Friday, January 25, 2013

పచ్చి అరటికాయ వేపుడు

పచ్చి అరటికాయ వేపుడు

కావలసిన పదార్థాలు:
పచ్చి అరటికాయలు: 2(సన్నటి చక్రాలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2
ఎండు మిర్చి: 4
వెల్లుల్లి: 4పాయలు
ధనియాలు : 1tsp
కారం: 1/2tsp
ఎండు కొబ్బరి: చిప్పలో సగం
శనగపప్పు: 1tsp
పసుపు: 1/4tsp
జీలకర్ర: 1tbsp
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: వేయించడానికి కావలసినంత
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. అరటి కాయలు చెక్కు తీసి చక్రాలలాగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత పై దినుసులన్నీ కలిపి పొడి గొట్టుకోవాలి. అలాగే జిలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి.
2. పాన్ లో నూనె వేసి పోపు పెట్టాలి. అది చిటపటలాడుతుండగా అరటి ముక్కలు వేసి వేయిస్తూ ఉండాలి. కాసేపటికి కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి వేయించి మూత పెట్టాలి. మూతపైన కొన్ని నీళ్లు పోస్తే లోపలి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి.
3. తర్వాత మగ్గిన, ఉడికిన అరటి ముక్కల మీద పొడి జల్లి కలుపుకుంటే సరి 'పచ్చి అరటికాయ వేపుడు' రెడీ.

0 comments:

Post a Comment