Monday, February 4, 2013

* జీడిపప్పు వెజ్ పకోడి

* జీడిపప్పు వెజ్ పకోడి
కావలసిన పదార్థాలుం
క్యారెట్ తురుము: 1/2cup
క్యాబేజి తరుగు: 1/2cup
బంగాళదుంప తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 4
శనగపిండి: 4cup
ఉల్లిపాయలు: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
కారం: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
సోడా: 1/2tsp
జీడిపప్పు: 1/2cup
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానము:
1. నూనె మినహా మిగతా పదార్థాలన్నీ వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి సరిపడా నీటితో పకోడీ పిండిలా తడుపుకోవాలి.
2. పాన్ లో నూనె వేడయ్యాక పకోడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని కాగిన నూనెలో జారవిడవాలి.
3. పకోడిలు ఎరుపు రంగు వచ్చేవరకు వేయించి తీసి టిష్యూ పై వేయాలి.
4. ఇష్టమైన చట్నీతోగాని, టొమోటో కెచప్ కాంబినేషన్ లో గాని సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment