Thursday, February 7, 2013

మెంతి పెరుగు

మెంతి పెరుగు 

కావాల్సిన పదార్ధాలు 

పెరుగు -- అర కేజీ 
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్
పసుపు -- చిటికెడు
ఆవాలు -- అర టీ స్పూన్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఇంగువ -- అర టీ స్పూన్
వాము -- ఒక టీ స్పూన్
నెయ్యి -- రెండు టీ స్పూన్స్
ఎండు మిరపకాయలు -- 5
పచ్చిమిరప కాయలు -- 6
కొత్తిమీర -- పావు కట్ట

తయారు చేసే విధానం;-

ముందుగ ఒక గిన్నెలో పెరుగును తీసుకుని అందులో ఉప్పు,పసుపు వేసి కవ్వం తో బాగా గిలక కొట్టి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి,ఆవాలు,మెంతులు,వాము,ఇంగువ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును వేయించాలి.వేగిన పోపులో పచ్చిమిరప ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి ఒక రెండు నిముషాలు ఉంచి మనము ఇందాక పక్కన పెట్టిన పెరుగులో వేసి బాగా కలపాలి.అంతే ఘుమఘుమ లాడే చిక్కని చక్కని మెంతి పెరుగు రెడీ.

0 comments:

Post a Comment