Thursday, August 27, 2015

• రాగుల ఇడ్లీ

• రాగుల ఇడ్లీ
కావలసిన పదార్థాలు : రాగి పిండి - 2 కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, మినపప్పు - అర కప్పు, మెంతులు - ఒక టీ స్పూన్‌, ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం : ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6గంటల పాటు నానబెట్టాలి. మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్లు పోసి మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి. ఆవిరి మీద పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఇడ్లీలు కొత్తిమీర చట్నీతో తింటే బాగుంటాయి.

Saturday, August 22, 2015

* కార్న్‌ మంచురియా


కావలసిన పదార్థాలు...
తాజా బేబీకార్న్‌ : ఐదు
మొక్కజొన్న పిండి : అర కప్పు
బియ్యం పిండి : పావు కప్పు
కారం : సరిపడా
అల్లంవెల్లుల్లి ముద్ద : ఓ టేబుల్‌ స్పూన్‌
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
ఉల్లిపొర కట్ట : ఒకటి (సన్నగా తరగాలి)
ఉల్లిపాయ : ఒకటి (సన్నగా తరగాలి)
ఇంకా... వెల్లుల్లిపాయ ముక్కలు, సోయా సాస్‌, టొమాటో సాస్‌.

తయారుచేసే విధానం...
ముందుగా తాజా బేబీకార్న్‌ను ఒకే సైజులో చిన్న చిన్న ముక్కలుగా తరిగి, ఉప్పు నీటిలో ఉడికించి న తర్వాత నీరు మొత్తం ఇంకిపోయేలా వడకట్టి పక్కన ఆరబెట్టుకోవాలి. ఈలోగా ఓ పాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ము ద్ద, సరి పడా ఉ ప్పును వేసి బజ్జీలపిం డికి ఉపయోగించే మిశ్ర మంలా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై బాణలి ఉంచి, ఈ మిశ్ర మంలో ఆరబెట్టుకున్న బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాది రి వేయించుకోవాలి. స్టవ్‌ పై మరో బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లుల్లిపాయ ముక్కలు, తరిగి న ఉల్లిపాయ ము క్కలు, తరిగిన ఉల్లిపొర ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందు గా బజ్జీలుగా వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి ఒక్కోటిగా వేసి అటూ ఇటూ కలియ బెట్టాలి. అనంతరం దీనిని వేరే ప్లేట్‌లోకి తీసు కొని వాటిపై సోయా సాస్‌, చిల్లీసాస్‌, టొమా టో సాస్ల్‌ను చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేసుకో వాలి. దీనిపై తరిగిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఆ టేస్టే వేరు అనాల్సిందే.. మరి.

Friday, August 21, 2015

నోరూరించే రవ్వ దోశ

కావలిసిన వస్తువులు :
మైదా పిండి-రెండు గ్లాసులు
బొంబాయి రవ్వ- ఒక గ్లాస్
బియ్యం పిండి -ఒక గ్లాస్
మజ్జిగ -ఒక గ్లాస్
పచ్చిమిరపకాయలు -నాలుగు
ఉల్లిపాయలు పెద్దవి -రెండు
ఉప్పు తగ్గినంత
జీల కర్ర - ఒక చెంచాడు
మిరియాలు ఒక పావు చెంచాడు
కొబ్బరి తురుము : ఒక టేబుల్ స్పూన్
కారట్ తురుము: ఒక టేబుల్ స్పూన్
జీడి పప్పు బద్దలు ; తగినన్ని
తయారీ విధానం:
దోశ తయారీకి ఒక గంట ముందుగా మైదా పిండి, రవ్వ, బియ్యమ పిండి ని మజ్జిగ తో కలపి, సరిపడినన్ని నీళ్ళు కలిపి పిండిని జాలు వారుగా (చిక్కటి మజ్జిగ లాగ)కలుపుకుని, ఉప్పుని, జీలకర్రని, మిరియాలని (కొంచెం కచ్చాపచ్చాగా కొట్టి), జీడి పప్పు బద్దలు చిన్నగా తుంపులు చేసినవి కలుపుకున్న పిండిలో వేసి, బాగా కలియపెట్టాలి.
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరుగుకుని వుంచుకొవాలి. పిండి రెండుగంటలు నానిన తర్వాత నాన్ స్టిక్ దోస పెనం తీసుకుని, మాములుగా మనం దోసలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుని, నూనె కూడా తగినంతగా వేసుకుని, పైన కావలసినంతగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి మరియు కారట్ తురుము దోశ అంతా జల్లు కోవాలి .
దోశ పలచగానే వేసుకుంటాం కాబట్టి రెండో వైపు కాల్చవలసిన అవసరం వుండదు. పిండిని పలచగా కలుపుకుని, బాగా స్ప్రెడ్ చేయడం వలన చిల్లులు చిల్లులుగా వచ్చి మాంచి క్రిస్పీ గా వస్తాయి దోశలు. మజ్జిగ లేనప్పుడు పిండిని రాత్రే నీళ్ళతో కలపి నాన పెట్టుకుని, ఉదయాన్నే దోశలు వేసుకోవచ్చు .

Sunday, August 16, 2015

ఉల్లిపాయ పకోడీలు ...........


కావాల్సిన పదార్ధాలు ;-
సెనగపప్పు --- అర గ్లాసు 
ఉల్లిపాయలు పెద్దవి --- 5
పచ్చిమిరపకాయలు --6
కరివేపాకు -- రెండు రెమ్మలు
ఉప్పు -- ఒక టీ స్పూన్
కారం -- ఒక టీ స్పూన్
వంట సోడా--- చిటికెడు
నూనె -- పావు కేజీ
తయారుచేసే విధానం ;-
ముందుగ సెనగపప్పును నానపెట్టుకోవాలి . తరవాత నానిన సెనగ పప్పును మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి . ఇప్పుడు ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా తరగాలి . తరవాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి . నూనె కాగే లోపుగా రుబ్బిన పిండిలో పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,ఉప్పు,కారం ,వంటసోడా వేసి బాగా కలపాలి . నూనె బాగా కాగి సెగలు వస్తున్నప్పుడు మంట తగ్గించి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పకోడీలు లాగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టాలి . మొత్తం పిండిని ఇలానే చెయ్యాలి . అంతే ఘుమఘుమ లాడే ఉల్లిపాయ పకోడీలు రెడీ .... నానపెట్టి రుబ్బటం వల్ల రుచి బావుంటుంది . గ్యాస్ కూడా రాదు . ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినచ్చు ... ఇక వేడి వేడి పకోడీలు తినేద్దామా మరి ......

Friday, August 14, 2015

• ట్రై కలర్‌ పరాఠా

• ట్రై కలర్‌ పరాఠా
కావలసిన పధార్థాలు
గోధుమ పిండి - 4 కప్పులు
నూనె - 1 టే.స్పూను
ఉప్పు - తగినంత
గోరు వెచ్చని పాలు - అర కప్పు
పెరుగు - అర కప్పు
నీళ్లు - తగినన్ని
ఫిల్లింగ్‌ కోసం:
క్యారెట్‌ తరుగు - 1 కప్పు
కాలిఫ్లవర్‌ తరుగు - 1 కప్పు
పాలకూర - 1 కప్పు (ఉడికించి ముద్ద చేయాలి)
అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌ - 2 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
కార్న్‌ఫ్లోర్‌ - కొద్దిగా
నెయ్యి లేదా వెన్న
తయారీ విధానం:
పిండికి ఉప్పు, పాలు, తగినన్ని నీళ్లు చేర్చి పిసుక్కోవాలి.
కలుపుకున్న పిండిని అరగంటపాటు పక్కనుంచాలి.
క్యారెట్‌ తురుము, 1 టీస్పూను పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌, ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌ కలిపి పక్కనుంచాలి.
పాలకూర తరిగి కొద్ది నూనెలో వేయించి అల్లం, కొద్దిగా పచ్చిమర్చి, కొత్తిమీర పేస్ట్‌తో కలుపుకోవాలి.
దీనికి ఉప్పు కూడా కలుపుకోవాలి.
మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్‌ను కాలిఫ్లవర్‌ తరుగుకు కలపాలి.
పిండిని సమ భాగాలుగా విడదీసి ఒకే ఆకారంలో 3 రోటీలు ఒత్తుకోవాలి.
ఒక రోటీ మీద క్యారెట్‌ మిశ్రమాన్ని ఉంచి దాని మీద రెండో రోటీని ఉంచాలి.
దీని మీద కాలిఫ్లవర్‌ మిశ్రమాన్ని ఉంచి పైన మూడో రోటీ ఉంచాలి.
మూడో రోటీ మీద పాలకూర పేస్ట్‌ పూయాలి.
తర్వాత మూడు రోటీల అంచులను మధ్యకు తీసుకొచ్చి గుండ్రంగా చేసుకోవాలి.
పొడి పిండితో రోటీని ఒత్తాలి.
నెయ్యి పోస్తూ రెండు వైపులా కాల్చుకుంటే ట్రై కలర్‌
పరాఠా రెడీ!

Wednesday, August 12, 2015

* బీరకాయ 65

* బీరకాయ 65
కావలసినవి
బీరకాయలు: పావుకిలో, మైదాపిండి: 100గ్రా., అల్లంవెల్లుల్లిముద్ద: టీస్పూను, వెల్లుల్లిరెబ్బలు: రెండు, చిల్లీసాస్: టీస్పూను, సోయాసాస్: టీస్పూను, మిరియాలపొడి: అరటీస్పూను, ఆరెంజ్‌ఫుడ్ కలర్: చిటికెడు, కార్న్‌ఫ్లోర్: 4 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: ఐదు రెబ్బలు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* బీరకాయల్ని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసి ఒకటిన్నర అంగుళాల పొడవులో ముక్కలుగా కోయాలి.
* ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, అల్లంవెల్లుల్లిముద్ద, చిల్లీసాస్, మిరియాలపొడి, కొద్దిగా సోయాసాస్, ఆరెండ్ ఫుడ్ కలర్, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి జారుగా కలపాలి. ఇప్పుడు ఒక్కో బీరకాయ ముక్కనూ ఈ పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి. మరో బాణలిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిముక్కలు వేసి వేగాక, మిగిలిన సోయాసాస్ కూడా వేసి కలపాలి. తరవాత వేయించిన బీరకాయ ముక్కలను వేసి కలిపితే బీరకాయ 65 తయార్.

బీరకాయ ఆలూ వడలు

కావలసినవి
బీరకాయలు: ఒకటి(మీడియంసైజుది), బంగాళాదుంప: ఒకటి(మీడియంసైజుది), బియ్యప్పిండి: 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: 4, కరివేపాకు: 5 రెబ్బలు, గరంమసాలా: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: పావుకప్పు, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
చి బీరకాయలు పైన తొక్కు తీసి చిన్న ముక్కలుగా చేయాలి.
చి బంగాళాదుంపను ఉడికించి పైన తొక్కు తీసి మెత్తగా చిదపాలి.
చి ఓ గిన్నెలో బీరకాయ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు, గరంమసాలాపొడి, తగినంత ఉప్పు, బియ్యప్పిండి, కొంచెం నీళ్లు పోసి ముద్దలా కలపాలి.
ఇప్పుడు ఈ ముద్దను చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. వడల్లా వద్దనుకుంటే ఈ పిండి ముద్దను బిళ్లల్లా వత్తి రెండు వైపులా నూనె వేస్తూ పెనంమీద కాల్చుకోవచ్చు కూడా.

బీరకాయ బజ్జీ

కావలసినవి 
బీరకాయ: ఒకటి, సెనగపిండి: 2 కప్పులు, బియ్యప్పిండి: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: టీస్పూను, వంటసోడా: చిటికెడు, వాము: అరటీస్పూను
తయారుచేసే విధానం 
చి ముందుగా బీరకాయ తొక్కు తీసేసి పలుచని గుండ్రని ముక్కలుగా కోసుకోవాలి. ఓ గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు, వాము, వంటసోడా వేసి జారుగా కలపాలి. ఇప్పుడు సెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ఒక్కోదాన్నీ ముంచి కాగిన నూనెలో వేసి వేయించి తీయాలి. వీటిని వేడివేడిగా ఏదైనా చట్నీ అద్దుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.

Monday, August 10, 2015

పొట్లకాయ పెరుగు పచ్చడి

1.పొట్లకాయ 1
2.గట్టి పెరుగు(చిరు పులుపు వుంటే మంచిది) 250ml
3.అల్లం చిన్న ముక్క
4.పచ్చి మిర్చి 3
5.ఉప్పు తగినంత(రుచికి సరిపడా)
6.ఎండు మిర్చి 1 (రెండుగా తుంపి వేసుకోవచ్చును)
7.మినప పప్పు ½ టీ స్పూన్
8.ఆవాలు ¼ టీ స్పూన్
9.జీలకర్ర ¼ టీ స్పూన్
10.మెంతులు ¼ టీ స్పూన్
11.ఇంగువ చిటికెడు(సువాసన కొరకు )
12.కరివేపాకు లేదా కొతిమీర కొద్దిగా
13.నూనె 1 టీస్పూన్
తయారు చేయు విధానం:
1. పొట్లకాయను శుబ్రముగా కడిగి గుండ్రముగా తరుక్కోవాలి పైన చూపించిన చిత్రంలో మాదిరిగా.
2. తరుక్కున్న ముక్కలను ప్రెషర్ పాన్ లో తగినంత నీరు పోసి, తగినంత ఉప్పువేసి స్టవ్ పైన పెట్టుకుని మొదటి విజిల్ వచ్చేక మంట చిన్నదిగా చేసుకుని పది నిమిషాలు వుంచుకోవాలి. రెండవ విజిల్ వచ్చేక స్టవ్ ఆపేసుకోవాలి.
3. ప్రెషర్ విడుదల అయ్యేలోపున అల్లం, పచ్చిమిర్చి ని తీసుకుని మిక్సీ లో తిప్పుకోవాలి లేదా గ్రేటర్ తో కూడా గ్రేట్ చేసుకోనవచ్చును.అల్లం,పచ్చి మిర్చి ముద్దను ఈ పైన చూపిన చిత్రం లో మాదిరిగా ఒక చిన్న బౌల్ లో తీసుకోండి.
4. ఇపుడు పెరుగును ఒక బౌల్లో కి తీసుకుని స్పూన్ లేదా గరిటతో కలియబెట్టండి తొరకలు,మీగడ లేకుండా.
5. పెరుగులో తగినంత ఉప్పు వేసి, అల్లం-పచ్చి మిర్చి ముద్దను కూడా వేసి కలపండి.
6. ఈ లోగా ప్రెషర్ రిలీజ్ అయి వుంటుంది కాబట్టి పాన్ మూత తీసి ముక్కలు బైటకి తీసుకోండి.
7. ముక్కలు వేడిగా వుంటాయి కాబట్టి కొంచెం సేపు చల్లబడిన తరువాత పెరుగులో కలపండి.
8. ఒక పోపు గరిటెను తీసుకుని ఒక టీస్పూన్ నూనె వేసి పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోండి
9.వేగిన పోపును కొంచెం చల్లార్చి పెరుగులో కలపండి .పైన కొంచెం కొతిమీర తురుమును వేస్తె
సువాసనగా వుంటుంది.
వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా:
1. పెరుగు పచ్చడి అన్నంలోకి, అలాగే చపాతీ, పరాటాలతో కూడా రుచిగా వుంటుంది.
2. పైన వుడికిన ముక్కలు చల్లారేక పెరుగులో వేయమని చెప్పటం జరిగింది ఎందుచేతనంటే వేడి ముక్కలు వేస్తే పెరుగు విరిగినట్లుగా అయిపోతుంది
3. కొందరు కొబ్బరి తురుమును కూడా కొద్దిగా పొట్లకాయ ముక్కలతో పాటుగా పెరుగులో కలుపుతారు

Monday, August 3, 2015

చింతచిగురు రైస్

చింతచిగురు రైస్
కావలసినవి:
బియ్యం: కప్పు, చింతచిగురు: 4 కప్పులు, సెనగపప్పు: అరకప్పు, ఎండుమిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: టీస్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, నూనె: 5 టీస్పూన్లు, కొబ్బరితురుము: 2 టీస్పూన్లు, ఉప్పు: 2 టీస్పూన్లు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: 2 రెబ్బలు
తయారుచేసే విధానం:
• చింతచిగురును శుభ్రంచేసి కాడలు, పుల్లలు తీయాలి.
• ఓ గిన్నెలో బియ్యం, సెనగపప్పు వేసి కడగాలి. తరవాత అందులోనే చింతచిగురు వేసి, మూడు కప్పుల నీళ్లు పోసి, టీస్పూను నూనె వేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి.
• బాణలిలో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించి ఉంచాలి.
• ఉడికించిన అన్నం మిశ్రమాన్ని వెడల్పాటి బేసిన్‌లో వేసి ఆరాక వేయించిన పోపు వేసి కలిపితే సరి.