Friday, January 25, 2013

బీరకాయ బజ్జీలు

బీరకాయ బజ్జీలు
కావలసిన పదార్థాలు :
బీరకాయలు... రెండు లేతవి
శనగపిండి... పావుకేజీ
బియ్యంపిండి... ఒక పెద్ద చెంచా
నూనె... వేయించేందుకు సరిపడా
వంటసోడా... చిటికెడు
ఉప్పు... తగినంత
కారం... ఒక టీస్పూన్

తయారీ విధానం :
చెక్కుతీసిన బీరకాయలను చిప్స్‌లాగా గుండ్రంగా కోసుకోవాలి. శనగపిండిలో బియ్యంపిండి, వంటసోడా, ఉప్పు, కారం కలిపి బజ్జీల పిండిలాగా (మరీ చిక్కగా లేదా మరీ పలుచగా కాకుండా.. మధ్యస్థంగా ఉండేటట్లు) కలుపుకోవాలి. ఈ పిండిని ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే నాననివ్వాలి.

ఆ తరువాత గుండ్రంగా కోసుకున్న బీరకాయ ముక్కలను పిండిలో ముంచి... బాగా కాగుతున్న నూనెలో వేసి... దోరగా వేయించుకోవాలి. అంతే వేడి వేడి బీరకాయ బజ్జీలు రెడీ అయినట్లే...! చాలా సులభంగా తయారయ్యే ఈ బీరకాయ బజ్జీలు తినేందుకు కూడా చాలా రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment