Friday, January 25, 2013

బరువు తగ్గించే ఓట్స్ పరోటా

కావలసిన పదార్థాలు:
గోధు పిండి: 1cup
ఓట్స్ పౌడర్: 1cup
నువ్వులు: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
కొత్తమీర తరుగు: 2tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి.
2. తర్వాత పచ్చిమిర్చిని శుభ్రం చేసి, చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఓట్స్ పౌడర్, నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకొంటూ చపాతీ పిండిలా మృధువుగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక క్లాత్ లో చుట్టి కనీసి రెండు మూడు గంటపాటు నాననివ్వాలి.
4. పిండి బాగా నానిన తర్వాత కొద్దికొద్దిగా తీసుకొని చపాతీల్లా రుద్దుకోవాలి. అన్నింటినీ రుద్ది పెట్టుకొన్నాక స్టౌ మీద చపాతీ పాన్ పెట్టి వేడయ్యాక రుద్దిపెట్టుకొన్న పరోటాను వేసి నూనె రాసి బాగా కాలనివ్వాలి. అలా రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకోవాలి. అంతే ఓట్స్ పరోట రెడీ. వీటిని ఏదేని రైతాతో వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
సూచన: పరోటా మీకు కావల్సిన మందంలో రుద్దుకోవాలి. ఓట్స్ పరాటా మృదువుగా రాకపోతే, మరికొంత సేపు తక్కువ మంట మీద పరోటాను వేడిచేసుకోవాలి. అలాగే పిండిలో పచ్చిమిర్చి ముక్కలకు బదులుగా, పచ్చిమిర్చి పేస్ట్ ను వేసుకోవచ్చు.

0 comments:

Post a Comment