Sunday, January 27, 2013

స్పెషల్ సైడ్ డిష్ చెన్నా-క్యారెట్ కర్రీ


స్పెషల్ సైడ్ డిష్ చెన్నా-క్యారెట్ కర్రీ

కావలసిన పదార్థాలు:
క్యారెట్స్: 2-4
చెన్నా: 1/2cup
కొబ్బరి తురుము: 1/4cup
పచ్చిమిర్చి: 2-4
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఆవాలు: 1tsp
ఉద్దిపప్పు: 2tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో చెన్నా దాల్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గిన తర్వాత కుక్కులోని నీళ్ళును వంపేసి చెన్నాను ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత క్యారెట్ ను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి, లైట్ గా ఉడికించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమర్చి, మరియు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్ గా వేయించుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత అందులో లైట్ గా ఉడికించి పెట్టుకొన్న క్యారెట్ వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి.
5. తర్వాత చెన్నా దాల్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ మరో నిమిషం పాటు వేయించాలి.
6. చివరగా కొబ్బరి తురుమును కలిపి, బాగా కలపాలి. తక్కువ మంటమీద కలిపేటప్పుడు మంచి సువాసన వెలువడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చెన్నా క్యారెట్ ఫ్రై రెడీ. దీన్ని అన్నం, చపాతీ, రోటీ, పూరీలోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది.

0 comments:

Post a Comment