బంగాళ దుంపలు: 3
బ్రెడ్ స్లైసులు : 4
గరం మసాలా: అరచెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూను
కొత్తిమీర తురుము: 1 చెంచా
జీడిపప్పు పొడి: 1 చెంచా
కారం: 1 చెంచా
ధనియాలపొడి: 1చెంచా
జీలకర్ర పొడి: 1 చెంచా
ఉప్పు: తగినంత
నూనె: అవసరమైనంత
తయారు చేసే విధానం:
బంగాళదుంపలను ఉడికించి, తోలు తీసి మెత్తగా చిదుముకోవాలి. బ్రెడ్ స్లైస్‌ను పొడి చేసి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఉప్పు మినహా బంగాళదుంపతో పాటు ఇతర దినుసులను అన్నీ వేయాలి. ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత దించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని బ్రెడ్ పొడిలో దొర్లించి న పెనం మీద కాల్చుకోని అయినా తినవచ్చు లేదా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. టమేటో కెచప్‌తో కలిపి వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.
0 comments:
Post a Comment