Monday, January 28, 2013

"చింతచిగురు పప్పు"

"చింతచిగురు పప్పు" 


కావలసిన పదార్థాలు :
చింతచిగురు.. ఒక కప్పు
కందిపప్పు లేదా పెసరపప్పు.. అర కప్పు
ఉల్లిపాయ.. ఒకటి
పచ్చిమిర్చి.. ఐదు
పసుపు.. పావు టీ.
ఉప్పు.. తగినంత

పోపుకోసం...
నూనె.. ఒక టీ.
జీలకర్ర, ఆవాలు.. ఒక టీ.
ఇంగువ.. చిటికెడు
ఎండుమిర్చి.. మూడు
కరివేపాకు.. రెండు రెబ్బలు

తయారీ విధానం :
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి. పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి.

ఉడికిన చింతచిగురు, పప్పు మిశ్రమాల్ని.. ఉప్పుని పోపులో వేసి కలిపి, ఒక నిమిషంపాటు ఉంచి దింపేయాలి. అంతే చింతచిగురు పప్పు తయార్..! దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి, అప్పడం కాంబినేషన్‌తో వడ్డిస్తే అదిరిపోతుంది. చింతచిగురును పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి. బెణుకులకు, పాత నొప్పులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీనిని బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.

0 comments:

Post a Comment