Thursday, February 14, 2013

సగ్గు బియ్యం రోటి


సగ్గు బియ్యం రోటి 
కావలిసినవి :
సగ్గు బియ్యం - కప్పు
బంగాళా దుంప -
పచ్చిమిర్చి - నాలుగు 
నూనె - పావు కప్పు 
వేరుసేనగలు - కప్పు 
కొత్తిమిర - కొద్దిగా 
ఉప్పు - సరిపడా 
తయారి :
వేరుసేనగాలిన్ని నూనె లేకుండా వేయంచాలి .చల్లారక పొట్టు తీసి మిక్సిలో మెత్తగా పొడి చేసుకోవాలి .బంగాళదుంప పొట్టు తీసి తురుముకోవాలి .తరువాత సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి ఐదు నిముషాలు అయ్యకా ఒంపేసి పక్కన పెట్టుకోవాలి .
మూడు గంటలయ్యాక నానిన సగ్గు బియ్యంలో పచిమిరిచి తరుగు ,కొత్తిమిర ,ఉప్పు,
బంగాళదుంప వేసి బాగా కలపాలి .ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి చేతితో ఒతుకోవాలి.వీటిని పెనం మీద రెండు వైపుల నూనెతో కాల్చుకోవాలి .
వేడి వేడి సగ్గు బియ్యం రోటిలను కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి . 

0 comments:

Post a Comment