Tuesday, February 19, 2013

ముల్లంగి పరోటా

ముల్లంగి: 1(తురుము) ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి) చాట్ మసాలా: 1tsp జీలకర్ర పొడి: 1/2tsp గోధుమ పిండి: 2cups మైదా: 1/2 cup అజ్వైన్: 1/2tsp నెయ్యి: 2tbsp నూనె: 1tbsp ఉప్పు: రుచికి సరిపడా తయారు చేయు విధానం: 1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అవ్వగానే, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. 2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 3,4 నిముషాల వేగించాలి. తర్వాత అందులో ముల్లంగి తురుమును వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు బాగా ఫ్రై చేయాలి. 3. తర్వాత అందులోనే ఉప్పు, కొత్తిమీర తరుగు మరియు చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాల ఫ్రై చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. 4. ఇప్పుడు ఒక బౌల్లో మైద, గోధుమపిండి, అజ్వైన్ మరియు ఉప్పు, ఇక చెంచా నెయ్యి వేసి, తగినన్ని గోరువెచ్చని నీళ్ళు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 5. తర్వాత చపాతీ పిండిని చిన్నచిన్న ఉండలు చేసుకొని మద్యలో వత్తుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న ముల్లంగి మిశ్రమాన్ని ఒక చెంచా పెట్టి కవర్ చేయాలి. 6. ఇలా అన్ని చాపాతీ బాల్స్ నింపి పెట్టుకొన్న తర్వాత ఒక్కొక్కటే చపాతీ కర్రతో చపాతీలా వత్తుకోవాలి. దీన్ని పాన్ మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా బాగా కాలేలా మీడియం మంట మీద కాల్చుకోవాలి . అంతే ముల్లంగి పరోటో రెడీ...

0 comments:

Post a Comment