Friday, January 25, 2013

దొండకాయ గుత్తికూర

దొండకాయ గుత్తికూర

కావలసిన పదార్థాలు:
దొండకాయలు: 20
జీలకర్ర: 1tsp
శనగపప్పు: 5tsp
ఎండుమిర్చి: 4
వెల్లుల్లి :5 రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp
తాలింపు కోసం:
నూనె: కావలసినంత
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. మొదటగా జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కొద్ది ఆరకా, జిలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి.
3. దొండకాయలకు(మూడొంతులు)నిలువుగా కత్తితో పెట్టి ఈ మిశ్రమం అందులో కూరి అరగంట పక్కనుంచాలి.
4. పాన్ లో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో పాన్ లో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి అంతే దొండకాయ గుత్తికూర రెడీ.

0 comments:

Post a Comment