Thursday, February 28, 2013

గార్లిక్ రైస్

గార్లిక్ రైస్ (వెల్లుల్లి రైస్)వెల్లుల్లి తో తయారు చేసే వంటలంటే కొంచెం ఘాటు.. కొంచెం కారంగా ఉండటం సహజం. కారం మాత్రమే కాదు, మంచిటేస్ట్ కూడా. ఆరోమాటిక్ గార్లిక్ రైస్ ఇండియన్ రైస్ రిసిపి. ఒక రకంగా దీన్ని పులావ్ రిసిపి అనవచ్చు . గార్లిక్ రైస్ (వెల్ల్లుల్లిపాయను) చితగ్గొట్టుకొని బాస్మతి రైస్, కొన్ని మసాలా దినుసులు, బిర్యాని ఆకుతో తయారు చేస్తారు .

ఇంకా ఈ గార్లిక్ రైస్ కు మీరు కావాలనుకుంటే కొన్ని కూరగాయల ముక్కలు కూడా చేర్చుకోవచ్చు. ఇది ఒరిజిన ఫ్లేవర్ కు ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. అదే టేస్ట్ అదే సువాన కలిగి ఉంటుంది. మీరు కనుక క్యారెట్, బీట్ రూట్, బీన్స్ మరియు గ్రీన్ పీస్ మిక్స్ చేసుకొన్నట్లైతే వెజిటేరియన్ పులావ్ రిసిపిలాగా తయారవుతుంది. కానీ గార్లిక్ రైస్ మాత్రం అదే టేస్ట్ తో వెజిటేబుల్స్ అవసరం లేకుండానే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి పాయలు:20(చితగొట్టుకోవాలి)
బాస్మతి రైస్:2 cups
పచ్చిమిర్చి:4 (మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండుమిర్చి:3
ధనియాలు:1tsp
జీలకర్ర:1/2 tsp
బిర్యాని ఆకు:1
సోంపు:1/2 tsp
జీడిపప్పు:10 (chopped)
వేరుశెనగపప్పు:10
నెయ్యి:2tsp
ఉప్పు:రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో డు మిర్చి, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా నీళ్ళు పోసి, గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
2. తర్వాత కుక్కర్ లో కొద్దిగా నెయ్యి వేసి, వేడిఅయ్యాక అందులో జీడిపప్పు మరియు వేరుశెనగపప్పు వేసి ఒక నిముషం వేగించి, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత అదే నెయ్యిలో సోంపు, బిర్యానీ ఆకు మరియు పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఎండు మిర్చి మిశ్రమాన్ని కూడా వేసి పోపుతో బాగా మిక్స్ చేస్తూ 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించాలి.
4. ఇప్పుడు అందులోనే చితగొట్టి పెట్టుకొన్నవెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద వేగింగుకోవాలి.
5. ఇప్పుడు అందులో బాస్మతి రైస్ శుభ్రం చేసి వేసుకోవాలి. బియ్యాన్ని వేగుతున్న మసాలా తో బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు వేగించాలి.
6. తర్వాత మూడు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల అలాగే ఉంచి తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకొన్న జీడిపప్పు, వేరుశెనగపప్పుతో గార్నిష్ చేసి ఏదైనా స్పైసీ కర్రీస్ తో వేడి వేడి గా సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment