Monday, January 28, 2013

మీల్‌ మేకర్‌ మంచూరియా

మీల్‌ మేకర్‌ మంచూరియా
కావలసిన పదార్థాలు
మీల్‌మేకర్‌ - 200 గ్రాములు
ఉల్లిపాయలు - 100గ్రా
క్యారెట్‌ -100గ్రా
బఠాణీలు - 100గ్రా
అల్లం వెల్లుల్లి - 100గ్రా
కొత్తిమీర -ఒక కట్ట
పచ్చిమిరపకాయలు-10
కార్న్‌ఫ్లోర్‌ పౌడర్‌ - 2 స్పూన్లు
అజినోమోటో - ఒక స్పూను
సోయా సాస్‌ - నాలుగు స్పూన్లు
వెనిగర్‌ - నాలుగు స్పూన్లు
నూనె - సరిపడా
ఉప్పు -రుచికి సరిపడా,
మైదా - రెండు స్పూన్లు
రెడ్‌ కలర్‌ - ఒక స్పూన్‌
తయారు చేసే విధానం : ముందుగా మీల్‌మే కర్‌ను నీటిలో నానబెట్టుకుని పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్‌ బఠాణీలను కొద్దిగా ఉడి కించుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌ పౌడర్‌, సోయాసాస్‌, అజినో మోటో, ఉప్పు, కలర్‌ వేసు కోవాలి. వెనిగర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్ర మాన్ని చిన్న చిన్న ఉండ లుగా చేసుకోవాలి. ఇప్పు డు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి. మరొ క పాత్రలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపా యలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించు కు న్న మంచూరియాను వేసుకోవా లి. కాసేపు ఫ్రై చేసుకుని కొతిమీర వేసుకుని దింపుకోవా లి. మీల్‌ మేకర్‌ మంచూరియా రెడీ.

0 comments:

Post a Comment