Wednesday, January 30, 2013

మినప గారెలు

మినప గారెలు

కావలసిన పదార్థాలు: మినపపప్పు: 4cup, పచ్చిమిర్చి: 10, పచ్చికొబ్బరి తరుము: 1tsp‌, అల్లం పేస్టు: 5tsp, నూనె: సరిపడ,
దాల్చిన చెక్క: 4ముక్కలు, లవంగాలు: 2, ఉప్పు: తగినంత,
బ్లాక్ పెప్పర్: 1tsp‌, జీలకర్ర: 5tsp.

తయారు చేయు విధానం: ముందుగా మినపపప్పును మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి. తరువాత ఈ మినపపప్పును మిక్సీలో వేయండి. ఇందులో నూనె తప్ప మిగతా పదార్థాలన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి పాన్ పెట్టి తగినంత నూనె వేయండి. నూనె కాగిన తరువాత ప్లాస్టిక్‌ పేపర్‌పై మినపపప్పు మిశ్రమాన్ని వేసి గారెలుగా చేసి నూనెలో వేయండి. బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి.


0 comments:

Post a Comment