Thursday, January 31, 2013

అటుకుల ఊతప్పం

కావల్సినవి: 

అన్నం - కప్పు, అటుకులు - అరకప్పు, పెరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగు, క్యాబేజీ తురుము - అరకప్పు, ఉప్పు - తగినంత, క్యారెట్ తరుగు - అరకప్పు, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, టమాటా తరుగు - అరకప్పు, క్యాప్సికమ్‌ తరుగు - కొద్దిగా, నూనె - తగినంత, పచ్చిమిర్చి ముద్ద - ముప్పావు చెంచా.

తయారీ విధానం:

అటుకులను తడిపి కొద్ది సేపటికి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత అన్నాన్ని కూడా వేసి ఒకసారి రుబ్బుకోవాలి. ఈ రెండింటినీ గిన్నెలోకి తీసుకొని నూనె తప్ప మిగతా పదార్ధాలు అన్ని వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. రెండు గంటలయ్యాక పెనాన్ని పొయ్యి మీద పెట్టి వేడయ్యాక పిండిని ఊతప్పంలా వేయాలి. చిన్న మంటపై ఉంచి రెండువైపులా నూనెతో కాలనివ్వాలి, వేడివేడి అటుకుల ఊతప్పం రెడీ... సాయంత్రం పూట పిల్లలకు పెడితే బాగా ఇష్టపడి తింటారు.

తీయటి కొబ్బరి లౌజు


తీయటి కొబ్బరి లౌజు

కావాల్సిన పదార్థాలు:
కొబ్బరికాయ: 1
బెల్లం: 1/2kg
పాలు: 1/2cup
యాలకులు: 4
నెయ్యి: 50 grms

తయారు చేయు విధానం:
1. ముందుగా కొబ్బరి కాయను కొట్టి తురుముకోవాలి. తరువాత బెల్లాన్ని కూడా మెత్తగా తురుముకోవాలి.
2. ఇప్పుడు తురిమినబెల్లాన్ని, తురిమిన కొబ్బరిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా వున్నగిన్నె పెట్టి అందులో కలిపి వుంచుకున్న కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని వేసి కొంచెం పాలు జల్లుతూ అడుగంటకుండా తిప్పుతూ వుండాలి.
3. ఇలా పాలన్నీ పోయేవరకు కలిపి గట్టిపడ్డాక కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ యాలకుల పొడి కూడా వేసుకోవాలి.
4. ఇలా ఉడికిన కొబ్బరి మిశ్రమాన్ని స్టవ్ మీదనుండి దించి చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు గా చుట్టుకోవాలి. అంతే తీయని కొబ్బరి లౌజు రెడీ.

లేడిస్ ఫింగర్(బెండకాయ)-ఆనియన్ మసాలా

లేడిస్ ఫింగర్(బెండకాయ)-ఆనియన్ మసాలా


కావలసిన పదార్థాలు:
లేడిస్ ఫింగర్ (బెండకాయ): 15-20
ఉల్లిపాయ: 2
చింతపండు: కొంచెం(గోళి అంత)
కారం: 1tsp
పసుపు: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
మసాలా:
ఆవాలు: 1tsp
జీలక్రర: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
మెంతులు: చిటికెడు
ధనియాలు: 1tbsp
నూనె: సరిపడా
పోపుకోసం:
ఆవాలు: 1/4tsp
జీలకర్ర: 1/2tsp
ఉద్దిపప్పు: 1/4tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా లేత బెండకాయలను నీటిలో వేసి వెంటనే కడిగి ఆరబెట్టుకోవాలి. లేదా పొడి వస్త్రంతో తుడిచి తడి ఆరనివ్వాలి.
2. తర్వత రెండు పక్కలా చివరలను కట్ చేసుకొని కావల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి.
3. చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి చింత పండును అందులో నానబెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీదు పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో మసాలా దినుసులను ఒక దానికి తర్వాత ఒకటి వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
5. అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసి, కొంచెం ఉప్పు చేర్చి మెత్తని పేస్ట్ ను తయారు చేసుకోవాలి.
6. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసుల వేసి వేయించుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటలో ఐదు నుండి పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
7. తర్వాత అందులో మసాలా ముద్దను, కరివేపాకును వేసి వేయించాలి. ఐదు నిమిసాల తర్వాత చింత పండు గుజ్జును కూడా అందులో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
8. బెండకాయ కొద్దిగా ఉడకగానే అందులో కారం, పసుపు, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు బెండకాయ మెత్తగా ఉడికనించి స్టౌ మీద నుండి దించేసుకోవాలి. అంతే లేడిస్ ఫింగర్ ఆనియన్ మసాలా రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

మొక్కజొన్న దోశలు

* మొక్కజొన్న దోశలు

కావలసిన పదార్థాలు:
బియ్యప్పిండి - పావు కప్పు, పచ్చిమిర్చి - 1, స్వీట్‌కార్న్ - 1 కప్పు, పసుపు - చిటికెడు, బొంబాయి రవ్వ - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె - సరిపడా.

తయారుచేసే విధానం:
ఒక పాత్రలో స్వీట్‌కార్న్, పసుపు, రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తగినంత నీటితో దోశల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో తాలింపు వేసి పిండిలో కలిపి అరగంట పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా కొబ్బరిచట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిండిని పులియబెట్టే పని లేదు కాబట్టి సాయంత్రం ఫలహారంగా కూడా చేసుకోవచ్చు.

మొక్కజొన్న చిప్స్

మొక్కజొన్న చిప్స్
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి - ఒకటిన్నర కప్పు, మైదాపిండి - 1 కప్పు, నూనె (పిండిలో కలపడానికి) - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - 1 కప్పు, ఎండుమిర్చి (సన్నముక్కలు) - 1 టీ స్పూను, నూనె - (చిప్స్ వేగించడానికి) సరిపడా.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దని గంట పాటు నానబెట్టి, చపాతీల్లా వత్తుకుని చాకుతో మీకు ఇష్టమైన ఆకారాల్లో (చిప్స్‌గా) కట్ చేసుకోవాలి. తర్వాత నూనెలో దోరగా (కరకరలాడేలా) వేగించుకోవాలి. ఈ చిప్స్‌ని పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టంగా తింటారు.


మొక్కజొన్న పకోడి/గారెలు

మొక్కజొన్న పకోడి/గారెలు

కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు - 1కప్పు, ఉల్లిపాయ -1, శనగపిండి - 1 టేబుల్ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర + పుదీనా తరుగు - 1 కప్పు.
తయారుచేసే విధానం: మొక్కజొన్న గింజల్లో ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి గ్రైండ్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో సన్నని ఉల్లి తరుగు, శనగపిండి వేసి గట్టిగా ముద్దలా కలపాలి. పది నిమిషాల తర్వాత మీకు ఇష్టమైనట్లు పకోడీల్లా లేదంటే గారెల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. చల్లారితే సాగుతాయి కాబట్టి వేడిమీద ఉన్నప్పుడే తినేయాలి.

నువ్వుల లడ్డు

నువ్వుల లడ్డు

- ఇవి కావాలి
నువ్వులు : కప్పు
వేరుశెనగలు: కప్పు
ఖర్జూరాలు : రెండు కప్పులు
...
- ఇలా చేయాలి
నువ్వుల లడ్డూను తయారు చేసేందుకు ముందుగా నువ్వులను, వేరుశెనగలను విడివిడి వేయించుకోవాలి. వేరుసెనగలు చల్లారాక బరకగా పొడి చేసుకోవాలి, అలానే ఖర్జూరాల్లో గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్త గా ముద్ద చేసుకోవాలి. ఖర్జూర ముద్దలో నువ్వులు,సెనగపొడి కలుపుకోవాలి. ఇప్పుడు నచ్చిన పరిమాణంలో ఉండలుగా చుట్టుకుంటే నువ్వుల లడ్డు రెడీ.

అరటికాయ-65

అరటికాయ-65 

తయారీ చేయుటకు పట్టు సమయం :
50 నిమిషాలు
కావలసిన పదార్థాలు సమకూర్చుకొనుటకు :
30 నిమిషాలు
వండుటకు :
20 నిమిషాలు
కావలసిన పదార్థాలు :
అరటికాయలు. 2
కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.
నూనె. తగినంత
మైదా. 25 గ్రా.
గిలకొట్టిన పెరుగు. 1 కప్పు
పచ్చిమిర్చి. 4
కరివేపాకు. 2 రెమ్మలు
కారం. 1 టీస్పూ//
టేస్టింగ్ సాల్ట్.. 1/2 టీస్పూ//
మిరియాలపొడి. 1/4 టీస్పూ//
అల్లంవెల్లుల్లి ముద్ద. 1 టీస్పూ//
ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. 1/4 టీస్పూ//
గ్రీన్ చిల్లీ సాస్. 2 టీస్పూ//
ఉప్పు.. తగినంత
తయారు చేయు విధానం :
ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.

కార్న్‌ఫ్లోర్‌లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, గ్రీన్‌ చిల్లీసాస్‌, టేస్టింగ్‌సాల్ట్‌, ఆరెంజ్‌ రెడ్‌ ఫుడ్‌ కలర్‌, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి.

గుజ్జులా తయారైన దీన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనివ్వాలి.

బాణెలి లో నూనె పోసి, బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.

వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి. బాణిలి లో కొద్దిగా నూనె ఉంచి, మిగిలిన దాన్నంతా వేరే పాత్రలోకి వంపేయాలి.

ఇప్పుడు ఈ బాణిలి ని వేడి చేసి పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించాలి. చివరగా కరివేపాకు చల్లి, గరిటెతో కలిపి దించేయాలి.

న్యూట్రిషన్ ఫుడ్ - క్యారెట్ రైస్

న్యూట్రిషన్ ఫుడ్ - క్యారెట్ రైస్

మనం ప్రతిరోజు తినే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అశ్రద్ద చేయకుండా తింటుంటే పలు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అలాంటి వాటిల్లో క్యారెట్ మంచి ఆరోగ్యకరమైర పోషకాహారం. విటమిన్లు, ఖనిజాలు రె...ండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పర
ిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు.

కావాల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
క్యారెట్ తురుము: 2cups
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-6
ఎండుమిర్చి: 2-3
శెనగపప్పు: 2tbsp
మినప్పప్పు: 2tbsp
ఆవాలు, జీలకర్ర: 2tbsp
గరం మసాలా: 1tbsp
వేయించిన వేరు శెనగ: 3tbsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర తురుము: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. మొదటగా బియ్యం పూర్తిగా ఉడకక ముందు పొడిపొడిగా ఉన్న సమయంలోనే తీసి, తగినంత ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన అన్నంను ఓ ప్లేట్ లో తీసుకుని ఆరబెట్టాలి.
2. తర్వాత స్టౌపై పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపులా చేయాలి. అందులోనే శెనగపప్పు, ఉద్దిపప్పు చేర్చి బాగా వేయించాలి. తర్వాత ముక్కలుగా చేసినా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు క్యారెట్ తురుమును అందులో వేసి, క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడకబెట్టాలి.
4. ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టి చల్లారబెట్టుకొన్నఅన్నంలో కలపాలి.
5. చివరగా వేయించిన వేరుశెనగ పప్పులను బద్దలుగా చేసి, అన్నంలోకలపాలి. ఇక కరివేపాకు, కొత్తిమీరలను పైన చల్లి గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి. దీనికి రైతా మంచి కాంబినేషన్. అంతే క్యారెట్ రైస్ రెడీ....

పెరుగు ఉప్మా

పెరుగు ఉప్మా

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 2 కప్పులు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి - 3, అల్లం తరుగు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, (వేగించిన) వేరుశనగపప్పు - 1 టేబుల్ స్పూను, నెయ్యి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఆవాలు + మినప్పప్పు -1 టీ స్పూను, పుల్ల పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం: రవ్వని అర టేబుల్ స్పూను నెయ్యిలో దోరగా వేగించి, చల్లారనిచ్చి పెరుగులో వేసి అరగంట
నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి (గింజలు తీసి) సన్నగా, పొడుగ్గా తరగాలి. కడాయిలో మిగిలిన నెయ్యి వేసి మినప్పప్పు, ఆవాలు చిటపటమన్నాక, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి తరుగు, వేరుశనగపప్పు వేసి వేగించాలి. తర్వాత 4 కప్పుల నీరు పోసి, ఉప్పు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు పెరుగులో నానబెట్టిన రవ్వని వేసి అడుగంటకుండా సన్న సెగమీద తిప్పుతూ ఉడకనివ్వాలి. ఈ ఉప్మా పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది.

తోటకూర గారెలు

తోటకూర గారెలు

కావలసిన పదార్థాలు:తోటకూర తరుగు - 2 కప్పులు, మినప్పప్పు - 1 కప్పు, పచ్చిమిర్చి-2, అల్లం - అంగుళం ముక్క, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:మినప్పప్పును 2 గంటలు నానబెట్టి చిక్కగా రుబ్బాలి. అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. రుబ్బిన పిండిలో తోటకూర, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి చేత్తో బాగా కలపాలి. పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని (ప్లాస్టిక్ పేపర్‌పైగాని, అరిటాకుపైగాని) గారెల్లా వత్తి మధ్యలో కన్నం పెట్టి, నూనెలో దోరగా వేగించుకోవాలి. వేడి వేడి గారెల్ని టమోటా సాస్‌తో లేదా కొబ్బరి పచ్చడితో తినండి

బంగాళాదుంప గారెలు

బంగాళాదుంప గారెలు




కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు : 250grms
సెనగపిండి : 50grms
బియ్యం పిండి : 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 5
అల్లం: కొద్దిగా
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1/2 cup
ఇంగువ: చిటికెడు
నూనె: కావలసినంత

తయారు చేయు విధానం:
1. ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి వాటికి సెనగ పిండిని చేర్చి, ఆ మిశ్రమానికి ఉప్పు, బియ్యం పిండి, నూనెలో వేయించిన ఆవాలు, పచ్చి మిరప కాయలను కలపాలి.
2. అలాగే కొత్తిమీర, ఇంగువ, కరివేపాకులను కూడా దానికి చేర్చి ముద్దలా చేసుకోవాలి.
3. ఆ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా చేసుకొని స్టౌ పై పాన్ పెట్టి కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే బంగాళాదుంపలతో గారెలు రెడీ. వీటికి గ్రీన్ చట్నీ మంచి కాంబినేషన్.

అటుకుల గారెలు


అటుకుల గారెలు

కావలసిన పదార్థాలు:అటుకులు - 2 కప్పులు, బంగాళదుంపలు - 100గ్రా, బ్రెడ్ స్లయిస్ -3, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం తరుగు - 1 టీ స్పూను, పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, జీలకర్ర - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:అటుకుల్ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. బంగాళదుంపని ఉడికించి
తొక్కతీసి మెదపాలి. బ్రెడ్ స్లయిస్‌ని నీటిలో తడిపి చిదమాలి. ఒక వెడల్పాటి పాత్రలో అటుకులు, బంగాళదుంప గుజ్జు, చిదిమిన బ్రెడ్, ఉల్లి, మిర్చి, పుదీనా, అల్లం తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. నిమ్మకాయంత ఉండలు చేసుకుని అరచేతిలో గారెల్లా వత్తుకుంటూ నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి టమేటో సాస్‌తో బాగుంటాయి.

వెజిటబుల్ పులావ్


వెజిటబుల్ పులావ్

కావలసిన పదార్ధాలు:
బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బంగాళా దుంపలు లేదా ఆలూ: నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
లవంగాలు: అయిదు ఆరు
యాలకులు : అయిదు ఆరు
దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
పసుపు: చిటికెడు ( రంగు కోసం )
ఉప్పు : రుచికి తగినంత
నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు)
బిర్యాని ఆకు : రెండు మూడు

తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.


ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.

ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.

అవి కొంచెం వేగ నివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.
పులావ్ తో పాటు ఉల్లిపాయ రైతా చేసుకుంటే బాగుంటుంది.

పప్పు చెక్కలు

పప్పు చెక్కలు

కావలసిన పదార్ధాలు :
వరిపిండి : అర కిలో
నీరు : అర లీటరు
శనగపప్పు : యాభై గ్రాములు ( రెండు గుప్పెళ్ళు సుమారు), రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి
కారం : రెండు స్పూన్లు లేదా పచ్చిమిర్చి పేస్టు : రెండు స్పూన్లు
కరివేపాకు: రెండు మూడు రెబ్బలు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టుకొని అందులో నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగాక అందులో సెనగపప్పు, కారం , ఉప్పు, చిన్న చిన్నగా తుంపిన కరివేపాకు మరియు వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాసు ఆపేసి తయారైన మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వాలి.




ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కాని పల్చగా వత్తుకోవాలి.


అలా వత్తిన వాటిని బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి . ఇలాగే మిగిలిన పిండితో కూడా చెక్కలు వత్తుకొని వేయించుకోవాలి. చల్లారిన చక్కలను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవచ్చు.

కాలీ ఫ్లవర్ మంచూరియా


కాలీ ఫ్లవర్ మంచూరియా


Gobhi-కావలసిన పదార్థాలు:కాలీ ఫ్లవర్ : చిన్నది ఒకటి
మైదా : నాలుగు చెంచాలు
కార్న్ ఫ్లోర్ : ఎనిమిది చెంచాలు
పసుపు : చిటికెడు
కొత్తిమీర : ఒక కట్ట
రెడ్ కలర్ : తగినంత
నూనె : సరిపడా
అజీనామోటో : తగినన్ని
ఉల్లికాడలు : తగినన్ని
ఉప్పు : తగినంత
కారం : తగినంత
టమోటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్: చాలినంత
తయారు చేసే పద్ధతి:కాలీ ఫ్లవర్‌ను పువ్వులుగా విడగొట్టాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, కలర్ కలుపుకోవాలి. తర్వాత అందులో కాలీ ఫ్లవర్‌ను ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి. తర్వాత మూకుడులో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. అందులో సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, అజీనామోటో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 —

పన్నీర్ 65

పన్నీర్ 65

పన్నీర్ 65 కావలసినవి 
పన్నీర్ ముక్కలు 1 కప్
కార్న్ ఫ్లోర్ 1 కప్ 
మైదా 4 స్పూన్స్
కారం 2 స్పూన్స్
ధనియాల పొడి 2 స్పూన్స్
అమ్ చూర్ పొడి 2 స్పూన్స్
కొత్తిమీర కట్ట
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
ఉప్పు సరిపడా
నూనె వేయించడానికి సరిపడా
తయారుచేయువిధానం ముందుగా పన్నీరు ముక్కలు వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి .ఒక బౌల్ తీసుకుని మైదా ,కార్న్ ఫ్లోర్ ,ఉప్పు,ధనియాలపొడి ,అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,గరం మసాల వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి .స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి అయ్యాక ఈ పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి డీప్ ఫ్రాయ్ చెయ్యాలి అన్ని అయ్యాక పైన అమ్ చూర్ ,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే పన్నీర్ 65 రెడి ఇవి టమాట సాసు తో తింటే బాగుంటాయి

ఆలు 65

ఆలు 65

ఆలు 65 కావలసినవి
ఆలు 4 
మైదా 1 కప్
కార్న్ ఫ్లోర్ 4 స్పూన్స్
బియ్యం పిండి 4 స్పూన్స్
కారం 2 స్పూన్స్
గరం మసాలాపొడి 2 స్పూన్స్
అమ్ చూర్ పొడి 2 స్పూన్స్
చాట్ మసాలాపొడి 1 స్పూన్
టమాటా సాసు 1 కప్
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి సరిపడా
కొత్తిమీరకట్ట
తయరుచేయువిధానం ముందుగ ఆలుగడ్డలు పీలర్ తో సుబ్రం చేసుకుని సన్నగా ,పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి .ఒక బౌల్ తీసుకుని మైదా.బియ్యంపిండి.కార్న్ ఫ్లోర్ .,కారం,ఉప్పు,గరం మసాలాపొడి వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలపాలి .స్టవ్ మీద నూనె పెట్టుకుని వేడి అయ్యాక పిండిలో ఆలు ముక్కలు ముంచి వేయించాలి అన్ని వేగేకా పైన అమ్ చూర్ ,చాట్ మసాల ,కొత్తిమీర చల్లాలి

ఆలూ బోండా


ఆలూ బోండా

ఆలూ బోండా కావలసినవి
బంగాలదుంపలు 4
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
సెనగపిండి 1 కప్
బియ్యం పిండి 2 స్పూన్స్
ఉప్పు సరిపడా
కారం 1 స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
తయారుచేయువిధానం ముందుగ ఆలూ ఉడికించుకుని తొక్క తీసి చిదిపిపెట్టుకోవాలి .ఉల్లిపాయలు,పచ్చిమిర్చిసన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చివేయించాలి సరిపడా,.ఉప్పు,కారం,అల్లంవేల్లుల్లిపెస్ట్ కరివేపాకు వేసి ,.అలూగడ్డ ముద్దకుడా వేసి కూర చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసుకోవాలి ఇంకోగిన్నెలో సెనగపిండి బియ్యంపిండి,ఉప్పు కారం వేసినీళ్ళు కలిపి బజ్జిపిండి కలుపుకోవాలి .అలూకూరని నిమ్మకాయంత ముద్దా తీసుకుని బజ్జిపిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి

"మెంతి కారం కూర"

"మెంతి కారం కూర"


కావలసిన పదార్థాలు :
చిక్కుడుకాయలు... పావు కేజీ
నూనె... ఆరు టీ.
ఉప్పు... తగినంత
పసుపు... అర టీ.
చింతపండు గుజ్జు... రెండు టీ.
ఎండుమిర్చి... ఆరు
ధనియాలు... రెండు టీ.
శెనగపప్పు... ఒక టీ.
మినప్పప్పు... ఒక టీ.
మెంతులు... ఒక టీ.
జీలకర్ర... అర టీ.
ఇంగువ... చిటికెడు
ఎండుకొబ్బరి ముక్కలు... అర కప్పు

తయారీ విధానం :
ముందుగా చిక్కుడుకాయలు కడిగి ముక్కలు చేసి ఉంచాలి. స్టవ్‌మీద కడాయిపెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి కాగాక, మిరపకాయలు, ధనియాలు, సెనగపప్పు వేయాలి. అవి సగం వేగిన తరువాత మిగిలిన పోపు సామాను కూడా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అదే కళాయిలో మిగిలిన నూనె పోసి చిక్కుడు ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి మూతపెట్టాలి.

ఈలోపు వేయించి ఉంచిన పోపు గింజల్ని మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఇందులోనే ఎండుకొబ్బరి కూడా వేయాలి. చిక్కుడుకాయల ముక్కలు కాస్త మెత్తబడ్డాక, నూరుకున్న పొడిని కూరలో వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి, మంట తగ్గించి మూతపెట్టి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత వేడి వేడి అన్నంతో కలిపి వడ్డించాలి. కారాన్ని బాగా ఇష్టపడేవారికి ఈ కూర బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి మరి..!

తెల్ల నువ్వులతో వంకాయ కొబ్బరి కూర

తెల్ల నువ్వులతో వంకాయ కొబ్బరి కూర
కావలసిన పదార్థాలు :
వంకాయలు... పావు కేజీ
పచ్చికొబ్బరి చిప్ప... పెద్దది ఒకటి
తెల్లనువ్వులు... 50 గ్రాములు
గసగసాలు... రెండు టీ.
పచ్చిమిరపకాయలు... పది
నూనె... అర కప్పు
పసుపు... చిటికెడు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
వంకాయలను గుత్తి వంకాయ కూరకు కోసినట్లుగా కోసుకుని ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. పచ్చి కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, పచ్చిమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసి వంకాయల్లో కూరాలి.

ఆ తరువాత ఓ కడాయిలో నూనె పోసి వంకాయలను అందులో సమానంగా సర్దాలి. పైన పసుపు చల్లి కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టాలి. మూతమీద కూడా నీళ్లు పోయాలి. ఎందుకంటే, మూతపైన కూడా నీటిని పోయటం వల్ల కూరలో నేరుగా నీరు పోయకపోయినా ఆవిరి లోపలికి వెళ్లి తక్కువ నూనెతో బాగా ఉడుకుతుంది కాబట్టి.

కూర ఉడుకుతుండగా... మధ్యమధ్యలో, మూత తీసి పక్కన పెట్టి, కడాయిని రెండు చేతులతో పట్టుకుని కిందికీ పైకీ కుదపాలి. ఇలా చేసినట్లయితే... కాయలు విడిపోకూండా ఉంటాయి. కాయలు మెత్తగా ఉడికిన తరువాత దించేసి, వేడి వేడి అన్నంతోనూ, చపాతీలతోనూ కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. మీరూ ప్రయత్నించి చూస్తారు కదూ...!

పుదీనా పలావు

కావలసిన పదార్థాలు...
పుదీనా - 3 కట్టలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
తాజా కొబ్బరి తురుము - పావుకప్పు
పచ్చిమిర్చి - 4
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి) 
అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌ 
లవంగాలు - 5
యాలకులు - 5
దాల్చిన చెక్క - 5
పలావు ఆకులు - 5 
అనాసపువ్వు - ఒకటి లేదా రెండు 
వేయించిన జీడిపప్పు - పావుకప్పు
నెయ్యి - 3 టీస్పూన్లు
ఉప్పు - సరిపడినంత

తయారు చేసే విధానం... 
పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీ స్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. 

ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి. తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్‌ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.

సగ్గు బియ్యం వడలు


సగ్గు బియ్యం వడలు

కావలసిన పదార్ధాలు;-

సగ్గుబియ్యం ; 2 కప్పులు
మైదాపిండి ; 1 కప్పు
బియ్యపుపిండి ; అర కప్పు
ఉప్పు ; 1 స్పూన్
పచ్చిమిరపకాయలు ; 8
బంగాళదుంపలు ; 3

తయారుచేసే విధానం ;-

ముందుగ సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నీటిలో నానపెట్టాలి.తరవాత బంగాళా దుంపలను ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని బంగాళా దుంపల పేస్ట్ ని ,మైదాపిండిని,బియ్యపుపిండిని వేసి పచ్చిమిరపకాయలను కూడా గ్రింద్ చేసి వేసి ,వుప్పుకుడా వేసి బాగా కలపాలి.తరవాత స్టవ్ మీద బాండి పెట్టి దానిలో నునే పోసి నునే వేడెక్కాక ఇందాక మనం కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక కవర్ మీద కొద్దిగా నునే రాసి చిన్న ముద్దా తీసుకుని వడ లాగ వత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. అంతే వేడి వేడి ఘుమఘుమ లాడే సగ్గుబియ్యం వడలు రెడీష్టమైన వాళ్ళు ఈవదలలో కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవచ్చు .

Wednesday, January 30, 2013

ఆంధ్ర మసాలా వడ


ఆంధ్ర మసాలా వడ
కావలసిన పదార్థాలు:
పచ్చిశెనగపప్పు: 1cup
ఉల్లిపాయలు(చిన్న ముక్కలుగా కట్ చేసినవి): 1/2cup
కొత్తిమీర, పుదీనా తరుగు: 1cup
పచ్చిమిర్చి: 6-8
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 4-6
లవంగాలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి తగినంత
వంట సోడా: చిటికెడు(అవసరమనుకొంటే)

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చి శెనగపప్పును శుభ్రం చేసి మూడే - నాలుగు గంట సేపు నానబెట్టుకోవాలి.
2. అంతలోపు ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరిగి పక్కన పట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఉప్పు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోనికి తీసుకొని అదే జార్ లో నానబెట్టుకొన్న శెనగపప్పును బరగకగా, కొంత బాగం మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
5. గ్రైండ్ చేసుకొన్న పప్పును మసాలా మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే అందులో తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక, మసాలా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో పెట్టి వడలుగా కావాల్సిన సైజుల్ వత్తుకొని కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

మష్రుమ్(పుట్టగొడుగుల) కర్రీ

 మష్రుమ్(పుట్టగొడుగుల) కర్రీ

పుట్టగొడులకు కొంచెం మసాలా కారంగా పట్టించినట్లైతే ఆ స్పైసీ సువాసనతో నోరూల్సిందే. మష్రుమ్ చాలా సున్నితంగా స్పాంజ్ లాగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి కడిగితే విరిగిపోతాయి. కాబట్టి ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకుండా నీటిలో వేసి తీసేయాలి. లేదా పొడి బట్టతో సున్నితంగా తుడిచేయవచ్చు. పుట్టగొడులల్లో ఫ్రైబర్(పీచు)ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో నీటిశాతం ఎక్కువ మరియు సోడియం కూడా ఉంటుంది. బరువు తగ్గించే ఉత్తమమైన ఆహారం కూడా. అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయి.

కావలసిన పదార్థాలు:
మష్రుమ్: 1cup
ఆవాలు: 1/4tsp
జీలకర్ర: 1/4tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా కోసం
ఉల్లిపాయ(చిన్నగా కట్ చేసుకోవాలి): 1
టమోటో(చిన్నగా కట్ చేసుకోవాలి): 1
పుదీనా ఆకులు: 6
కొత్తిమీర తరుగు: 2tbsp
జీడిపప్పు: 5
పచ్చిమిర్చి: 5

తయారు చేయు విధానం:
1. ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. అందుకోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో శుభ్రం చేసుకొన్న మష్రుమ్ ను వేసి కొద్దిగా ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో మసాలా పేస్ట్ వేసి తక్కువ మంట మీద మసాలాను బాగా వేయించాలి.
4. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే సమయంలో వేయించి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును అందులో వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత మూత పెట్టి అతి తక్కువ మంట మీద మష్రుమ్ ను ఉడికించుకోవాలి. అంతే మష్రుమ్ మసాలా రెడీ. ఇది చపాతీ, రోటీలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

బ్రెడ్ బోండా

బ్రెడ్ బోండా

కావలసిన పదార్థాలు
బ్రెడ్: 5స్లైసెస్
బంగాళదుంప: 3
పచ్చిబఠానీలు: 2tbsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర తరుగు: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్తమీరను నీళ్ళలో కడిగి చిన్ని చిన్న తరుక్కోవాలి. అలాగే బంగాళదుంపలను కూడ కడిగి రెండు లేదా మూడ బాగాలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి, అందులో కట్ చేసి పెట్టుకొన్న బంగాళాదుంపల ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనిచ్చి పై పొట్టు తీసి బంగాళదుంపలను చిదిమి పెట్టుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి వేయించి వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తర్వాత అందులో ఉడికించిన పచ్చిబఠానీలను, ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, పసుపు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
6. బంగాళదుంప కర్రీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బంగాళదుంపను కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని గుండ్రగా బాల్స్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని చివరలు కట్ చేసి(తొలగించి) బ్రెడ్ ను తడిచేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ లో ముందుగా తయారు చేసుకొన్న పొటాటో మిశ్రమం యొక్క బాల్స్ ను పెట్టి రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
8. స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ బాల్స్ ను వేడినూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొన్నాక బ్రెడ్ బోండాలమీద చాట్ మసాలాను చిలకరించుకొని కొత్తమిర తరగుతో గార్నిష్ చేసి గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. బ్రెడ్ బోండా రెడీ.

ఆలూ మిర్చీ బజ్జీ.

 ఆలూ మిర్చీ బజ్జీ.

మిర్చీ బజ్జీ ఇండియన్ హాట్ స్నాక్. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ మిర్చీబజ్జీయే .వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి మిర్చీ బజ్జీ భలే రుచిగా ఉంటుంది. మిర్చీ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంత మంది మాత్రం పచ్చిమర్చిని తినడానికి బయపడుతుంటారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా అధికమే.

కావలసిన పదార్థాలు:
బజ్జీ పచ్చిమిర్చి (పొడవైనవి): 20
బంగాళాదుంపలు: 1/4kg
కారం: 1tbsp
గరం మసాలా: 1tbsp
చాట్ మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
పిండికోసం:
శెనగపిండి: 250grms
బేకింగ్ సోడా: 1tsp
కారం: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

1. ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడికగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక సైడ్ మద్యకు పొడవుగా కట్ చేసి మద్యలో నుండి మిర్చీలోని గింజలను తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి చిదిమి పెట్టుకోవాలి. దానికి కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు చేర్చి అన్నింటినీ బాగా కలగలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని (మిర్చి సంఖ్య)20 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో మిశ్రామన్ని డలుగా లేదా మిర్చి పొడవుగా చేత్తో రుద్దుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి. ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బజ్జీలను వేయడానికి బజ్జీ పిండిని తయారు చేసుకోవాలి. అందుకు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5. పది నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగే నూనె లోవేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, ప్లేట్ లోనికి తీసుకొని కోకన్ చట్నీ లేదా పుదీనా చట్నీతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.