Saturday, January 26, 2013

బంగాళదుంప పకోడీ

బంగాళదుంప పకోడీ




కావలసిన పదార్థాలు

పచ్చిశనగపప్పు - పావు కిలో, బంగాళదుంపలు - పావు కిలో, ఉల్లిపాయలు - 3, పచ్చిమిర్చి - 10, ధనియాలు - 2 స్పూన్లు, అల్లం - చిన్నముక్క, కరివేపాకు - 2 రెమ్మలు, కారం - 1 స్పూన్‌, వెల్లుల్లి - 6 రెబ్బలు, ఉప్పు - తగినంత, వంటసోడా - అరస్పూన్‌

బియ్యం - 2 స్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం

పచ్చిశనగపప్పు, బియ్యం కలిపి ఐదు గంటలు నానబెట్టాలి. బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మెత్తగా చిదమాలి. శనగపప్పులో నీళ్లన్నీ వంపేసి, అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వంటసోడా, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముద్ద వేసి బాగా కలపాలి. ఈ పిండిని కాగిన నూనెలో పకోడీల్లా వేసి ఎర్రగా వేయించుకుంటే వేడి వేడి బంగాళదుంప పకోడీ తయారైనట్లే.

0 comments:

Post a Comment