Friday, January 25, 2013

కొలస్ట్రాల్ ను తగ్గించే ఓట్స్ ఊతప్పం...

కొలస్ట్రాల్ ను తగ్గించే ఓట్స్ ఊతప్పం...

కావలసిన పదార్ధాలు:
ఓట్స్:2 cups
బొంబాయిరవ్వ: 2cups
మైదాపిండి: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి:4-6
కారట్ తురుము: 1/2cup
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర తరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె : సరిపడా
తయారు చేసే విధానం :
1. ముందుగా ఒక కప్పు ఓట్స్ ని మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత బొంబాయిరవ్వ, ఓట్స్ పొడి, మిగిలిన ఓట్స్ , మైదాపిండి బాగా కలిపి నీళ్ళతో దోసెల పిండి లాగ కలుపుకుని, ఒక గంట నాననివ్వాలి. ఎంత ఎక్కువ నానితే అంతా బాగా వస్తాయి.
3. నానిన పిండిలో, ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి కలపాలి.చివరగా క్యారెట్ తురుము,ఉప్పు కూడా వేసి కలిపుకోవాలి.
4. దోసెపిండి రెడీ. ఇప్పుడు దోశ పాన్ మీద నూనె వేసి వేడయ్యాక కొంచెం మందంగా ఊతప్పం లా వేసుకోవాలి. పలుచగా వేస్తే విరిగిపోతాయి. రెండు వైపులా వేగాక ఏదైనా చట్నీ తో సర్వ్ చెయ్యాలి. వేడిగా తింటే బావుంటుంది.

0 comments:

Post a Comment