Friday, January 25, 2013

తీపి పొంగడాలు:

తీపి పొంగడాలు: 

కావలసిన పదార్థాలు: 

బియ్యం - ఒక కప్పు, మినపప్పు - అర కప్పు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: బియ్యం, మినపప్పులను శుభ్రంగా కడిగి పొద్దునే నానపెట్టుకోవాలి. ఎనిమిది గంటలు నానిన తర్వాత దోసెల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. మర్నాడు పొద్దున ఈ పిండితో గుంటపొంగడాలు వేసుకోవాలి. మరో పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు, పంచదార వేసి పాకం తయారుచేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. రెండువైపులా ఎరుపు రంగు వచ్చేలా వేగించిన పొంగడాలను చక్కెర పాకంలో వేసి తీయాలి.

0 comments:

Post a Comment