Friday, February 15, 2013

పెసర గారెలు

పెసర గారెలు

పచ్చి పెసలు - 1 కిలో
ఛాయ మినపప్పు - కప్పు
నూనె - తగినంత
పచ్చిమిర్చి - 50 గ్రా
అల్లం - అంగుళం ముక్క
జీలకర్ర - టీ స్పూన్‌
ఉప్పు - సరిపడినంత

తయారు చేసే విధానం...
పెసలు, మినపప్పు కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచాలి. ఉద యాన్నే నీళ్ళు వంపేసి అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. తగినంత ఉప్పు కూడా కలపాలి. తడి బట్ట మీద గానీ లేదా పాలకవర్ల మీద గానీ మనకు కావలసిన సైజులో గారెలు వత్తి నూనెలో దోరగా వేయించి తీయా లి. 3 రోజుల వరకూ నిల్వ ఉంటా యి. అల్లం, వేరుశనగ, ఏ పచ్చ డితో తిన్నా ఇవి రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment