Friday, February 15, 2013

మజ్జిగ మిరపకాయలు , పెరుగు మిరపకాయలు , లేక చల్ల మిరపకాయలు ;

మజ్జిగ మిరపకాయలు , పెరుగు మిరపకాయలు , లేక చల్ల మిరపకాయలు ;

కావలసిన పదార్థాలు

పచ్చిమిరపకాయలు - అరకిలో

పెరుగు - పావులీటరు, జీలకర్ర - 5 స్పూన్లు, ఉప్పు - తగినంత

తయారు చేసే పద్ధతి

పెరుగును చిలికి మజ్జిగ చెయ్యాలి. నూరిన జీలకర్ర, ఉప్పును అందులో కలపాలి. మిరపకాయలను కడిగి

తొడిమ విడిపోకుండా నిలువుగా గాటు పెట్టుకోవాలి. వీటిని మజ్జిగలో నానబెట్టాలి. ఒక రోజు నానిన

తర్వాత ఎండలో ఆరబెట్టాలి. మళ్లీ సాయంత్రం అదే మజ్జిగలో వేసి మరుసటి రోజు ఉదయం తిరిగి

ఎండబెట్టాలి. ఇలా మజ్జిగంతా అయిపోయేవరకు రోజూ వేసి తీస్తుండాలి. మిరపకాయలు బాగా ఎండిన

తర్వాత గాలి చొరబడని డబ్బాలో వేసుకోవాలి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో

వేయించుకోవచ్చు.

0 comments:

Post a Comment