Thursday, February 28, 2013

టమోటో నువ్వుల పచ్చడి

టమోటో నువ్వుల పచ్చడి


కావల్సిన పదార్థాలు: 
టమోటోలు: 2
నువ్వులు: 2 tsp
పచ్చిమిర్చి: 2
ఎండు మిర్చి: 3-6
చింతపండు పేస్ట్: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం: 
1. ముందుగా నువ్వులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేయించికొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే టమోటో ముక్కలు కూడా వేసి నీరు పోయేంత వరకూ వేయించు కోవాలి. తర్వాత చింతపండు గుజ్జును టమోటోముక్కల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకొన్న నువ్వులను, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకొన్న టమోటో చింత గుజ్జుతో సహా వేసి, ఉప్పు కూడా వేసి మరో సారీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే నువ్వుల టమోటో చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి గ్రీ రైస్ తో టింటే చాలా రుచిగా ఉంటుంది.

మష్రూమ్ మసాలా

మష్రూమ్ మసాలా

కావలసినవి
మష్రూమ్ - 10
నూనె - 25 గ్రా.
ఉల్లి తరుగు - 30 గ్రా.
(పొడవుగా తరగాలి)
టొమాటోలు - 50 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
జీడిపప్పు - 25 గ్రా.
పాలు - 50 మి.లీ.
తాజా క్రీమ్ - 20 గ్రా.
బాదంపప్పు- 20 గ్రా.
బిరియానీ ఆకు - 4
లవంగాలు - 4, ఏలకులు - 4
దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీస్పూను
చిరోంజీ - 20 గ్రా.
కర్బూజా గింజలు - 20 గ్రా.
పసుపు - చిటికెడు
మిరప్పొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కట్ట

- తయారి

టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.

బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.

బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి.

ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్‌లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి.

కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.

గార్లిక్ రైస్

గార్లిక్ రైస్ (వెల్లుల్లి రైస్)వెల్లుల్లి తో తయారు చేసే వంటలంటే కొంచెం ఘాటు.. కొంచెం కారంగా ఉండటం సహజం. కారం మాత్రమే కాదు, మంచిటేస్ట్ కూడా. ఆరోమాటిక్ గార్లిక్ రైస్ ఇండియన్ రైస్ రిసిపి. ఒక రకంగా దీన్ని పులావ్ రిసిపి అనవచ్చు . గార్లిక్ రైస్ (వెల్ల్లుల్లిపాయను) చితగ్గొట్టుకొని బాస్మతి రైస్, కొన్ని మసాలా దినుసులు, బిర్యాని ఆకుతో తయారు చేస్తారు .

ఇంకా ఈ గార్లిక్ రైస్ కు మీరు కావాలనుకుంటే కొన్ని కూరగాయల ముక్కలు కూడా చేర్చుకోవచ్చు. ఇది ఒరిజిన ఫ్లేవర్ కు ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. అదే టేస్ట్ అదే సువాన కలిగి ఉంటుంది. మీరు కనుక క్యారెట్, బీట్ రూట్, బీన్స్ మరియు గ్రీన్ పీస్ మిక్స్ చేసుకొన్నట్లైతే వెజిటేరియన్ పులావ్ రిసిపిలాగా తయారవుతుంది. కానీ గార్లిక్ రైస్ మాత్రం అదే టేస్ట్ తో వెజిటేబుల్స్ అవసరం లేకుండానే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి పాయలు:20(చితగొట్టుకోవాలి)
బాస్మతి రైస్:2 cups
పచ్చిమిర్చి:4 (మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండుమిర్చి:3
ధనియాలు:1tsp
జీలకర్ర:1/2 tsp
బిర్యాని ఆకు:1
సోంపు:1/2 tsp
జీడిపప్పు:10 (chopped)
వేరుశెనగపప్పు:10
నెయ్యి:2tsp
ఉప్పు:రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో డు మిర్చి, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా నీళ్ళు పోసి, గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
2. తర్వాత కుక్కర్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడిఅయ్యాక అందులో జీడిపప్పు మరియు వేరుశెనగపప్పు వేసి ఒక నిముషం వేగించి, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత అదే నెయ్యిలో సోంపు, బిర్యానీ ఆకు మరియు పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఎండు మిర్చి మిశ్రమాన్ని కూడా వేసి పోపుతో బాగా మిక్స్ చేస్తూ 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించాలి.
4. ఇప్పుడు అందులోనే చితగొట్టి పెట్టుకొన్నవెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద వేగింగుకోవాలి.
5. ఇప్పుడు అందులో బాస్మతి రైస్ శుభ్రం చేసి వేసుకోవాలి. బియ్యాన్ని వేగుతున్న మసాలా తో బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు వేగించాలి.
6. తర్వాత మూడు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల అలాగే ఉంచి తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకొన్న జీడిపప్పు, వేరుశెనగపప్పుతో గార్నిష్ చేసి ఏదైనా స్పైసీ కర్రీస్ తో వేడి వేడి గా సర్వ్ చేయాలి.

ఉల్లిపాయతో వంటలు


ఉల్లిపాయతో వంటలు
ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని మించిపోతోందని ఇట్టే అర్థమవుతుంది. ఏ కూరగాయతో కూర వండాలన్నా ముందు కోయాల్సింది ఉల్లిపాయనే. వేరే కూరల వంటలకు ఉల్లిని జోడించడం కంటే నేరుగా ఉల్లిపాయతోనే వంటలు చేసుకుతింటే పోతుంది కదా అనుకునేవారికి ఈవారం వంటిల్లు నచ్చుతుంది. ఉల్లిపాయ కూర నుంచి పచ్చడి వరకూ కొన్ని వెరైటీ వంటలు ఇచ్చాం చూడండి.
ఉల్లిపాయ రింగులు: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, మొక్కజొన్న పిండి - రెండు కప్పులు, శెనగపిండి - అర కప్పు, బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను, వంట సోడా - చిటికెడు, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఒక గిన్నెలో శెనగపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, వంట సోడా, కారం సరిపడా నీళ్లు పోసి గారెలపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఉల్లిపాయ చక్రాలను పిండిలో ముంచి నూనెలో వేసి వేగించి తీసేయాలి. అంతే ఆనియన్ రింగ్స్ రెడీ అయినట్టే.

ఉల్లిపాయ బజ్జీలు: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - రెండు, కోడిగుడ్లు - రెండు, శెనగపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీ స్పూను, సోడా - చిటికెడు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఉల్లిపాయల్ని సన్నగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, ధనియాల పొడి, కారం, సోడా, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కోడి గుడ్ల సొన కూడా వేసి బాగా కలపాలి. పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ చక్రాలు పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక దించేయాలి.

బ్రెడ్ ఉల్లిపాయ: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - రెండు, బ్రెడ్ ముక్కలు - ఐదు, వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పాలు - అర కప్పు, కోడి గుడ్డు తెల్లసొన - ఒకటి, ఉప్పు - తగినంత, మైదా పిండి - అర కప్పు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ఒక గిన్నెలో పాలు, కోడి గుడ్డు తెల్లసొన, మైదా పిండి, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. అందులో చక్రాలుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత అందులోని ఉల్లిపాయ ముక్కల్ని తీసి బ్రెడ్‌పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి వేగించాలి.

ఉల్లిపాయ కూర: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు(చిన్నవి) - ఎనిమిది, టమాటాలు - మూడు, పచ్చిమిరపకాయలు - రెండు, ఎండుమిరపకాయలు - రెండు, కారం - ఒక టీ స్పూను, ఆవాలు, కరివేపాకు - ఒక రెబ్బ, జీలకర్ర - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: ముందుగా టమాటాలను ఉడకబెట్టి తొక్కతీసి గుజ్జుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. తర్వాత టమాటా గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత, తొక్కవొలిచిన ఉల్లిపాయలు వేసి సన్నమంటపై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాక కూరని దించేయాలి.

ఉల్లిపాయ చెట్నీ: కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిరపకాయలు - ఆరు, జీలకర్ర - ఒక టీ స్పూను, కొత్తిమీర - ఒక కట్ట, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేగించాలి. వేగాక దించేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు,కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించి ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.

Tuesday, February 26, 2013

కడై వెజ్

కడై వెజ్

- కావలసినవి

బీన్స్ తరుగు - 20 గ్రా., క్యారట్ తరుగు - 20 గ్రా.
క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా., బఠాణీ - 20 గ్రా.
బంగాళదుంప ముక్కలు - అర కప్పు
(వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి)
పనీర్ ముక్కలు - 100 గ్రా.
క్యాప్సికమ్ ముక్కలు - 40 గ్రా.
ఉల్లిపాయ - 30 గ్రా. (పెద్ద ముక్కలుగా తరగాలి)
ఉల్లితరుగు - 20 గ్రా.
టొమాటో తరుగు - 40 గ్రా., పసుపు - చిటికెడు
మిరప్పొడి - 20 గ్రా., కొత్తిమీర తరుగు - కొద్దిగా
పచ్చిమిర్చి - 5, మిరియాలపొడి - 5 గ్రా.
గరంమసాలా - 5 గ్రా., ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, షాజీరా - 3 గ్రా.
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం
పల్లీలు - 10 గ్రా., జీడిపప్పు - 4 -5 పలుకులు
కర్బూజా గింజలు - 10 గ్రా., బాదంపప్పు - 10 గ్రా.
నూనె - 5 గ్రా.
(వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి)

- తయారి

బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.

పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి.

కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి.

కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

మష్రూమ్ మసాలా

మష్రూమ్ మసాలా

కావలసినవి
మష్రూమ్ - 10
నూనె - 25 గ్రా.
ఉల్లి తరుగు - 30 గ్రా.
(పొడవుగా తరగాలి)
టొమాటోలు - 50 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
జీడిపప్పు - 25 గ్రా.
పాలు - 50 మి.లీ.
తాజా క్రీమ్ - 20 గ్రా.
బాదంపప్పు- 20 గ్రా.
బిరియానీ ఆకు - 4
లవంగాలు - 4, ఏలకులు - 4
దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీస్పూను
చిరోంజీ - 20 గ్రా.
కర్బూజా గింజలు - 20 గ్రా.
పసుపు - చిటికెడు
మిరప్పొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కట్ట

- తయారి

టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.

బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.

బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి.

ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్‌లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి.

కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.

చోలే

చోలే

కావలసినవి
కాబూలీ శన గలు - 250 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 75 గ్రా.
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
బిరియానీ ఆకులు - మూడు
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున
గరంమసాలా - పావు టీ స్పూను
ఉప్పు - తగినంత

- తయారి

శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి.

బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి.

ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి.

మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

Wednesday, February 20, 2013

ఆలూ పరోటా



కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు: 2 కొత్తిమీర: ఒక కట్ట జీలకర్ర: 1tsp గరం మసాల: 1tsp పసుపు: 1tsp అల్లం వెల్లుల్లి ముద్ద: 1tbsp పచ్చిమిరపకాయలు: 4 ఉల్లిపాయలు: 2 గోధుమ పిండి: 3cups నెయ్యి లేదా నూనె: కావలసినంత ఉప్పు - రుచికి సరిపడ తయారు చేయు విధానం: 1. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, నీరు పో సి తడిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. 2. బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకొని, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. 3. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మిక్స్ లో వేసి పేస్ట్ చేసుకొని దాన్ని బంగాళదుంపలకు కలుపుకోవాలి. 4. ఇప్పుడు అందులోనూనెలో వేయించిన జీలకర్ర, గరం మసాల, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అన్నీ కలుపుకున్న తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. 5. గోధుమ పిండిని చిన్న చిన్న పూరీలుగా వత్తుకొని, ఒక్కొక్క దాని మధ్యలో బంగాళాదుంప ఉండను పెట్టి, నాలుగు మూలలు మడిచి, మం దంగా పెద్ద పెద్ద పూరీలుగా వత్తుకోవాలి. 6. పెనం లేదా పాన్‌ మీద నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక ఆలూ పరోట వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి. అంతే ఆలూ పరోట రెడీ. అవసరమైతే పల్లీల చెట్నీతో వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి.

Tuesday, February 19, 2013

టమోటో నువ్వుల పచ్చడి


కావల్సిన పదార్థాలు: టమోటోలు: 2 నువ్వులు: 2 tsp పచ్చిమిర్చి: 2 ఎండు మిర్చి: 3-6 చింతపండు పేస్ట్: 2 tsp ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత తయారు చేయు విధానం: 1. ముందుగా నువ్వులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేయించికొని పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే టమోటో ముక్కలు కూడా వేసి నీరు పోయేంత వరకూ వేయించు కోవాలి. తర్వాత చింతపండు గుజ్జును టమోటోముక్కల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. 3. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకొన్న నువ్వులను, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకొన్న టమోటో చింత గుజ్జుతో సహా వేసి, ఉప్పు కూడా వేసి మరో సారీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే నువ్వుల టమోటో చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి గ్రీ రైస్ తో టింటే చాలా రుచిగా ఉంటుంది.

ముల్లంగి పరోటా

ముల్లంగి: 1(తురుము) ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి) చాట్ మసాలా: 1tsp జీలకర్ర పొడి: 1/2tsp గోధుమ పిండి: 2cups మైదా: 1/2 cup అజ్వైన్: 1/2tsp నెయ్యి: 2tbsp నూనె: 1tbsp ఉప్పు: రుచికి సరిపడా తయారు చేయు విధానం: 1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అవ్వగానే, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. 2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 3,4 నిముషాల వేగించాలి. తర్వాత అందులో ముల్లంగి తురుమును వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు బాగా ఫ్రై చేయాలి. 3. తర్వాత అందులోనే ఉప్పు, కొత్తిమీర తరుగు మరియు చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాల ఫ్రై చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. 4. ఇప్పుడు ఒక బౌల్లో మైద, గోధుమపిండి, అజ్వైన్ మరియు ఉప్పు, ఇక చెంచా నెయ్యి వేసి, తగినన్ని గోరువెచ్చని నీళ్ళు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 5. తర్వాత చపాతీ పిండిని చిన్నచిన్న ఉండలు చేసుకొని మద్యలో వత్తుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న ముల్లంగి మిశ్రమాన్ని ఒక చెంచా పెట్టి కవర్ చేయాలి. 6. ఇలా అన్ని చాపాతీ బాల్స్ నింపి పెట్టుకొన్న తర్వాత ఒక్కొక్కటే చపాతీ కర్రతో చపాతీలా వత్తుకోవాలి. దీన్ని పాన్ మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా బాగా కాలేలా మీడియం మంట మీద కాల్చుకోవాలి . అంతే ముల్లంగి పరోటో రెడీ...

వెజిటేబుల్‌ కట్లెట్‌


కావలసిన పదార్ధాలు:




బంగాళ దుంపలు: 3
బ్రెడ్‌ స్లైసులు : 4
గరం మసాలా: అరచెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 స్పూను
కొత్తిమీర తురుము: 1 చెంచా
జీడిపప్పు పొడి: 1 చెంచా
కారం: 1 చెంచా
ధనియాలపొడి: 1చెంచా
జీలకర్ర పొడి: 1 చెంచా
ఉప్పు: తగినంత
నూనె: అవసరమైనంత

తయారు చేసే విధానం:
బంగాళదుంపలను ఉడికించి, తోలు తీసి మెత్తగా చిదుముకోవాలి. బ్రెడ్‌ స్లైస్‌ను పొడి చేసి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఉప్పు మినహా బంగాళదుంపతో పాటు ఇతర దినుసులను అన్నీ వేయాలి. ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత దించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి న పెనం మీద కాల్చుకోని అయినా తినవచ్చు లేదా నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవచ్చు. టమేటో కెచప్‌తో కలిపి వేడివేడిగా సర్వ్‌ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.  

సర్వపిండి అప్పాలు



సర్వపిండి అప్పాలు కావలసినవి 


బియ్యప్పిండి - పావు కేజీ
ఉల్లికాడలు -
నాలుగు 
(
కాడలు లేనప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి)
సొరకాయ తురుము - అర కప్పు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి పేస్టు - టీ స్పూన్
శనగపప్పు - 50 గ్రా (రెండు గంటల సేపు నానబెట్టాలి)
నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
కొత్తిమీర - అర కట్ట (తరగాలి)
కరివేపాకు - రెండు రెమ్మలు (తరగాలి)
నువ్వులు - రెండు టీ స్పూన్లు


సర్వపిండి అప్పాలు తయారి

బియ్యప్పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థాలనూ వేయాలి. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి. మందంగా ఉండే అల్యూమినియం పాత్ర లోపలి అంచులకు నూనె రాయాలి. ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని పాత్ర అంచులకు అంటేటట్లు అద్ది, పైన స్పూను నూనె వేసి సన్న మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అప్పం గిన్నెను వదిలి ఊడి వస్తుంది. దాన్ని తీసి మరొక వైపుకు అమర్చి కాల్చాలి. ఈ అప్పం కాలేటప్పుడు గిన్నెకు మూత పెట్టకూడదు. అల్యూమినియం పాత్రకు బదులు స్టీలు పాత్ర వాడితే అప్పం కాలకముందే మాడిపోతుంది. నాన్‌స్టిక్‌లో అప్పం వచ్చినప్పటికీ రుచిగా అనిపించదు. అల్యూమినియం పాత్ర లేకపోతే బాణలిలో చేసుకోవచ్చు.


అన్నం కట్లెట్‌


అన్నం కట్లెట్‌ కావలసిన పదార్థాలు

అన్నం - 1 కప్పు,
టమాటా రసం - అరకప్పు,
వెన్న - 1 స్పూన్‌,
అల్లం - చిన్నముక్క,
చీజ్‌ - 50 గ్రాములు,
పనీర్‌ - 100 గ్రాములు
బ్రెడ్‌ పొడి - 1 కప్పు,
మిరియాలపొడి - అర స్పూన్‌,
నూనె - వేయించడానికి సరిపడా,
ఉప్పు - తగినంత

అన్నం కట్లెట్‌ తయారీ విధానం

బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. సగం నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. తర్వాత అందులోనే చీజ్‌ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్‌ ఆకారంలో) చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.





Monday, February 18, 2013

బటర్‌ రైస్‌ ఉండలు



బటర్‌ రైస్‌ ఉండలు కావలసిన పదార్థాలు

వెన్న - 200 గ్రాములు
యాలకుల పొడి - 2 స్పూన్లు
ఉప్పు - సరిపడా
పంచదార - సరిపడా
బియ్యం పిండి - అర కిలో
నూనె - అర కిలో
నువ్వులు - 100 గ్రాములు

బటర్‌ రైస్‌ ఉండలు తయారు చేసే విధానం


బియ్యం పిండిలో వెన్న వేసి బాగా కలపాలి. మరుగుతున్న నీటిలో పంచదార, యాలకుల పొడి, ఉప్పు వేయాలి. అందులోనే వెన్న కలిపిన బియ్యం పిండి వేసి వుండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికి ముద్దయిన తర్వాత దించి చల్లారనివ్వాలి. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. బటర్‌ రైస్‌ ఉండలు నాలుగైదు రోజులు నిల్వ వుంటాయి.


t 

వంకాయ బటర్ మసాలా కావలసిన పదార్థాలు :



వంకాయ బటర్ మసాలా కావలసిన పదార్థాలు :

పొడవు వంకాయలు... అర కేజీ
ఎండుమిర్చి... పది
మినప్పప్పు... నాలుగు టీ.
ధనియాలు.... ఒక టీ.
ఉల్లిపాయలు... నాలుగు
వెన్న... వంద గ్రా.
ఉప్పు... తగినంత
నూనె... మూడు టీ.

వంకాయ బటర్ మసాలా తయారీ విధానం :
వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి. ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి. తరువాత ఉల్లిముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి. ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి. తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే...!

Sunday, February 17, 2013

గుత్తి వంకాయ మసాలకూర:-

గుత్తి వంకాయ మసాలకూర:-
కావలసిన సామగ్రి:-

1/2 కేజీ నీటి వంకాయలు 

3 ఉల్లిపాయలు

చిన్న అల్లం ముక్క

2 స్పూన్స్ ధనియాలు

1/2 చిప్ప కొబ్బరిముక్క

1 స్పూన్ గసగసాలు

పెద్ద నిమ్మకాయంత చింతపండు

ఉప్పు తగినంత

1/2 స్పూన్ జీలకర్ర

చిటికెడు పసుపు

తగినంత నూనె

1 స్పూన్ పొడికారం

2 యాలకులు

(పోపు సామగ్రి: సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,ఎండుమిరపకాయలు,కరివేపాకు,కొత్తిమీర)

(వంకాయలు తప్పించి మిగిలిన సామాన్లు అన్ని కలిపి మిక్సీలో వేసి మసాలా ముద్దని సిద్దంగా ఉంచుకోవాలి)

తయారుచేయు విధానం:-వంకాయలని 4 చీలికలుగా చేసుకోవాలి(కాని కాయ విడిపోకుండ గుత్తి విడకండ చూసుకోవాలి ).ముందుగ స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి వంకాయలు వేసి చింతపండు రసాన్ని వేసి ఉప్పు పసుపు వేసి కొద్ది సేపు ఉడికించాలి.పూర్తిగా వంకాయలు మెత్తబడకూడదు.ఉడికిన తరవాత చింతపండు నీటిని వంపి కాయల్ని పక్కన వేరే డిష్ లో ఉంచాలి......ఇప్పుడు బాణలిలో కొంచం ఎక్కువగా నూనెవేసి, పోపు దినుసులు వేసి, ముందుగా సిద్దంగా ఉంచుకున్న మసాలా ముద్దని పోపు వేగిన తరవాత వేసి.........మసాలా యొక్క పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న గుట్టివంకాయల్ని వేసుకోవాలి.......ఇప్పుడు ఒక గ్లాసుడు నీరు పోసి,పొడి కారము వేసుకొని కూర దగ్గరయ్యేంతవరకు ఉంచి స్టవ్ మీద నుండి దించుకోవటమే.......అంతే.......ఘుమఘుమలాడే గుత్తివంకాయ మసాలా కూర రెడీ..........

కాకరకాయ పులుసు బెల్లం కూర:-

కాకరకాయ పులుసు బెల్లం కూర:-

తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:-
1/4 కిలో కాకరకాయలు 

చిన్న నిమ్మకాయంత చింతపండు

రుచికి సరిపడా ఉప్పు

పెద్ద స్పూన్ పొడి కారం

చిటికెడు పసుపు

చిన్న బెల్లం ముక్క

నూనె

పోపు దినుసులు

కరివేపాకు

తయారుచేయు విధానం:-
ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి, ఆ ముక్కలలో చింతపండు రసం వేసి చిటెకెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి పెట్టుకుని, నూనె వేసి,పోపుకు సరిపడా మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు,కొద్దిగా ఆవాలు,
వేసి వేగాక, ఉడికించి పక్కన పెట్టుకున్న కాకర చక్రాలను పోపులో వెయ్యాలి.కాకర ముక్కల్ని కదుపుతూ ముందుగ తురిమి ఉంచుకున్న బెల్లం తురుము,పోడికారము వేసి కదుపుతూ 5 నిమిషాలు ఉంచి దించెయ్యాలి.అంతే కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ......

మొక్కజొన్న కట్లెట్ (Sweetcorn Cutlet)


మొక్కజొన్న కట్లెట్ (Sweetcorn Cutlet)
కావలసిన పదార్దములు


మొక్కజొన్నగింజలు : 2 కప్పులు
కొబ్బరి కోరు : కప్పు
పచ్చిమిర్చి : ఐదు
నూనె : అర కప్పు
ఉల్లి చక్రాలు : పది
కొత్తిమీర : అరకప్పు
బ్రెడ్ పొడి : రెండు కప్పులు
ఉప్పు : సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టేబుల్ స్పూన్
శెనగ పిండి : కప్పు
కార్న్ ఫ్లొర్ : అర కప్పు


తయారుచేయు విధానం :


1) మొక్కజొన్న గింజలు, కొబ్బరి కోరు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర మెత్తగా
రుబ్బాలి.
2) తరువాత దీనిలో శెనగపిండి, కార్న్ ఫ్లొర్, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి మనకు
నచ్చిన ఆకారంలో చేసుకొని వీటిని బ్రెడ్ పొడిలో అద్దుకోవాలి.
3) స్టవ్ వెలిగించి పెనం మీద నూనె వేసి ఈ కట్ లెట్ ని రెండు ప్రక్కలా ఎర్రగా
వేయించి ప్లేటులోకి తీయాలి.


* వీటిని ఉల్లి చక్రాలతో అలంకరించి సర్వ్ చేయాలి.
* అంతే మొక్కజొన్న కట్లెట్ రెడీ.

Saturday, February 16, 2013

క్యారెట్ గీ రైస్

క్యారెట్ గీ రైస్

సాధారణంగా క్యారెట్ తో రకరకాల వంటలు వండుతుంటారు. స్వీట్స్ గాను, కర్రీస్ గా, వెజిటేబుల్స్ సూప్స్, వెజిటేబుల్ పలావ్, సలాడ్స్, రైతా ఇలా అన్నీంటిలోకి నేనున్నాంటూ ముందుంటుంది క్యారెట్. టేస్ట్ పరంగానే కాదు.. ఆరోగ్య పరంగాను చాలా మంచిది. కాబట్టి క్యారెట్ ను ఏదో ఒక రకంగా ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రొటీన్ ఫుడ్ తో బోరుకొడున్నా... పిల్లలు తినమని మారాం చేస్తున్నా ఇలాంటి కలర్ ఫుల్ ఫుడ్ ను వారి ముందు ఉంచడి చాలు. ప్లేటు కాలీ అవ్వాల్సిందే. కొంచెం కారంగా.. కొంచెం తియ్యగా ఉండే ఈ క్యారెట్ గీ రైస్ కు జీడిపప్పు గార్నిష్ చేయడంతో మరింత టేస్టీగా తయారవుతుంది. మరి ఇంకెదుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి...

కావలసిన పదార్థాలు: 
బాస్మతి రైస్: 2cups
క్యారెట్: 2-3(తురుముకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్నగా కట్ చేసుకోవాలి)
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
యాలకులు: 2
బిర్యానీ ఆకు: చిన్నది
గరం మసాలా: 1tsp
కొత్తిమీర పేస్ట్: 1tbsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 4tbsp
జీడిపప్పు పలుకలు: కొద్దిగా

తయారు చేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రం చేసుకొని, పొడిపొడి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, యాలకుల, బిర్యానీ ఆకు వేసి అన్నింటిని దోరగా వేయించుకోవాలి.
3. తర్వాత అందులో క్యారెట్ తురుము వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. క్యారెట్ కొద్దిగా మెత్తగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు మీడియం మంట మీద వేయించాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. రుచి చూసి ఉప్పు సరిచేసుకొని చివరగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ గీ రైస్ రెడీ