Friday, January 25, 2013

వెరైటీ టేస్ట్ తో కార్న్ మసాలా దోసె

వెరైటీ టేస్ట్ తో కార్న్ మసాలా దోసె

కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్(మొక్కజొన్నగింజలు): 1/2cup(ఉడికించినవి)
బియ్యం: 2cups
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4-6
టమోటో: 2(కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రం చేసి, రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. రెండు గంటల తర్వాత బియ్యంలో నీటిని వంపేసి బియ్యాన్ని మిక్సీలో వేసి, కొద్దిగా ఉప్పు చేర్చి దోసెపిండిలా గ్రైడ్ చేసుకొని, మరొ గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకొన్న మొక్కజొన్న గింజలు, టమోటో మరియు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు అన్నింటిని వేసి బాగా కలుపుకొని, పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద దోస పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక దోస పిండితో దోసెను వేయాలి. దోసె మీద దోసె చివర్లలలో కూడా నూనెను వేయాలి.
5. వెంటనే దోసె స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకొన్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, దోసె మద్య భాగంలో పెట్టి దోసె మొత్తానికి స్పూన్ తో స్ప్రెడ్ చేయాలి. అంతే దోసె లైట్ బ్రౌన్ కలర్ రాగానే, కార్న్ మసాలా దోసెను రౌండ్ గా మడిచి సర్వింగ్ ప్లేట్ లోనికి సర్వ్ చేసి వేడి వేడిగా అందించాలి. (అవసరమైతే మొక్కజొన్న మిశ్రమానికి కొబ్బరి తురుమును కూడా చల్లుకోవచ్చు).

0 comments:

Post a Comment