నిమ్మకాయ ఊరగాయ
కావాల్సిన పదార్ధాలు ;-
నిమ్మకాయలు -- 60
కారం -- రెండున్నర కప్పులు
ఉప్పు -- రెండు కప్పులు
మెంతులు -- పావు కప్పు
పసుపు -- ఒక టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం ;-
ముందుగ నిమ్మకాయలను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తడి ఆరిన నిమ్మకాయలను 24 తీసుకుని నిలువుగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగిలిన 36 నిమ్మకాయలను చెక్కలుగా తరిగి రసం పిండాలి.తీసిన రసాన్ని నిమ్మకాయ ముక్కల్లో పోసి పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి ఒక రోజంతా అలానే వుంచేయాలి మూత పెట్టి.మరునాడు మెంతులను వేయించి మెత్తగా పొడి చేసి మెంతి పొడిని ,కారాన్ని నిమ్మకాయ రసం,ముక్కలు కలిసివున్న గిన్నెలో పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి.అంతే ఘుమఘుమ లాడే నిమ్మకాయ ఊరగాయ రెడీ.ఈ ఊరగాయ ను వేడి వేడి అన్నంలో నెయ్యి తో కలిపి తింటే చాల బావుంటుంది.c విటమిన్ కూడా లభిస్తుంది మనకు.చలి కాలంలో జలుబు రాకుండా నివారిస్తుంది.

0 comments:
Post a Comment