కావలసిన పదార్ధాలు:
స్టఫింగ్‌కి-
ముల్లంగి: 3
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1/2tsp
ధనియాల పొడి: 1/2tsp
పచ్చి మిర్చి: 2 (సన్నగా తరిగి)
రొట్టెకు:
గోధుమ పిండి: 2cup
ఉప్పు: తగినంత
నీరు: తగినంత
నూనె: కాల్చడానికి సరిపడ
తయారు చేసే విధానం:
1. ముందుగా గోధుమ పిండిని జల్లి పెట్టుకొని అందులో తగినంత ఉప్పు వేసు కొని కలిపిన తర్వాత అందులో నీరు పోసి ముద్ద చేసుకోవాలి. ఈ ముద్దను పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ముల్లంగిని తురమాలి. అందులో ఉన్న నీరంతా పోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి. బాణలి పొయ్యి మీద పెట్టి ముల్లంగి లేత బంగారు రంగు వచ్చే వరకు వండాలి. అందులో తగినంత ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపాలి. అది చల్లేరా దాకా పక్కన ఉంచాలి.
3. ఇప్పుడు ముద్ద చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా వత్తి అందులో రెండు స్పూన్ల ముల్లంగి మిక్స్చర్‌ను ఉంచి దాన్ని మళ్ళీ ఉండగా చుట్టుకోవాలి.
4. తర్వాత దాన్ని జాగ్రత్తగా మందపాటి పరాటాలా ఒత్తుకోవాలి. పెనం పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత పరాటాను దాని మీద కాల్చాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చే దాకా కాల్చాలి. వేడి వేడిగా దానిపై వెన్న వేసి, సాస్ తో వడ్డిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.

0 comments:
Post a Comment