అటుకుల గారెలు
కావలసిన పదార్థాలు:అటుకులు - 2 కప్పులు, బంగాళదుంపలు - 100గ్రా, బ్రెడ్ స్లయిస్ -3, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం తరుగు - 1 టీ స్పూను, పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, జీలకర్ర - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:అటుకుల్ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. బంగాళదుంపని ఉడికించి
తొక్కతీసి మెదపాలి. బ్రెడ్ స్లయిస్‌ని నీటిలో తడిపి చిదమాలి. ఒక వెడల్పాటి పాత్రలో అటుకులు, బంగాళదుంప గుజ్జు, చిదిమిన బ్రెడ్, ఉల్లి, మిర్చి, పుదీనా, అల్లం తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. నిమ్మకాయంత ఉండలు చేసుకుని అరచేతిలో గారెల్లా వత్తుకుంటూ నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి టమేటో సాస్‌తో బాగుంటాయి.

0 comments:
Post a Comment