Saturday, January 26, 2013

ఆలూ నెయ్యి జంతికలు


ఆలూ నెయ్యి జంతికలు


కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి... నాలుగు గ్లాసులు
జీలకర్ర... రెండు టీ.
బంగాళాదుంపలు... పావు కేజీ
నూనె... అర కేజీ
నెయ్యి... వంద గ్రా.
ఉప్పు, కారం... తగినంత
వాము... కొద్దిగా

తయారీ విధానం :
బియ్యప్పిండిని జల్లించాలి. బంగాళాదుంపలు ఉడికించి, తోలు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దీంట్లో బియ్యప్పిండి, ఉప్పు, కారం, వాము, జీలకర్ర వేసి నెయ్యితో బాగా కలపాలి. స్టౌ మీద బాణలి పెట్టి జంతికల గొట్టంలో పిండివేసి, నూనె బాగా కాగిన తర్వాత ఆ పిండిని ఎర్రగా వేయించాలి.

తినడానికి రుచికరంగా ఉండే ఈ జంతికలు మిగిలిన వాటితో పోల్చితే అంత ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అయినా కనీసం ఐదారు రోజులు నిల్వ ఉంటాయి. ఇదే విధంగా అరటి కాయలతో కూడా చేయవచ్చు. మీరూ ప్రయత్నించి చూడండి మరి...!

0 comments:

Post a Comment