Monday, March 24, 2014

మొక్కజొన్న బోండా

 
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు : కప్పు (ఉడకబెట్టినవి),
బంగాళా దుంప : కప్పు (ఉడకబెట్టినది),
అల్లం : చిన్న ముక్క,
పచ్చిమిర్చి : 2, కొత్తిమీర :
కట్ట, ఉప్పు : తగినంత,
శనగపిండి : 2 కప్పులు,
జీలకర్ర : చిటికెడు,
నూనె : వేయించడానికి సరిపడ.

తయారుచేసే పద్ధతి :
అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్నల గింజలను మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. శనగపిండిలో ఉప్పు వేసి బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి. ఉండలను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. వాహ్..మొక్కజొన్న బొండా తయార్..

కొబ్బరి పొంగడాలు

 
కావలసినవి
కొబ్బరికోరు-రెండు కప్పులు,
తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు
బెల్లం, పంచదార-కప్పు చొప్పున,
యాలకులు-ఆరు
నూనె-పావుకిలో,
జీడిపప్పు-పావు కప్పు,
నెయ్యి-నాలుగు చెంచాలు
పెరుగు-కప్పు

తయారుచేసే విధానం
  • బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి.
  • అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి.
  • పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి.
  • ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి. రెండువైపులా కాల్చితే...చాలా రుచిగా ఉంటుంది. లేదంటే...నూనెలో కూడా వేయించుకోవచ్చు.
  • అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.

గుత్తి పొట్లకాయ కూర


  కావలసిన పదార్థాలు :

పొట్లకాయ            -            1
బంగాళదుంప       -             1 (ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లి తరుగు         -              ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు -             1 టీస్పూన్
కొత్తిమీర తరుగు   -                అరకప్పు
నిమ్మరసం           -              ఒక టీస్పూన్
ఉప్పు                 -              తగినంత
నూనె                 -              వేయించడానికి సరిపడా
రవ్వ                  -              3 టేబుల్ స్పూన్లు

తయారుచేసే పద్ధతి :

              పొట్లకాయను ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసి, లోపలి గుజ్జు, గింజలు తీసేయాలి. ఒక పాత్రలో చిదిమిన ఆలు, ఉల్లి, మిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ముక్కల్లో నింపాలి. కూర కనిపించే భాగాల్ని రవ్వలొ అద్ది సన్నని మంటపై నూనెలో దోరగా వేయించాలి. (ఇష్టమైతే ఆలు మిశ్రమానికి బదులు శనగ పిండి, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, చింతపండు గుజ్జుల మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకొని పొట్ల గొట్టాల్లో పూడ్చవచ్చును)

బీరకాయ పల్లీ మసాలా

  కావలసినవి:
బీరకాయ (పెద్దది) - ఒకటి,
ఉల్లిపాయ (పెద్దది, తరిగి) - ఒకటి,
వేగించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి - ఐదు,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - ఒక టేబుల్ స్పూన్.
తాలింపుకు:
నువ్వుల నూనె - ఒక టేబుల్ స్పూన్,
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ - ఒక్కో టీస్పూన్.

తయారీ:
బీరకాయ చెక్కు తీసేసి సన్నగా తరగాలి. వేగించిన పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. (నీళ్లు పోయొద్దు. ఉడికేటప్పుడు బీరకాయ ముక్కల నుంచి నీరు వస్తుంది.) చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కలిపి కొన్ని నిమిషాల తరువాత స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి. ఈ కూరని వేడివేడిగా అన్నం, రోటీ, పరాఠాల్లో తింటే బాగుంటుంది.

Saturday, March 22, 2014

కాకరకాయ వేపుడు

కావలసిన దినుసులు:
కాకారకాయలు – 4 (మీడియమ్ సైజు)
వెళ్ళుళి రెబ్బలు - 6
పచ్చిసెనగ పప్పు – 1 స్పూన్
మినపగుళ్ళు – 1 స్పూన్
ఎండు మిర్చి - 3
కర్వెపాకు – 2 రెండు రెమ్మలు
ఆవాలు – 1 స్పూన్

జీలకర్ర -1 స్పూన్
కారం - 2 స్పూన్స్
పసుపు - 1 టీ స్పూన్
నూనె – 3 స్పూన్స్
తయారుచేయువిధానం:
ముందుగ కాకరకాయలను శుభ్రంగా కడిగి, గుండగా తరిగి పెట్టుకోవాలి (గుండగా తరిగటానికి వేజటెబుల్ కట్టర్ను వాడాలి).
ఒక కడాయిలొ నూనె పోసి అది వేడెక్కిన తరవాత అందులొ ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కర్వెపాకు, వెళ్ళుళి రెబ్బలు వేసి వేయుంచుకోవాలి. అవి వేగిన తరవాత గుండగా తరగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మూత పెట్టకుండ ఇరవై నిమషాలు వేయుంచుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చెవరకు వేయించి దించే ముందు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే!  ఏంతో కమ్మగ కర కర లాడే కాకరకాయ వేపుడు రెడీ.

ఇడ్లీ పిండి బోండాలు

కాలవసిన దినుసులు:
ఇడ్లీ పిండి – రెండు కప్పులు
ఉప్పు – 1 టేబుల్ స్పూన్
ఉల్లి పాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా  ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర తరిగి, ఇడ్లీ పిండిలొ కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపి ప్రక్కన పెట్టు కోవాలి. కడాయి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా మరిగినప్పుడు, ఇడ్లీ పిండిని చేతితొ గుండ్రంగా చేసి,  నూనెలొ వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ బోండాలు పల్లి పచ్చడితొ తింటే చాల రుచిగా వుంటాయి. అంతే! ఎంతో రుచిగ వుండే ఇడ్లీ పిండి బోండాలు రెడీ. 

ఆలుగడ్డ పిట్టు

ఆలుగడ్డ(బంగాళదుంప)  ఆరోగ్యానికి చాల మంచిది. మంచి పోషకవిలున్నాయి. వాతవ వున్నావారు, షుగర్ వున్నావారు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఆలుగడ్డ పిట్టు చాల తోందరగా అయిపోతుంది. పూరితో ఆలుగడ్డ పిట్టు తింటే చాల బావుంటుంది.
కావలసిన దినుసులు:
ఆలుగడ్డ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిరపకాయలు – ఆరు
కారం – టీ స్పూన్
కొత్తిమీర – చిన్న స్పూన్
నూనే – రెండు స్పూన్స్
పసుపు – చిటికెడు
పోపు దినుసులు:
ఆవాలు – టేబుల్ స్పూన్
జీలకర్ర -  టేబుల్ స్పూన్
పచ్చిశెనగపప్పు -  టేబుల్ స్పూన్
మినప గుళ్ళు – టేబుల్ స్పూన్
కరివేపాకు – కొంచెం
ఎండుమిర్చి – రెండు
తయారుచేయ విధానము:
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డల పై పెచ్చు తీసి శుబ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్,లో కొంచెం నీళ్ళు పోసి ఒక గిన్నెలో ఆలుగడ్డలను పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఆరు వీజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తరవాత గుత్తితో ఆలుగడ్డలను  బాగా మెదిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని పోయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపగుళ్ళు,  ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరవేపాకు వేసి బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తరవాత, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తరవాత ఆలుగడ్డను వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు, కారం వేసి నాలుగు వైపుల కలిపి రెండు నిమషాలు మూత పెట్టుకోవాలి. చివరిగా రుచి చూసి, కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే ఆలుగడ్డ పిట్టు రెడీ!

రైస్‌ స్ప్రింగ్‌రోల్‌



కావలసినవి అన్నం: కప్పు, మైదా: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, పసుపు: అరటీస్పూను, నిమ్మరసం: అరటీస్పూను, కొబ్బరిపొడి: అరకప్పు, ఉప్పు: సరిపడా, టొమాటోసాస్‌: 2 టేబుల్‌స్పూన్లు, చిజ్‌తురుము: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: అరటీస్పూను, ఆవాలు: అరటీస్పూను, నూనె: 2 టీస్పూన్లు, ఎండుమిర్చి: 2 
తయారుచేసే విధానం
* మైదా, బియ్యప్పిండి కలపాలి. అందులోనే ఉప్పు, మిరియాలపొడి వేసికలిపి తగినన్ని నీళ్లు పోసి కలిపి దోసెల్లా వేయాలి. * బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అన్నం, పసుపు, నిమ్మరసం, కొబ్బరిపొడి వేసి వేయించి దించాలి. ఇది చల్లారిన తరవాత దోసెలమీద చల్లి రోల్‌ చెయ్యాలి. ఇప్పుడు ఈ రోల్స్‌మీద సాస్‌వేసి చిజ్‌తురుము చల్లి మైక్రోవేవ్‌లో ఓ నిమిషం బేక్‌ చేసి తీయాలి.

Thursday, March 20, 2014

క్యారెట్ కూర

కావలసిన పదార్ధాలు :
క్యారెట్లు :మూడు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి :రెండు
కారం :అర టీ స్పూన్
పసుపు : చిటికెడు
నూనె :రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు :రెండు రెమ్మలు
ఉప్పు : సరిపడా
అల్లం ముక్కలు : టీ స్పూన్
పోపు దినుసులు : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) క్యారెట్లు చెక్కి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి కాగాక - పోపుదినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంముక్కలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక, క్యారెట్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా చేస్తే క్యారెట్ ముక్కలు మెత్తబడతాయి.
3) చిన్నమంటమీద ఐదునిముషాలు ఉంచి మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.

Wednesday, March 19, 2014

టమాటో పచ్చడి

కావలసిన పదార్ధాలు:

ఎర్రటి టమాటోలు-6 , చింతపండు - పెద్ద ఉసిరి కాయంత , పచ్చిమిర్చి- 4, ఎండుమిర్చి- 2, శెనగపప్పు -2 టేబుల్ స్పూన్లు, మినపప్పు -2 టేబుల్ స్పూన్లు , మెంతులు - 1/2 టేబుల్ స్పూను, పసుపు- 1/4 టీ స్పూను, నూనె - 1/2 కప్పు , ఉప్పు - రుచికి తగినంత , ఆవాలు- 1/2 టీ స్పూను , ఇంగువ- చిటికెడు ,కొత్తిమీరతురుము ఇష్టమైతే -1/2 కప్పు .


తయారు చేసే పధ్ధతి:


స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాకా శెనగపప్పు ,మినపప్పు ,మెంతులు ఎండుమిర్చివేసి ఎర్రగా వేగాకా బౌల్ లోకి తీసుకోవాలి. బాణలిలోనూనె వేసిముక్కలుగా కోసిన టమాటోలు, పచ్చిమిర్చి,చింతపండు, పసుపు, ఉప్పు , కొత్తిమీరతురుము వేసి సన్నటి  సెగ మీద మూత పెట్టి మెత్తగా  ఉడికే వరకు ఉంచాలి. ఉడికాకా వేరే బౌల్ లోకి తీసుకుని చల్లారానివ్వాలి. మిక్సీ జార్లో వేయించిన పోపుని గ్రైండ్ చేసి ఉడికించిన టమాటోలు వేసి మెత్తగా రుబ్బాలి. చిన్న బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాకా ఆవాలు ఇంగువ వేసి వేగాకా పచ్చడిలో కలపాలి.

బెల్లం మిఠాయి

కావలసిన పదార్ధాలు:

శెనగపిండి - 1 కప్పు , బియ్యంపిండి - 1/2 కప్పు , బెల్లం తురుము  - 1 కప్పు , నూనె - వేయించడానికి సరిపోయినంత , నెయ్యి- 
2 టీ స్పూన్లు . 

తయారు చేసే పధ్ధతి:

 వెడల్పుగా ఉన్న బేసిన్ లో శెనగపిండి , బియ్యంపిండి వేసి సరిపోయిన్ని నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా గరిటజారుగా కలపాలి . స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బాణలి పెట్టి  నూనె పోసి వేడెక్కాకా లోతుగా ఉన్న చిల్లుల చట్రం లో కలిపిన పిండిని చిన్న కప్పుతో వేసి చుట్టూ తిప్పాలి . బూంది ఎర్రగా వేగాకా  వేరే చిల్లుల గరిటతో తీసి నూనె వోడ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి . స్టవ్ మీద దళసరిగా ఉన్న గిన్నె / బాణలి పెట్టి బెల్లం తురుము , 1 చిన్న గ్లాసునీళ్ళుకలిపి సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి . ఉండ పాకం( చిన్నకప్పు నీళ్ళల్లో 1 చెంచా పాకం వేసి వేళ్ళతో పట్టుకుంటే ఉండలా అవ్వాలి.) వచ్చాకా  బూంది వేసి దించి బాగా కలపాలి . ఒక ప్లేట్ కి నెయ్యి రాసి బెల్లంమిఠాయిని వేసి పరిచి ముక్కలుగా కోయాలి / ఒక కప్పులోకి నీళ్ళు తీసుకుని చేతికి నీళ్ళ తడి చేసుకుంటూ ఉండలు కట్టాలి . ముక్కలు కోయడమైనా  ఉండలు కట్టడమైనా వేడిగా ఉన్నప్పుడే చేయాలి .   

కాకరకాయ పొడి

కావలసిన పదార్ధాలు:

కాకరకాయలు-4,ఉల్లిపాయలు-2,శెనగపప్పు-3 టేబుల్ స్పూన్లు,ధనియాలు-1 టేబుల్ స్పూను,చింతపండు-ఉసిరికాయంత,ఎండుమిర్చి-4,ఎండుకొబ్బరితురుము-2 టీ స్పూన్లు,ఉప్పు-రుచికి తగినంత,నూనె-1/2 కప్పు.

తయారు చేసే పధ్ధతి:

సన్నగా తరిగిన కాకరకాయ ముక్కల్నిగిన్నెలో కొంచెం ఉప్పు,నీళ్ళు వేసి గట్టిగా పిండి ప్లేట్ లో పెట్టాలి.స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 టేబుల్ స్పూనుల నూనె వేసి శెనగపప్పు,ధనియాలు,ఎండుమిర్చి వేసి వేగాకా తీసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించాలి.చల్లారాకా శెనగపప్పు,ధనియాలు,ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి
చేయాలి.ఉల్లిపాయముక్కలు,ఉప్పు,చింతపండు,కొబ్బరితురుము వేసి ముద్దలా కాకుండా పొడి,పొడిగా ఉండేలా
గ్రైండ్ చేయాలి.స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించి గ్రైండ్ చేసిన
పొడి వేసి 2 నిమిషాలు వేయించి డిష్ లోకి తీసుకోవాలి.

బియ్యపు రవ్వ వడియాలు

కావలసినపధర్దములు

బియ్యపు రవ్వ  - రెండుకప్పులు
ఉప్పు-  సరిపడా
జీలకర్ర - పావుకప్పు
నీళ్ళు - పన్నెండు కప్పులు
పచ్చిమిర్చి పేస్టు పావుకప్పు
తయారుచేయు విధానం
1) ఎనిమిది  కప్పుల నీళ్ళు స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి.దీనిలో జీలకర్ర,ఉప్పు,పచ్చిమిర్చి పేస్టు వేయాలి.
2) రెండు  కప్పుల నీళ్ళతోరవ్వ ని జారుగా కలిపి మరుగు తున్న నీటిలో వేసి వుడకనివ్వాలి.
3)వుడికి చిక్కబడిన తరువాత స్టవ్ ఆపాలి.దీనిని కొద్దిగా చల్లారనిచ్చి ఒక క్లాత్ మీద గరిటతో కొద్దికొద్దిగా
జంతికల గొట్టంలో వేసి జంతికలానొక్కి  ఎండలో బాగా ఆరనిచ్చి తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Wednesday, March 12, 2014

కారప్పొడి

కావలసిన పదార్దములు : ఎండుమిర్చి : పది హేను  ఉప్పు : సరిపడ  చింతపండు : నిమ్మకాయంత  జీలకర్ర : టీ స్పూన్  వెల్లుల్లి రేకలు : పది   నూనె : రెండు టేబుల్  స్పూన్లు 
 
తయారుచేయు విధానం :
1) నూనె వేడి చేసి ఎండుమిర్చి వేయించాలి. అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.  2)వేయించిన ఎండుమిర్చికి  ఉప్పు,జీలకర్ర కలిపి నూరిన తర్వాత  చింతపండు వేసి నూరాలి. అలాగే ఎండిమిర్చి,చింతపండు నలిగిన తరువాత వెల్లుల్లి కూడా వేసి నూరాలి. అంతే చింతపండు కారప్పొడి రెడీ (దీనినే నల్లకారం అని కూడా అంటారు.)   ఈ నల్లకారం  అప్పటికప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.

కొత్తిమీర చపాతి

కావలసిన పదార్దాలు :
గోధుమ పిండి : మూడు కప్పులు 
కొత్తిమీర తురుము : కప్పు 
వెన్న : టేబుల్ స్పూన్ 
ఉప్పు : కొద్దిగా 
నూనె : పావు కప్పు 
పచ్చిమిర్చి పేస్టు : అర టీ స్పూన్ 
తయారు చేయు విధానం :

1) ఒక గిన్నెలో కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2) గంట తరువాత చపాతీలు చేసుకోవాలి.
3) స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు రెండు ప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
4) వీటి మీద వెన్నరాసి మడత పెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.


మినప కుడుము (ఆవిరి కుడుము)

కావలసిన పదార్దాలు:  మినప్పప్పు : కప్పు  ఉప్పు : తగినంత  యారుచేయు విధానం : 1) మూడు గంటలముందు మినపప్పు నానబెట్టి కడిగి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. 2) ఒక గిన్నెలో నీళ్ళుపోసి దానికి పల్చటి గుడ్డ కట్టాలి. దీనినే వాసం కట్టడం అంటారు. 3) రుబ్బిన మినప్పిండిలో ఉప్పు కలిపి దీనిని ఆ వాసం కట్టిన గుడ్డమీద వేసి ఫైన ఒక మూతపెట్టాలి. 4) స్టవ్ వెలిగించి దానిమీద ఈ గిన్నె పట్టి పదిహేనునిముషాలు ఉడికించాలి. 5) గిన్నెలోని నీళ్ళు మరుగుతుంటే ఆ ఆవిరికి మినపకుడుము ఉడుకుతుంచి. దీనినే ఆవిరి కుడుము అంటారు. 6) దీనిలో బెల్లం, నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదా చెట్నితో తినొచ్చు. ఇది బలవర్ధకమయిన ఆహారం.

వెల్లుల్లి చపాతీ

గార్లిక్ చపాతీ  :
కావలసిన పదార్దాలు :

గోధుమ పిండి : అరకిలో
పాలు : కప్పు 
పెరుగు:  పావుకప్పు
వెల్లుల్లి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు:  సరిపడ
నూనె : అర కప్పు 
ఈస్ట్ :  టేబుల్ స్పూన్ .
తయారు చేసే విదానం :
1) గోరు వెచ్చని నీళ్ళులో ఈస్ట్ కలిపితే కరుగుతుంది.
 2) ఈ నీళ్ళతోగోధుమ పిండి ,పాలు, పెరుగు, ఉప్పు,  వేసి కలిపి పది నిమిషాలు మెత్తగా కలపాలి.
 3) ఈ పిండిని నూనె రాసిన గిన్నెలో పెట్టాలి.
4) దీని ఫై తడి బట్ట కప్పిఒక గంట పక్కన పెట్టాలి.
5) ఇలా చేస్తే పిండి  రెండింతలు అవుతుంది
6) ఇప్పుడు ఈ పిండి చిన్నచిన్న ఉండలు చేసి వెల్లుల్లి తురుములో అద్ది చపాతి చేసి నూనె వేసి కాల్చాలి.
7) కాల్చిన తర్వాత వెన్న రాసుకుంటే ఎంతో మెత్తగా మృదువుగా ఉంటాయి

సగ్గుబియ్యం శెనగలు వడలు

కావలసిన పదార్దాలు :
నానబెట్టిన సెనగలు : కప్పు
నానబెట్టిన సగ్గుబియ్యం : కప్పు నానబెట్టిన మినపప్పు: పావు కప్పు 
ఉల్లిముక్కలు : కప్పు  పచ్చి మిర్చిముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు  కారం : అర టీ స్పూన్  ఉప్పు : తగినంత  కొత్తిమీర,కరివేపాకు : అర కప్పు  అల్లంపేస్టూ :టీ స్పూన్  నూనె : వేయించటానికి సరిపడ
తయారుచేయు విధానం :
1 ) సగ్గుబియ్యం, శెనగలు, మినపప్పు,మిక్సిలో వేసి మెత్తగా గట్టిగా మిక్సి పట్టాలి.
2) మెత్తగా చేసిన సెనగలు సగ్గుబియ్యం మినపప్పు ముద్ద లో ఉప్పు, కారం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టూ వేసి కలపాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె కాగాక అన్నికలిపిన ఈ పిండిని గారెల్లా చేసి వేడి నూనెలో వేసి దోరగా వేయించాలి.
4) రెండు ప్రక్కలా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి. 

Tuesday, March 11, 2014

అన్నం కట్లెట్‌

కావలసిన పదార్థాలు:
అన్నం – 1 కప్పు,
టమాటా రసం – అరకప్పు,
వెన్న – 1 స్పూన్‌,
అల్లం – చిన్నముక్క,
చీజ్‌ – 50 గ్రాములు,
పనీర్‌ – 100 గ్రాములు
బ్రెడ్‌ పొడి – 1 కప్పు,
మిరియాలపొడి – అర స్పూన్‌,
నూనె – వేయించడానికి సరిపడా,
ఉప్పు – తగినంత
తయారు చేయు విధానము:
బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. సగం నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. తర్వాత అందులోనే చీజ్‌ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్‌ ఆకారంలో) చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. వీటిని అల్లం చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

చిక్కుడు చెక్కలు

కావలసిన పదార్థాలు:
ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు – అర కప్పు
బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు,
పచ్చిమిర్చి పేస్ట్ – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీస్పూను,
ఉప్పు – తగినంత
సోడా – తగినంత,
నెయ్యి – 2 టీస్పూన్లు
నువ్వులు, జీలకర్ర – కొద్దికొద్దిగా,
నూనె – వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానము:
ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చే సుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన చిక్కుడుకాయముక్కలు, మిగతా పదార్థాలు (నూనె తప్ప) అన్నీ వేసి బాగా కలిపి నీళ్లు అద్దుకుంటూ చపాతీపిండిలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తరవాత ఆ పిండిని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ప్లాస్టిక్ కవరుకు నూనె రాసి దాని మీద ఈ ఉండను పెట్టి వెడల్పుగా ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. చల్లారిన తరవాత డబ్బాలో పెట్టుకోవాలి. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.

Sunday, March 9, 2014

పుల్లట్టు

 కావలసినవి
బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారునాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీదకాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితోకాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది :)

సగ్గుబియ్యం ఇడ్లీలు

కావలసిన పదార్ధాలు :

సగ్గు బియ్యం -2 కప్పులు ,పుల్లమజ్జిగ -2 కప్పులు ,ఉల్లిపాయ -1,పచ్చిమిర్చి-3,ఆవాలు -1/2 టీ స్పూను ,శెనగ పప్పు -1/2 టీ స్పూను ,మినపప్పు -1/2 టీ స్పూను ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు రెమ్మలు -2,కొత్తిమీర తురుము -2 టేబుల్ స్పూన్లు ,ఉప్పు -రుచికి తగినంత ,నూనె -2 టేబుల్ స్పూన్లు .

తయారు చేసే పధ్ధతి :

పుల్లమజ్జిగలో సగ్గు బియ్యాన్ని వేసి 5 గంటలు నానబెట్టాలి .స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా శెనగ పప్పు,మినపప్పు ,
ఆవాలు, ఇంగువ  వేసి వేయించాలి .సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చిముక్కలు కరివేపాకువేసివేయించాలి.నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొత్తిమీర తురుము ,ఉప్పు వేసి 5 నిమిషాలు  ఉడికించాలి .సగ్గుబియ్యంఉడికిన వెంటనే దించేయాలి .స్టవ్ మీద ఇడ్లీ స్టాండు పెట్టి నీళ్ళు పోసి ఇడ్లీ రేకులకి నూనె రాసి ఇడ్లీల్లా వేసుకుని 20 నిమిషాల పాటు ఉడికించాలి .

పుల్ల మజ్జిగ అట్లు

కావలసిన పదాధాలు :

బియ్యం-1/2 కిలో ,పుల్ల మజ్జిగ -1 లీటరు ,అల్లం -చిన్న ముక్క ,పచ్చిమిర్చి -6 ,జీలకర్ర -2 టీ స్పూన్లు,ఉప్పు -రుచికి తగినంత,నూనె -1 కప్పు .

తయారుచేసేపధతి :

బియ్యం కడిగి నీళ్ళు వోడ్చి  పుల్ల మజ్జిగలో వేసి 5 గంటలు నానబెట్టాలి .నానిన బియ్యంలో ఉప్పు,జీలకర్ర ,అల్లం ,పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బి అట్ల పిండిలా కలుపుకోవాలి .స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాకా 1 స్పూను నూనె వేసి అట్టులా పోసుకోవాలి .

నిమ్మకాయ కారం

కావలసిన పదార్ధాలు:

నిమ్మకాయరసం - 1/2 కప్పు ,  శెనగపప్పు - 1 టేబుల్ స్పూను , మినపప్పు - 1  టేబుల్ స్పూను , ధనియాలు - 1/2 టేబుల్ స్పూను , మెంతులు - 1 టీ స్పూను , ఆవాలు - 1/2 టీ స్పూను , ఎండుమిర్చి - 4 , ఉప్పు - రుచికి తగినంత , పసుపు - చిటికెడు , ఇంగువ - 1/4 టీ స్పూను , నూనె - 2 టేబుల్ స్పూన్లు .

తయారు చేసే పధతి:

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కాకా మినపప్పు ,శెనగపప్పు , ధనియాలు , మెంతులు ,  ఆవాలు ,  ఎండుమిర్చి , ఇంగువ వేసి ఎర్రగా వేగాకా బౌల్ లోకి తీసి చల్లారాకా మెత్తటి పొడిలా చేయాలి . నిమ్మకాయ రసం ,ఉప్పు , పసుపు పొడి వేసిన బౌల్ లో వేసి కలపాలి . చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళు కలపాలి .

వంకాయ కూర

కావలసిన పదార్ధాలు:

వంకాయలు-10 , మినపప్పు - 1/2 కప్పు , జీలకర్ర - 1 1/2 టేబుల్ స్పూన్లు , ఎండుమిర్చి - 5, చింతపండురసం- 1/4 కప్పు , ఉప్పు - రుచికి తగినంత , బెల్లం(ఇష్టమైతే) - చిన్నముక్క , పసుపు - చిటికెడు , నునె - 1/4 కప్పు , పచ్చికొబ్బరి - చిన్నముక్క .

తయారు చేసే పధ్ధతి:

ఒక గిన్నెలో నీళ్ళు పోసి 1 చెంచా ఉప్పు వేసి వంకాయలని పొడుగ్గా ముక్కలు తరగాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి1 టేబుల్ స్పూను నునె వేసి వేడెక్కాకా మినపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర , సన్నగా తరిగిన పచ్చికొబ్బరి వేసి ఎర్రగావేగాకా డిష్ లోకి తీసి చల్లారాకా మెత్తటి పొడిలా చేయాలి . స్టవ్ మీద బాణలి పెట్టి నునె పోసి వేడెక్కాకా నీళ్ళు వోడ్చిన  వంకాయముక్కలు ,  ఉప్పు , పసుపు , బెల్లం , చింతపండురసం వేసి మూత పెట్టి సన్నటి సెగ మీద ఉడికించాలి . కూర మెత్తబడి దగ్గరగా అయ్యాకా గ్రైండ్ చేసిన పొడి వేసి కలిపి డిష్ లోకి తీసుకోవాలి .

వంకాయ పచ్చికారం కూర

కావలసిన పదార్ధాలు:

లేత వంకాయలు- 8 , సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు - 1 కప్పు , ఎండుమిర్చి - 6 , (కారం-1/4 టీ స్పూను) ,
పసుపు - చిటికెడు , ఉప్పు - రుచికి తగినంత , ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు , జీలకర్ర - 1 టేబుల్ స్పూను ,
నూనె - 1/2 కప్పు

తయారు చేసే పధ్ధతి :

ఒక బేసిన్ లో 1 చెంచా ఉప్పు వేసి నీళ్ళు పోసి వంకాయలని  తొడిమ తీసి రెండు వైపులా తరిగి బేసిన్ లో వేయాలి .
  ధనియాలు , జీలకర్ర , ఎండుమిర్చి కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా చేయాలి . ప్లేట్  లో  ఉల్లిపాయముక్కలు , పసుపు , ఉప్పు , (కారం) , .గ్రైండ్ చేసిన పొడి వేసి కలిపి వంకాయలలో కూరాలి .  . స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా  వంకాయలని పేర్చి మూత పెట్టి చిన్న ప్లేటులో నీళ్ళు పోసి మూత మీద పెట్టి
సన్నటి సెగ మీద వంకాయలని మగ్గించాలి . రెండో వైపు తిప్పి కూర మెత్తబడ్డాకా డిష్ లోకి తీసుకోవాలి .

కారంపొడి ఇడ్లీలు

కావలసినవి:
ఇడ్లీలు - 10, మినప్పప్పు - కప్పు, శనగపప్పు - ముప్పావు కప్పు, ఎండుమిర్చి - 6, ఇంగువ - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి
ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి
చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి
తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

Monday, March 3, 2014

చింతకాయ పచ్చడి ...

కావాల్సిన పదార్ధాలు ;- చింతకాయ తొక్కు -- ఒక దోసెడు తీసుకోవాలి
మినపపప్పు -- 2టేబుల్ స్పూన్స్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఆవాలు -- అర టీ స్పూన్
ఇంగువ -- 2టీ స్పూన్స్
ఎండుమిరపకాయలు -- 30
పచ్చిమిరపకాయలు -- 10
నూనె -- 2 టీ స్పూన్స్
ముందుగ ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి ఆవాలు,మెంతులు , మినపపప్పు ,ఎండుమిరపకాయలు ,ఇంగువ వేసి పోపును దోరగా వేయించి దించేసి చల్లార నివ్వాలి . ఇప్పుడు ఒక టీ స్పూన్ పోపును పక్కకు తీసి పెట్టి మొత్తం పోపును ,పచ్చిమిరపకాయలను వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి . తరవాత మనము ముందు తీసుకున్న చింతకాయ తోక్కును కూడా వేసి రెండు రౌండ్లు తిప్పి ముందు గ్రైండ్ చేసి పెట్టిన కారపు ముద్దను ఈ చింతకాయ తొక్కులొ వేసి బాగా కలిపి పక్కన పెట్టిన పోపును కూడా వేసి కలపాలి . అంతే రుచికరమైన ఘుమఘుమ లాడే చింతకాయ పచ్చడి రెడీ ....... ఇష్టం వున్నవారు రెండు అంగుళాల బెల్లం ముక్కను కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు .....

తొక్కు కోసం ;-

చింతకాయలు వచ్చే సీజన్ లోనే ఒక 4 కేజీలు కొని వాటిని కడిగి తడి లేకుండా ఆరబెట్టి రోటిలో కొన్ని చింతకాయలు ఒక స్పూన్ పసుపు 3టీ స్పూన్స్ ఉప్పు వేసి గింజ నలగ కుండ దంచుకోవాలి ... మొత్తం చింతకాయ లన్నింటిని ఇలానే దంచి ఒక జాడీ లోకి తీసి పెట్టాలి .. ఇలా చేసిన 3డవ రోజున తొక్కులొని గింజలను పిచును తీసి బాగు చేసి పెట్టుకోవాలి .ఇప్పుదు తొక్కు రెడీ .. మనకు కావలసినప్పుడు కొంచం తీసుకుని పచ్చడి చేసుకుని తినడమే మిగిలింది .....

పెసర వడ

కావలసినపదార్థాలు:
పచ్చిపెసలు: :ఒక కిలో
నూనె:వేయించటానికి తగినంత
పచ్చిమిర్చి: 50గ్రా
అల్లం: 50గ్రా
జీలకర్ర: టీస్పూను
ఉప్పు: తగినంత
కొంచెం పొదిన, కొత్తిమీర
తయారుచేసే విధానం:-
పెసలు కడిగి 3 గంటలు నానబెట్టి, నీళ్లు వంపేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపి కొంచెం గట్టిగా రుబ్బాలి. తగినంత ఉప్పు, కొంచెం పొదిన, కొత్తిమీర కూడా కలపాలి.
కవర్ మీద మనకు కావలసిన సైజులో గారెలు వత్తి నూనెలో దోరగా వేయించి తీయాలి.
ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు సిద్దం
అల్లం/ కొబ్బరి/ కొత్తిమీర... ఏ పచ్చడితో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి
.

Saturday, March 1, 2014

సొరకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు :
సొరకాయ ముక్కలు -   ఒకటిన్నర కప్పు (చెక్కుతో సహా తీసుకోవాలి)
సెనగ పప్పు, మినప్పప్పు - అర టేబుల్ స్పూన్ చొప్పున
జీలకర్ర                 -     అరచెంచా
ధనియాలు           -      చెంచా
ఎండు మిర్చి         -      ఆరు
పచ్చిమిర్చి           -      పది
చింతపండు          -      కొద్దిగా
ఉప్పు                 -      తగినంత
నూనె                 -      4 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం :
ఆవాలు          -         అరచెంచా
మినప్పప్పు    -         అరచెంచా
కరివేపాకు      -          రెండు రెబ్బలు

తయారుచేసే పద్ధతి :

  • బాణలిలో ఒక చెంచా నూనె వేడి చేసి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకొని తీసి పెట్టుకోవాలి. 
  • అదే బాణలిలో ఒకటిన్నర చెంచాల నూనె పోసి, కాగాక సోరక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింత పండు వేసి మూత పెట్టాలి. కూరముక్కల్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేడి చల్లారాక అన్నింటిని మిక్సీలో తీసుకొని, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. 
  • బాణలిలో మిగతా నూనె వేసి, కాగాక తాలింపు కోసం తీసుకున్న పదార్థాలను వేయించి పచ్చడిపై వేస్తే చాలా రుచిగా ఉంటుంది.

క్యారెట్ పచ్చడి

కావలసిన పదార్థాలు :
క్యారెట్లు            -             పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి)
ఉల్లిపాయలు     -             రెండు
ధనియాల పొడి  -             చెంచా
ఆవ పొడి          -             చెంచా
జీలకర్ర పొడి      -             అరచెంచా
మెంతి పొడి       -             పావు చెంచా
కారం               -            రెండు చెంచాలు
ఉప్పు              -            తగినంత
ఇంగువ            -            చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -           అరచెంచా
ఎండు మిర్చి      -            రెండు
కరివేపాకు         -            రెండు రెబ్బలు
చక్కెర             -             కొద్దిగా
నిమ్మరసం       -             మూడు చెంచాలు
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావు చెంచా చొప్పున
నూనె             -              కప్పు

తయారుచేసే పద్ధతి :

  • ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. 
  • ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చిని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసి, అవి వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయల పచ్చి వాసనా పోయాక దించాలి. అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసేయాలి. మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.

చింతచిగురు పులిహోర

కావలసిన పదార్థాలు :బియ్యం          -          2 కప్పులు
చింతచిగురు    -          కప్పు
సెనగ పప్పు     -         టేబుల్ స్పూన్
మినప్పప్పు    -          టేబుల్ స్పూన్
ధనియాలు      -         టేబుల్ స్పూన్
ఎండు మిర్చి    -         4
నువ్వులు        -         టేబుల్ స్పూన్
నూనె             -          2 టేబుల్ స్పూన్లు
                                                                   ఉప్పు             -          తగినంత
                                                                   కరివేపాకు       -           2 రెమ్మలు

పోపు కోసం 
వేరుసెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి -కొద్దిగా

తయారుచేసే పద్ధతి :

  • చింతచిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరవాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేయించాలి. చివరగా ఎండు మిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటితో పాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి. 
  • అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేగాక చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం కాగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి.

మొక్కజొన్న పులావ్

కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం -            ఒక కప్పు
స్వీట్ కార్న్        -           పావు కప్పు
అల్లం                -           ఐదు చిన్న ముక్కలు
వెల్లుల్లి              -           10 పాయలు
పూదీన            -             కొంచెం
కొత్తిమీర            -            కొంచెం
ఉప్పు               -            రుచికి సరిపడా
పచ్చిమిర్చి         -             3
                                                                  పట్టా, లవంగం, యాలకులు - తగినన్ని
                                                                   కొబ్బరి పాలు      -             ఒకటిన్నర కప్పు
                                                                   నెయ్యి               -             రెండు స్పూన్లు
                                                                   పెరుగు              -             అరకప్పు
తయారుచేసే పద్ధతి:

  • ముందుగా బియ్యం, మొక్కజొన్న గింజలు కలిపి నానబెట్టుకోవాలి.
  • స్టవ్ మీద పెనం పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి పట్టా, లవంగం, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి వేయించాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తగినంత ఉప్పును కలపాలి. ఈ మిశ్రమం బాగా తెర్లిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి దించుకోవాలి. అంతే మొక్కజొన్న పులావ్ రెడీ.