Thursday, January 31, 2013

"మెంతి కారం కూర"

"మెంతి కారం కూర"


కావలసిన పదార్థాలు :
చిక్కుడుకాయలు... పావు కేజీ
నూనె... ఆరు టీ.
ఉప్పు... తగినంత
పసుపు... అర టీ.
చింతపండు గుజ్జు... రెండు టీ.
ఎండుమిర్చి... ఆరు
ధనియాలు... రెండు టీ.
శెనగపప్పు... ఒక టీ.
మినప్పప్పు... ఒక టీ.
మెంతులు... ఒక టీ.
జీలకర్ర... అర టీ.
ఇంగువ... చిటికెడు
ఎండుకొబ్బరి ముక్కలు... అర కప్పు

తయారీ విధానం :
ముందుగా చిక్కుడుకాయలు కడిగి ముక్కలు చేసి ఉంచాలి. స్టవ్‌మీద కడాయిపెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి కాగాక, మిరపకాయలు, ధనియాలు, సెనగపప్పు వేయాలి. అవి సగం వేగిన తరువాత మిగిలిన పోపు సామాను కూడా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అదే కళాయిలో మిగిలిన నూనె పోసి చిక్కుడు ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి మూతపెట్టాలి.

ఈలోపు వేయించి ఉంచిన పోపు గింజల్ని మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఇందులోనే ఎండుకొబ్బరి కూడా వేయాలి. చిక్కుడుకాయల ముక్కలు కాస్త మెత్తబడ్డాక, నూరుకున్న పొడిని కూరలో వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి, మంట తగ్గించి మూతపెట్టి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత వేడి వేడి అన్నంతో కలిపి వడ్డించాలి. కారాన్ని బాగా ఇష్టపడేవారికి ఈ కూర బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి మరి..!

0 comments:

Post a Comment