికి పెద్ద పెనము కావాలి కనుక మరియు చేయడానికి నేర్పు కావాలి కనుక వీటిని హోటళ్ళలో తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
ఎర్రగడ్డ దోశ :- సధారణంగా ఆనియన్ దోశ అని పిలుస్తారు. ఎర్రగడ్డలను పలుచని ముక్కలుగా తరిగి దోశ మీద పరచి కాల్చి దీనిని తయారు చేస్తారు. అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు.
మసాలా దోశ :- దోశ మీద చట్నీ లేక చట్నీ పౌడర్ వేసి కాల్చి దాని మీద ఉర్లగడ్డతో చేసిన మసాలా పెట్టి మడిచి వడ్డిస్తారు వివిధ చట్నీలతో ఆహారంగా తీసుకుంటారు.

దోశ

వెన్న దోశ :- దోశ కాల్చే సమయంలో నూనెకు బదులుగా వెన్న వేసి ఎర్రగా కాల్చి చేస్తారు. హోటల్సులో వీటిని విశేషంగా తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు. వడ్డన చేసే సమయంలో కూడా కొంత వెన్న దోశ మీద ఉంచి వడ్డన చేస్తారు.
కాల్చిన దోశ :- దీనిని సాధారణంగా రోస్ట్ అంటారు. ముందుగా పెనము మీద దోశను పలుచగా చేసి తరువాత దాని చుట్టూ మరియు మధ్యలో కూడా నూనెను వేసి మధ్యమమైన మంట మీద ఉంచి దానిని ఎర్రగా కాల్చి తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు. హోటళ్ళలో వీటిని విశేషంగా తయారు చేస్తారు.
పాలక్ మసాలా దోశ :- స్పినాచ్ గుజ్జును పూసి వాటికి మామూలు ఉర్లగడ్డ మసాలాను చేర్చి చేసిన దోశలను పాలక్ మసాలా దోశలు అంటారు.
పనీర్ చిల్లీ దోశ :- చీజ్ లేక పనీర్ తురుముకు కొంత మసాలా పొడులను చేర్చి దానిని దోశలలో కూర్చి తయారు చేసిన దోశలను పనీర్ మసాలా దోశలు అంటారు.
చైనీస్ మసాలా దోశ :- నూడిల్స్ మరియు ఇతర చైనా పదార్ధాలు కూర్చి చేసిన దోశలను చైనా మాసాలా దోశలు అంటారు. వీటికి సాస్ మరియు స్చీజాన్ చేర్చి తయారు చేస్తారు.
కూరగాయ మసాలా దోశ :- పచ్చిబఠాణీ గింజలు ఇతర కూరగాయలు చేర్చిన మసాలాతో చేసిన మసాలాదోశలను కూరగాయల మసాలా దోశ అంటారు.
మైసూరు మసాలాదోశ :- దోశమీద మసాలా పెట్టే ముందు కొబ్బరి చట్నీ మరియు ఎర్రగడ్డ చట్నీలను పూసి తయారు చేసే మసాలా దోశలను మైసూరు మసాలా దోశలు అంటారు.
పంచ రత్న దోశ :- బియ్యపు పిండి, చనగ పిండి, మైదా పిండి, గోధుమ పిండి, రవ్వలను వంటి అయిదు విధముల పదార్ధాలను చేర్చి పెరుగు కలిపి వీటిని తయారు చేస్తారు. ఈ పిండిని పులవబెట్టవలసిన అవసరం లేదు. పుల్లని మరియు కార చట్నీలతో వీటిని అందిస్తారు.
కాలిఫ్లవర్ దోశ :- కాలిఫ్లవర్ మసాలా కూరను దోశ మధ్య చేర్చి చట్నీలతో వడ్డిస్తారు. దక్షిణ భారతీయ హోటళ్ళలో కూడా ఇవి లభిస్తాయి.
అటుకుల దోశ :- పచ్చిబియ్యం అటుకులను నానబెట్టి రుబ్బి 12 గంటల సమయం నానబెట్టి సాధారణ దోశల మాదిరి లేక మందంగా ఒక వైపు మాత్రమే కాల్చి తీస్తారు ఈ దోశలు చక్కగా ఉబ్బునట్లు ఉండి మెత్తగా ఉంటాయి. అన్ని రకాల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారతో వీటిని తిన వచ్చు.
కొబ్బరి దోశ :- పచ్చి బియ్యం పచ్చి కొబ్బరి కొంచంగా మినప పప్పు కలిపి మెత్తగా రుబ్బి పిండిని దాదాపు 12 గంటల కాలం పులవ బెట్టి సాధారణ దోశలుగా వీటిని చేస్తారు. వీటిని కారచట్నీతో తింటారు.
ఉప్పు పుళి దోశ :- దోశ పిండికి ఉప్పు, చింతపండు గుజ్జు చేర్చి తయారు చేస్తారు. వీటిని ఉడిపిలో విశేషంగా తయారు చేస్తారు.
అమెరికన్ చాప్ స్యూ దోశ :- వేయించిన నూడిల్స్ మరియు టమేటాలను దోశల మీద వేసి వీటిని తయారు చేస్తారు.
70 ఎమ్ ఎమ్ దోశ :- ఇది మసాలా దోశలా ఉంటుంది కాని ఇది చాలా పొడవుగా తయారు చేస్తారు.
నీరు దోశ :- వీటిని ఉత్తర కర్నాటక, దక్షిణ కర్నాటక మరియు మేలెనాడులలో తయారు చేస్తారు
క్యాబేజి దోశ :- వీటిని క్యాబేజితో తయారు చేస్తారు. బియ్యము, ఎండు మిరపకాయలు, ఇంగువ మరియు పసుపులతో తయారుచేసిన పిండికి సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలను చేర్చి ఒక అరగంట సమయము నానబెట్టి దోశను ఎర్రగా కాల్చి తింటారు.
సెట్ దోశ :- కర్నాటకలో ప్రబలమైన దోశ ఇది. దీని ఒక వైపు మాత్రమే కాలుస్తారు. కాల్చే సమయంలో పైన మూత పెట్టి చేసినప్పుడు ఒక వైపు మాత్రమే కల్చినా కూడా చక్కగా ఉడుకుతుంది. వీటిని ఒక సారి మూడు లేక రెండుగా వడ్డిస్తారు కనుక వీటిని సెట్ దోశ అంటారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
ఊతప్పం :- మందంగా గుండ్రంగా తయారు చేసే దోశ. దీనిని తయారు చేయడానికి పెనము మీద ముందుగా నూనె వేసి తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.

Saturday, December 21, 2013

ఆలూ పాలకూర కర్రీ

కావలసినవి:
పాలకూర - 1 కట్ట
ఆలూ - 2
అల్లం - చిన్నముక్క
టమోటాలు - 1
పచ్చిమిర్చి- 4
నిమ్మ రసం - రెండు స్పూన్లు
ఉప్పు - తగినంత
గరంమసాల - 1 స్పూన్
పసుపు - అర స్పూన్
నెయ్యి - మూడు స్పూన్లు
కారం - సరిపడా
ఇంగువ - చిటికెడు
ఉల్లిపాయలు -1

తయారీ :

ముందుగా పాలకూర కడిగి శుభ్రం చేసుకుని ఉడికించి పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆలూ ను కూడా ఉడికించుకుని తొక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి,అల్లం ముక్కలు ,టమోటా ముక్కలు వేసి వేగాక పసుపు,కారం, గరం మసాల వేసి పది నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత ఆలూ ముక్కలు , పాలకూర పేస్టు ని వేసి ఒక ఐదు నిముషాల పాటు ఉడికించాలి. చివరిలో ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ని బౌల్ లోకి తీసుకుని నిమ్మ రసం కలుపుకోవాలి .

Thursday, December 12, 2013

ముల్లంగిని తింటున్నారా?


చాలామందికి ముల్లంగి అంటే పడదు. ఆరోగ్యదృష్ట్యా - అదో రకమైన వాసన, రుచిని అందించే ముల్లంగిని ఆహారంలో ఒక భాగం చేసుకోక తప్పదు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగిని తరచూ తురుములాగానో,
సలాడ్ రూపంలోనో లేదా సాంబారు కూరల్లోనో వేసుకు తింటే మంచిది. ముల్లంగి తినడం వల్ల శరీరానికి అధిక పొటాషియం లభిస్తుంది.
ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రత్యేకించి బీపీ ఉన్నవాళ్లకు మంచిది. మధుమేహులకూ ఉపయుక్తం. ఒక్కోసారి అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యను రాకుండా అడ్డుకునే శక్తి ఈ కూరగాయకు ఉంది. తెల్లరక్తకణాల సంఖ్యను పెంచి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ముల్లంగి. రక్తానికి తగినంత ఆక్సిజన్‌ను అందించడం వల్ల కాలేయానికి పని భారం తగ్గుతుంది. తద్వారా కామెర్ల సమస్య దరిచేరదు. ఇక, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఇదొక చక్కని మందు. ముల్లంగి తింటే గొంతునొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు రావు. ఈ కూరగాయలోని గాటు వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. విటమిన్ ఎ, డి, బి-12 లతోపాటు పీచు కూడా దొరుకుతుంది.

రుచికరమైన కాలీఫ్లవర్ పులావ్


కాలీఫ్లవర్ మరియు ఇతర ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ కు ఇది ఒక మంచి సీజన్. కాబట్టి, ఈ అవకాశన్ని వినియోగించుకోండి. ఈ ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గ్రీన్ వెజిటేబుల్స్ నోరూరిస్తుంటాయి. అటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ లో కాలీఫ్లవర్ ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యప్రయోజనాలను కూడా అధికంగా కలిగి ఉంది. కాలీఫ్లవర్ లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు ఇందులో పైబర్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఈ రోజు మనం ఈ కాలీఫ్లవర్ తో రుచికరమైన వంటను ప్రయత్నిస్తున్నాం.

కాలీఫ్లవర్ పులావ్ లేదా గోబీ పులావ్, ఈ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరింత రుచికరంగా ఉండటానికి కొన్ని మసాలాదినుసులను ప్రత్యేకంగా ఈవంటలో చేర్చడం వల్ల అద్భుతమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1cup
కాలీఫ్లవర్: 1(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
గ్రీన్ బటానీలు: ½cup
ఉల్లిపాయ: 1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి: 2 (మధ్యలోకి కట్ చేసుకోవాలి)
పసుపు: ½ tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
పెప్పర్ పౌడర్: ½tsp
జీలకర్ర: 1tsp
చెక్క: 1
యాలకులు: 2
బిర్యానీ ఆకు: 1
ఆయిల్: 1tbsp
నీటి: 2 cups
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను నీళ్ళు వేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ స్టౌమీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, వేసి కొన్ని సెకెంట్ ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3,4నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. అంతలోపు చిన్నగా విడిపించి పెట్టుకొన్న కాలిఫ్లవర్ పువ్వులను వేడినీళ్ళ ఒక నిముషం వేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పడు పాన్ లో ఫ్రై అవుతున్న మసాలా దినుసుల్లో ఈ కాలీఫ్లవర్ ను మరియు పచ్చిబటానీ, పచ్చిమిర్చిలను వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి .
6. అలాగే అందులో టమోటో, పసుపు, కారం, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్, గరం మసాలా, వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో బాస్మతి రైస్ కూడా వేసి, రెండు, మూడు నిముషాలు ఫ్రై చేయాలి.
8. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, పాన్ కు మూత పెట్టి 10-15నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
9. 15నిముషాల తర్వాత మూత తీసి మెత్తగా ఉడికనట్లైతే, స్టై ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనిక పులావ్ ను మార్చుకొని, సర్వ్ చేయాలి.

అంతే, తినడానికి కాలీఫ్లవర్ పులావ్ రెడీ . ఈ కాలీఫ్లవర్ పులావ్ను మీకు నచ్చిన గ్రేవీతో తినవచ్చు.

Monday, December 9, 2013

పనీర్ చిల్లీ ఫ్రై

పనీర్ చిల్లీ ఫ్రై
కావలసినవి:
పనీర్ - 250 గ్రా.; చిల్లీ గార్లిక్ సాస్ - కొద్దిగా
క్యాప్సికమ్ తరుగు - అరకప్పు
రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు
ఉల్లి తరుగు - కప్పు; సోయాసాస్ - కొద్దిగా
అజినమోటో (చైనా సాల్ట్) - కొద్దిగా
ఉల్లికాడల తరుగు - కొద్దిగా
తయారి:
- పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.
- బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- సోయాసాస్, అజినమోటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపాలి.
- చివరగా పనీర్ వేసి కలపాలి.
- ఒక టూత్‌పిక్‌కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.