Friday, January 25, 2013

వేడి వేడి ఆనియన్ బజ్జీ

వేడి వేడి ఆనియన్ బజ్జీ

కావలసినపదార్థా: 

ఉల్లిపాయలు(ఉల్లిచక్రాలు): 20(ఉల్లిపాయలను రౌండ్ గా చక్రాల్లా కట్ చేసుకోవాలి) 
శనగపిండి: 2cups
కార్న్‌ఫ్లోర్: 1tsp
లవంగాల పొడి: 1/2tsp
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పైన చెప్పిన పదార్థాలను (నూనె, ఉల్లిచక్రాలు తప్పించి) ఒక గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీలపిండిలా కలుపుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగనివ్వాలి.
3. నూనె వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లి చక్రాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ బజ్జీలు వేసి దోరగా వేయించాలి.
4. బాగా వేగిన తరవాత టిష్యూ పేపర్ మీదకు తీసి కొద్దిగా చల్లారిన తరవాత కొత్తిమీర లేదా టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. అంతే ఆనియన్ బజ్జీ రెడీ...

0 comments:

Post a Comment