Friday, December 12, 2014

అరటికాయ పుణుకులు .


కావాల్సిన పదార్ధాలు ;-
అరటికాయలు -- 2
మజ్జిగ -- ఒకకప్పు
ఉప్పు -- ఒక టీ స్పూన్
అల్లం -- అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -- 6
కారం -- అర టీ స్పూన్
వంటసోడా -- పావు టీ స్పూన్
మైదాపిండి -- ఒక కప్పు
బియ్యపు పిండి -- అర కప్పు
నూనె -- పావు కేజీ
కరివేపాకు -- రెండు రెమ్మలు
తయారుచేసే విధానం;-
ముందుగ అరటికాయలను పెచ్చు తీసి కట్ చేసి బాగా కడిగి గ్రైన్దర్ గిన్నెలో వేసి మజ్జిగ పోసి ఉప్పు,అల్లం వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి . ఇప్పుడు రుబ్బిన అరటికాయ పేస్టు లో మైదాపిండి ,బియ్యపుపిండి, వంటసోడా ,పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,కారం వేసి బాగా కలపాలి . తరవాత ఒక బాండి లో నూనె పోసి స్టవ్ మీద పెట్టి నూనె కాగాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని చిన్నచిన్న ఉండలుగా నూనెలో వేసి దోరగా వేయించాలి .. మొత్తం పిండిని ఇలానే వేయించాలి . అంతే ఘుమఘుమ లాడే కరకర లాడే అరటికాయ పుణుకులు రెడీ ......... ఇవి చట్నీ తోను ,చట్నీ లేకుండా కూడా తిన్న కూడా బావుంటాయి .... మజ్జిగతో చేసినవి కనుక పుల్లగా,కారంగా రుచిగా ఉంటాయి 

'అలసంద గుగ్గిళ్ళు'


కావలసిన పదార్ధాలు:
అలసందలు : పావు కిలో 
( చల్లటి నీళ్ళల్లో సుమారు 6 గంటల సేపు నాన్చాలి - తర్వాతా నీళ్ళు వడగట్టి......నానిన 'అలసంద' లను ఓ గిన్నెలో ఉంచండి.)

గుగ్గిళ్ళు చేయడానికి ముందు కావలసినవి:
నానిన అలసంద లు
రెండు/ మూడు పచ్చి మిర్చి ముక్కలు.
కరివేపాకు : కొద్దిగా...
పచ్చికొబ్బరి కోరు : పావు కప్పు.

పోపు కోసం:
మినప్పప్పు : ఒక టీ స్పూన్,
ఆవాలు : అర టీ స్పూన్.
ఇంగువ పొడి : చిటికెడు
ఎండు మిర్చి : రెండు చిన్న ముక్కలు..
వంట నూనె : రెండు టీ స్పూన్లు...

రుచికి సరిపడా : ఉప్పు...

చేసే విధం:
స్టవ్ మీద విశాలమైన బాణలి/ కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక.....

వరుసగా పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, నానిన అలసందలు, ఉప్పు చేర్చి చక్కగా గరిట తో కలిపి, మూతపెట్టి .......సన్నని మంటపై ఓ రెండు మూడు నిమిషాలు ఉంచాలి....
ప్లేట్ల లో సర్వ్ చేసేముందు....దానిపై కొబ్బరి కోరు చల్లి డెకరేట్ చేయండి...కావలిస్తే నిమ్మకాయ పిండుకోవచ్చు....ఎంజాయ్...(వేడి వేడిగా తింటేనే.....మజా.....)

Monday, December 1, 2014

(గోధుమ + జొన్న) రొట్టె

1) గోధుమపిండి ఒక భాగం , జొన్నపిండి రెండు భాగాలు , పుదినా , కొత్తిమీర పేస్టు కలిపి , తగినంత ఉప్పు కలిపి ,పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి. (ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
2) ఈ రొట్టెలలో పుష్కలంగా ఐరన్ , ప్రోటీన్ , ఫైబర్ (పీచు పదార్ధం) ఉంటుంది. కావాల్సిన కాల్షియమ్ కూడా అందుతుంది.
3) ఎవరైతే అధికబరువు , డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు , రాత్రి అన్నానికి బదులుగా , ఈ రొట్టెలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుండి 4 రొట్టెలు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రొట్టెలలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాల చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్ , కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగవు.
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి , చల్లగా తీసుకొంటే కడుపులో వేడి చేయదు.