బ్రెడ్ కట్‌లెట్
కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - అర కేజీ, బ్రెడ్ - సగం ప్యాకెట్, ఎండు బఠానీలు - అర కేజీ, టమోటాలు - నాలుగు, ఉల్లిపాయలు - మూడు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూన్, మిరపపొడి - ఒక స్పూన్, ఉప్పు - తగినంత, పసుపు -చిటికెడు, గరంమసాలా - ఒక స్పూన్, సన్న కారపూస - కొద్దిగా, టమోటా సాస్ - కొద్దిగా.
.తయారుచేయు విధానం:
ముందుగా ఎండు బఠానీలను నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి. తరువాత బ్రెడ్‌ను నీళ్లలో ముంచి ఆ నీళ్లుపోయే వరకు ఉడకబెట్టిన బంగాళదుంపల్లో వేసి కొంచెం పసుపు, మిరపపొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల మాదిరిగా చేసుకుని పెనం మీద నెయ్యి లేక నూనె వేసి దోరగా కాల్చుకోవాలి. తరువాత నానబెట్టిన బఠానీలను కుక్కర్‌లో ఉడికించుకోవాలి.
ఆ నీళ్లలోనే టమోటాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీలో పట్టుకోవాలి. ఆ మిశ్రమంలో గరంమసాలా, మిరపపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చిపెట్టుకున్న కట్‌లెట్‌లపై ఈ కుర్మావేసి ఉల్లిపాయలు, టమోటా సాస్, సన్న కారపూసతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. బ్రెడ్ కట్‌లెట్ రెడీ.

0 comments:
Post a Comment